twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రణమా?.. సయోధ్యా?: ఆ విషయంలో పవన్.. బాలయ్య.. ఇద్దరూ తగ్గట్లేదు..

    |

    Recommended Video

    ఆ విషయంలో పవన్.. బాలయ్య.. ఇద్దరూ తగ్గట్లేదు..!

    భారీ బడ్జెట్ సినిమాల విడుదలంటే ఒక రకంగా థియేటర్ల మీద దండయాత్ర లాంటిదే. తొంభై శాతం థియేటర్లు ఆ సినిమాలకే బుక్ అయిపోతాయి. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా స్టార్స్‌పై ఉన్న క్రేజ్‌ను ఓపెనింగ్స్ రూపంలో క్యాష్ చేసేసుకుంటారు.

    ఈ సంక్రాంతి పండుగకు కూడా కొన్ని పెద్ద సినిమాలు దండయాత్రకు రెడీ అయిపోయాయి. ఇందులో మొదటగా వస్తున్నది పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి కాగా.. రెండో సినిమా బాలయ్య జైసింహా. ఆ వెంటనే సూర్య గ్యాంగ్ కూడా రంగంలోకి దిగుతోంది.

    ఈ నేపథ్యంలో ఈ మూడు పెద్ద సినిమాలకు థియేటర్ల అంశంలో సయోధ్య కుదురుతుందా? లేక వివాదమేమైనా రగులుతుందా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

    అమాంతం పవన్ కాళ్ల మీద పడ్డ ఫ్యాన్!: కొద్దిసేపు అంతా బ్లాంక్.., అదీ 'పవర్' గొప్పతనంఅమాంతం పవన్ కాళ్ల మీద పడ్డ ఫ్యాన్!: కొద్దిసేపు అంతా బ్లాంక్.., అదీ 'పవర్' గొప్పతనం

     ఎవరి సత్తా ఎంత?:

    ఎవరి సత్తా ఎంత?:

    సహజంగానే ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తున్నాయంటే.. ఇద్దరిలో ఎవరి సత్తా ఎంతన్న పోలికలు తేవడం సహజం. ఓపెనింగ్ కలెక్షన్స్.. వీకెండ్ కలెక్షన్స్.. ఇలా ప్రతీ దానితో ముడిపెట్టి ఇరు హీరోల బలబలాలను లెక్క కట్టే ప్రయత్నం చేస్తారు. ఆ లెక్కల్లో తగ్గొద్దంటే కావాల్సినన్ని థియేటర్లు చేతిలో ఉండాలి.

    టఫ్ ఫైట్..:

    టఫ్ ఫైట్..:

    పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి సినిమా జనవరి 10వ తేదీన వస్తోంది. రెండు రోజుల పాటు ఈ సినిమాకు పోటీనే లేదు. దాదాపు అన్ని థియేటర్లలో ఇదే సినిమాను ప్రదర్శించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

    కాబట్టి ఆ రెండు రోజుల్లో భారీ కలెక్షన్స్ పక్కా. కానీ జనవరి 12వ తేదీన బాలయ్య జైసింహా విడుదలవుతుండటంతో.. ఆ సినిమాకు కూడా భారీగా థియేటర్లు కావాల్సి వచ్చింది.

    చేదు నిజం: ఎక్కడ ఆ పూనకం?.. పవన్-త్రివిక్రమ్ 'మమా' అనిపించేశారా!..చేదు నిజం: ఎక్కడ ఆ పూనకం?.. పవన్-త్రివిక్రమ్ 'మమా' అనిపించేశారా!..

     జైసింహా కూడా తగ్గట్లేదు:

    జైసింహా కూడా తగ్గట్లేదు:

    రాజకీయ పరంగాను బాలయ్యకు అండ ఉండటంతో జైసింహాకు కూడా భారీ సంఖ్యలోనే థియేటర్లు ఖరారు చేసే పనిలో పడ్డారు. అజ్ఞాతవాసికి ఏమాత్రం తగ్గని రీతిలో తమ సినిమా విడుదల ఉండాలని నిర్మాత సి.కల్యాణ్ కూడా ఆశిస్తున్నారు. కాబట్టి ఈ సినిమాకు కూడా ఎక్కువ సంఖ్యలోనే థియేటర్లు దక్కే అవకాశం ఉంది.

     'గ్యాంగ్' విషయమేంటి?:

    'గ్యాంగ్' విషయమేంటి?:

    పవన్-బాలయ్య మధ్యలో సూర్య. ఈ సంక్రాంతికి ఇలాగే తయారైంది పరిస్థితి. ఇద్దరు తెలుగు స్టార్ హీరోల సినిమాల మధ్య సూర్య నటించిన 'గ్యాంగ్' కూడా విడుదలకు సిద్దమైంది.

    యువీ క్రియేషన్స్ లాంటి బ్యానర్, అల్లు అరవింద్ లాంటి నిర్మాత అండ ఉండటంతో.. ఈ సినిమాకు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే థియేటర్లు దక్కే అవకాశం ఉంది. పైగా యువీ సంస్థకు కొన్ని సొంత థియేటర్లు కూడా ఉండటం కలిసొచ్చే అంశం.

    'రంగులరాట్నం'..:

    'రంగులరాట్నం'..:

    ఇక నిన్నమొన్నటి దాకా అసలు సంక్రాంతి బరిలో లేని 'రంగుల రాట్నం' కూడా అనూహ్యంగా బరిలో దిగింది. నిర్మాత నాగార్జున సినిమాను సంక్రాంతి బరిలో దించాలనుకోవడం పెద్ద రిస్క్ అని చాలామంది అభిప్రాయపడుతున్నప్పటికీ.. ఆయన మాత్రం తగ్గట్లేదు.

    'హలో'సినిమా తీవ్ర నష్టాల్ని మిగల్చడంతో.. రంగులరాట్నంతో దాన్ని భర్తీ చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ సినిమా కోసం తగినన్ని స్క్రీన్స్ సిద్దం చేసే పనిలో నాగార్జున నిమగ్నమయ్యారు.

    సర్దుబాటు చేసుకుంటారా?

    సర్దుబాటు చేసుకుంటారా?

    ఇన్నేసి సినిమాలు ఒకేసారి విడుదలవుతుండటంతో థియేటర్ల సర్దుబాటు పైనే అందరి దృష్టి నిలిచింది. ఈ నాలుగు సినిమాల నిర్మాతలు సయోధ్యతో థియేటర్లను సర్దుబాటు చేసుకుంటారా?.. లేక తమ సినిమాకు అన్యాయం చేశారంటూ ఎవరైనా రచ్చకెక్కుతారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

    అందులోనూ పవన్, బాలయ్య సినిమాల విషయంలో ఎవరికి థియేటర్లు తగ్గినా.. అటు ఫ్యాన్స్, ఇటు నిర్మాతలు వూరుకునే ఛాన్స్ లేదు కాబట్టి.. ఈ గండం ఎలా గట్టెక్కుతారో చూడాలి.

    English summary
    Trade experts are predicting that Pawan Kalyan could benefit from the two-day lead, however going Nandamuri's BO dominance in recent times, the collections could hit a roadblock when Jai Simha releases.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X