»   » అందుకే అపుడు దేశం విడిచి పారిపోయాను: ఇలియానా

అందుకే అపుడు దేశం విడిచి పారిపోయాను: ఇలియానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పుడు సౌత‌్‌లో టాప్ హీరోయిన్‌గా తన హవా కొనసాగించిన ఇలియానా... తర్వాత బాలీవుడ్ వైపు అడుగులు వేసి అక్కడ కూడా అవకాశాలతో దూసుకెలుతోంది. బాలీవుడ్లో సీనియర్ హీరోలైన అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ తదితరులతో పాటు.... నెక్ట్స్ జనరేషన్ హీరోలు వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, మిడిల్ జనరేషన్ హీరోలు రణబీర్ కపూర్, షాహిద్ కపూర్ లాంటి వారితో నటించిన ఏకైక నటి ఇలియానా. అంతే కాకుండా సౌత్ లో దాదాపు అందరు టాప్ హీరోలతో ఆమె నటించింది.

ప్రస్తుతం బాలీవుడ్లో సంతృప్తికరంగా కెరీర్ కొనసాగిస్తున్న ఇలియానా.... ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 15 ఏళ్ల వయసులోనే తాను హీరోయిన్‌గా అవకాశం వచ్చిందని తెలిపారు.

కొన్ని చెత్త యాడ్స్ చేశాను

కొన్ని చెత్త యాడ్స్ చేశాను

15 ఏళ్ల వయసులోనే మోడల్ గా కెరీర్ ప్రారంభించాను. ఆ సమయంలో కొన్ని చెత్త యాడ్స్ కూడా చేశాను. సినిమా అవకాశాలు రావడంతో మోడలింగ్ మానేశాను. 15 సంవత్సరాల వయసున్నపుడే తెలుగులో తొలి ఆఫర్(దేవదాసు) వచ్చింది అని ఇలియానా తెలిపారు.

అందుకే ఒప్పుకున్నాను

అందుకే ఒప్పుకున్నాను

తొలి అవకాశం వచ్చినపుడు తనకు తెలుగు బాష రాదని, యాక్టింగ్ సరిగా రాదని చెప్పానని.... అయితే వారే మ్యానేజ్ చేసుకుంటామని చెప్పారని. తొలి సినిమా షూటింగ్ అమెరికాలో అని చెప్పడంతో అమెరికా వెళ్లొచ్చనే కారణంతోనే ఒప్పుకున్నట్లు ఇలియానా తెలిపారు. ఆ తర్వాత తనకు ఇంత ఆదరణ లభిస్తుందని ఊహించలేదన్నారు.

దేశం విడిచి పారిపోయాను

దేశం విడిచి పారిపోయాను

తనకు తెలుగు, హిందీ భాషలు అస్సలు రావని... అందుకే సెట్స్ లో ఎక్కువగా ఇంగ్లీష్ లోనే మాట్లాడేదాన్నని ఇలియానా తెలిపారు. తన తొలి నాళ్లలో సినిమా ప్రమోషన్లలో మీడియా ప్రతినిధులు తనను హిందీలో మాట్లాడమని కోరేవారని... అప్పుడు చాలా భయమేసేదని చెప్పింది. ఆ భయంతోనే మూడు వారాల పాటు ఇండియాను వదిలి వెళ్లిపోయానని... కొన్ని రోజులు తనను ఒంటరిగా వదిలేయమని దర్శకులకు చెప్పేదాన్నని తెలిపింది.

చికిలీ చమేలీలా ఉండేదాన్ని

చికిలీ చమేలీలా ఉండేదాన్ని

సౌత్‌లో, ముఖ్యంగా తెలుగులో అందరు అగ్రహీరోలతో చేశాను. మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, రవితేజ ఇలా అందరితో నటించాను. హిందీలో నా ఫస్ట్ ఫిల్మ్ బర్ఫీ. ఇది చాలా డిఫరెంట్ ఫిల్మ్. సౌత్ లో చికిలీ చమేలీలా ఉండేదాన్ని.... బాలీవుడ్లో తొలి సినిమా కోసం డీ గ్లామరస్ గా నటించాల్సి వచ్చింది అని ఇలియానా తెలిపారు.

ఇలియానా

ఇలియానా

ప్రస్తుతం ఇలియానా బాలీవుడ్లో ‘బాద్షాహో', ముబారకన్ అనే రెండు చిత్రాల్లో నటిస్తోంది. 11 సంవత్సరాల్లో ఇప్పటి వరకు 21 సిమాల్లో నటించాను. ముబారకన్ నా 22వ చిత్రమని ఇలియానా వెల్లడించారు.

English summary
"I only spoke English. During promotions when they wanted me to speak in Hindi, I had a panic attack and which is why, I fled the country. I said, ‘Please leave me alone for three weeks.’ Again, I didn’t expect people to like me. I was like, ‘How could I pass off as a Bengali in the film,’ and Dada (Anurag Basu) even made me dub for the film. It was a little too overwhelming." Ileana D’Cruz said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X