Akhanda రిలీజ్‌కు ముందు తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం.. టికెట్ రేట్ల పెంపుపై కీలక ఆదేశాలు!

కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ సంక్షోభంలో మునిగిపోయింది. దాదాపు ఏడాదికిపైగా సినిమా థియేటర్లు మూతపడటంతో సినీ కార్మికులు, యాజమాన్యాలు రోడ్డున పడ్డారు. ఇటీవల థియేటర్లు ఓపెన్ కావడంతో ప్రేక్షకుల స్పందన అంతంతా మాత్రంగానే ఉంది. దాంతో సినీ పరిశ్రమ గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్నది.

ఇలాంటి పరిస్థితుల్లో భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఆచార్య, RRR, పుష్ప, అఖండ, రాధేశ్యామ్ లాంటి సినిమాలు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. అయితే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు టికెట్ల రేట్లు పెంపు అంశంపై నిరాసక్తతతో ఉన్నాయి. అయితే టికెట్ల రేట్లు పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించాలనే ఇటీవల థియేటర్ యాజమాన్యాలు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. టికెట్ రేట్లు పెంచుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

 The Telangana High Court has issued key orders on increase in ticket prices

ఇటీవల టికెట్ రేట్లు పెంపుపై థియేటర్ యాజమాన్యాలు తెలంగాణా సర్కార్‌కు వినతి పత్రం సమర్పించారు. అఖండ, RRR, పుష్ప లాంటి సినిమాల రిలీజ్ సమయంలో టికెట్ రేటును 50 రూపాయల మేరకు పెంచుకొనేలా అవకాశం కల్పించండి అని తమ వినతి పత్రంలో పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ థియేటర్ యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు విచారించింది. టికెట్‌పై రూ.50 పెంచుకొనే విధంగా వెసులుబాటును హైకోర్టు కల్పించింది.

Recommended Video

Bimbisara Teaser Review | Tollywood's Future || Filmibeat Telugu

టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై థియేటర్ యాజమాన్యాల తరఫు న్యాయవాది స్పందించారు. టికెట్ రేట్ పెంపుపై తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడంతో కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉన్న రేట్లకు అదనంగా టికెట్ ఒక్కంటికి 50 రూపాయలు పెంచుకొనే విధంగా అవకాశం కల్పిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X