»   » టాలీవుడ్ పిచ్చెక్కిపోతోంది : చిరంజీవి, త్రివిక్రమ్ రహస్య మీటింగ్ వెనుక పవన్...? అసలేం జరిగింది..!?

టాలీవుడ్ పిచ్చెక్కిపోతోంది : చిరంజీవి, త్రివిక్రమ్ రహస్య మీటింగ్ వెనుక పవన్...? అసలేం జరిగింది..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

త్రివిక్రమ్ శ్రీనివాస్.. ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్ర దర్శకుడిగా కొనసాగుతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి కొంతకాలం క్రితం వరకు టాలీవుడ్‌ను టాప్ హీరోగా చక్రం తిప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం తన 150వ చిత్రంతో భారీ ఎంట్రీ ఇస్తున్న మోస్ట్ వాంటెడ్ హీరో. ఈ ఇద్దరూ రెండు గంటల పాటు సమావేశమయితే. అత్యంత రహస్యంగా చర్చలు జరిపితే. అదేదో కచ్చితంగా ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. అయితే, ఆ విషయం ఏమిటన్నదే సమస్య. విషయం ఏమిటైనా, దీనిపై ఎన్నో ఊహాగానాలు, వార్తలు సెకన్లలో సంచలనం సృష్టిస్తాయి. ఇప్పుడు టాలీవుడ్‌లో పరిస్థితి దానికి ఏమాత్రం తీసిపోకుండా ఉంది.

కొందరు చిరు తన 151, 152 సినిమాల గురించి త్రివిక్రమ్‌తో చర్చలు జరిపాడని, వాటిలో ఒక సినిమాను పవన్ నిర్మించనున్నాడని, ఈ మీటింగ్ వెనుక పవన్ హస్తమే ఉందని మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం కొద్ది రోజుల క్రితం త్రివిక్రమ్ పవన్ ల మధ్య జరిగిన ఆంతరంగిక సమావేశం అని అంటున్నారు. మరికొందరేమో, చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న ఖైదీ నం 150 గురించి త్రివిక్రమ్‌తో చర్చలు జరుపుతున్నాడని, సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల గురించి ఈ అగ్ర దర్శకుడితో మాట్లాడుతున్నాడని చెప్పుకుంటున్నారు.

 The news is doing rounds that Trivikram Srinivas met secretly Megastar Chiranjeevi

త్రివిక్రమ్ చిరంజీవితో 2 గంటలపాటు ఏకాంతంగా సమావేశం అయ్యాడు అని వార్తలు రావడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. అయితే వీరిద్దరూ ఎ విషయం పై మాట్లాడుకోవడానికి కలిసారు అన్న విషయంపై స్పష్టమైన క్లారిటీ లేకపోవడంతో రకరకాల ఊహాగానాలు ఊపు అందుకుంటున్నాయి. చిరంజీవి తన 150వ సినిమా విడుదల కాకుండానే తన 151 - 152 సినిమాలకు సంబంధించిన విషయాల పై శ్రద్ద పెట్టాడు అంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో చిరంజీవి తన 152వ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయడానికి నిశ్చయించుకుని ఇలా త్రివిక్రమ్ తో సమావేశం అయ్యాడు అన్న వార్తల హడావిడి జరుగుతోంది.

మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాను పవన్ కళ్యాణ్ ఆర్ట్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నిర్మిస్తాడు అన్న ప్రచారం కూడ జరుగుతోంది. ఈ వార్తలలో ఎన్నినిజాలో తెలియకపోయినా ప్రస్తుతం హడావిడి చేస్తున్న ఈ వార్తలు మెగా అభిమానులను మంచి జోష్ లో ముంచెత్తి వేస్తున్నాయి.

అయితే ఈ వార్తల పై చిరంజీవి సన్నిహిత వర్గాలు మాత్రం వేరే విధంగా స్పందిస్తున్నట్లు టాక్. దాదాపు 9 సంవత్సరాల తరువాత చిరంజీవి నటిస్తున్న 'ఖైదీ నెంబర్ 150' మూవీ ప్రాజెక్ట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారడంతో ఈ సినిమా ప్రాజెక్ట్ కు సంబంధించిన కొన్ని విషయాలను చిరంజీవి త్రివిక్రమ్ తో ఏకాంతంగా మాట్లాడాడు అన్న అభిప్రాయాలను చిరంజీవి సన్నిహితులు వ్యక్త పరుస్తున్నట్లు తెలుస్తోంది. అసలు సంగతి మీద ఎందరో ఏదేదో చెప్తూ ఉన్నా ప్రస్తుతం ఫిలింనగర్ లో హాట్ టాపిక్ చిరంజీవి త్రివిక్రమ్ ల రహస్య మీటింగ్..

English summary
The news is doing rounds that Trivikram Srinivas met secretly Megastar Chiranjeevi, and Buzz is that Trivikram would team up with Chiru for the star’s 152nd film
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu