twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో...వర్మ ‘26/11 అటాక్స్’

    By Bojja Kumar
    |

    ముంబై : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 26/11 ముంబై దాడుల సంఘటనపై సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. 'ద అటాక్స్ ఆఫ్ 26/11' పేరుతో రూపొందుతున్న ఈచిత్రాన్ని తెలుగులో '26/11 దాడులు' పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్రం బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపికయింది.

    ఈ చిత్ర నిర్మాత పరాగ్ సంఘ్వీ ఈ విషయం వెల్లడించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పరాగ్ సంఘ్వీ మాట్లాడుతూ...మా చిత్రానికి ప్రతిష్టాత్మకమైన బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చోటు దక్కడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని వర్మ ఎంతో బాగా తెరకెక్కించారు' అని చెప్పుకొచ్చారు. పనోరమ విభాగంతో పాటు, కాంపిటీషన్ విభాగంలో కూడా తమ చిత్రం ఇక్కడ పోటీ పడుతుందని ఆయన తెలిపారు.

    Ram Gopal Varma

    మానవ చరిత్రలో న్యూయార్క్ లో జరిగిన 9/11 తీవ్రవాదుల దాడుల కంటే భయంకరమైనవి ఎప్పుడూ జరగలేదు. కానీ జరిగిన తీరులో 26/11 ముంబయ్ దాడులు వాటికంటే భయంకరమైనవి. నా చిత్రంలో ముంబయ్ దాడుల వెనుక అసలు కథ, వాటిలో పాలుపంచుకున్న వ్యక్తుల భావోద్వేగాలను తెరకెక్కించాను అంటున్నారు దర్శకుడు వర్మ.

    అలుంబ్రా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈచిత్రంలో సంజీవ్ జైస్వాల్ అనే నటుడు తీవ్రవాది కసబ్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నటుడు నానా పాటేకర్ ముంబై నటర పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. మార్చి 1, 2013న ఈ చిత్రం విడదల కానుంది. దాదాపు రూ. 30 కోట్ల బడ్జెట్ తో ఈచిత్రాన్ని తెరకెక్కించారు.

    English summary
    Ram Gopal Varma's new film 'The Attacks of 26/11' has been selected for Berlin International Film Festival. Producer Parag Sanghvi says he is honoured to be part of the prestigious festival.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X