»   » వందల మంది చెమటోడ్చారు: ‘భరత్ అనే నేను’ మేకింగ్ వీడియో

వందల మంది చెమటోడ్చారు: ‘భరత్ అనే నేను’ మేకింగ్ వీడియో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒక సినిమా తెర మీదకు రావడం అంటే మామూలూ విషయం కాదు. తెరపై కనిపించేది నటీనటులు మాత్రమే. కానీ తెర వెనక 24 క్రాప్ట్స్ నుండి ఎంతో మంది మనకు కనిపించకుండా సినిమా కోసం అహర్నిషలు పని చేస్తుంటారు. ఇలా తెరపై, తెర వెనక వందల మంది కష్టపడితే 'భరత్ అనే నేను' లాంటి భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి.

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' మూవీ ఈ నెల 20న విడుదలవుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ల జోరు పెంచారు. ఇటీవల ఎల్బీ స్టేడియంలో పొలిటికల్ సభను తలపించేలా గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంటు నిర్వహించిన నిర్మాతలు తాజాగా చిత్ర మేకింగ్ వీడియో విడుదల చేశారు.

ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తున్నాడు. పొలిటికల్ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో ఇటు భారీ తారాగణంతో పాటు అటు వందల సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులను ఈ సినిమా కోసం ఉపయోగించారు.

ఒక్కో సీన్, ఒక్కో ఫ్రేమ అందంగా మలచడానికి తెర వెనక టెక్నీషియన్లు ఎంత కష్టపడ్డారో తాజాగా విడుదలైన 'భరత్ అనే నేను' మేకింగ్ వీడియో చూస్తే స్పష్టమవుతోంది. డివివి ఎంటర్టెన్మెంట్ సంస్థ ఖర్చుకు వెనకాడకుండా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించింది.

భరత్ అనే నేను చిత్రం ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కేవలం ఎంటర్టెన్మెంటు మాత్రమే కాకుండా.... సందేశాత్మక చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు కొరటాల శివ. సమాజం పట్ల, రాజకీయాల పట్ల అటు నాయకుల్లో, ఇటు ప్రజల్లో బాధ్యత పెంచే విధంగా ఈ సినిమా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది.

English summary
The Making of Bharat Ane Nenu released. The Movie starring Superstar Mahesh Babu, Kiara Advani, Prakash Raj, Sarath Kumar, Rao Ramesh, Ravi Shankar, Posani Krishna Murali, Aamani, Jeeva, Benarjee, Brahmaji, Ajay Kumar, Sithara, Rajitha, Prithviraj, Devraj, Yashpal Sharma.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X