twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాక్: ‘స్పైడర్’ రిలీజ్ వేళ నిజం బయట పెట్టిన మహేష్ బాబు!

    స్పైడర్ సినిమాలో స్పైడర్ రోబో ఉండదట. దీనిపై మహేష్ బాబు క్లారిటీ ఇచ్చారు.

    By Bojja Kumar
    |

    మహేష్ బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'స్పైడర్' చిత్రం మరికొన్ని గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ దసరా సెలవుల్లో మహేష్ బాబు సినిమాకు కుటుంబ సమేతంగా వెళ్లేందుకు అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.

    దాదాపు రూ. 120 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ ఆకాశం వరకు తీసుకెళ్లింది. ట్రైలర్ కంటే ముందు 'గ్లింప్స్ ఆఫ్ స్పైడర్' పేరుతో రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకుల్లో ఎన్నో ఊహలకు కారణమైంది. సినిమా రిలీజ్ వేళ మహేష్ బాబు ఓ షాకింగ్ విషయం బయట పెట్టారు.

    రోబో స్పైడర్ గురించి

    ‘గ్లింప్స్ ఆఫ్ స్పైడర్' పేరుతో విడుదలైన వీడియో ద్వారా స్పైడర్ మూవీ ప్రమోషన్లు ప్రారంభం అయ్యాయి. అందులో ఒక రోబో స్పైడర్ మహేష్ బాబుపైకి ఎక్కడం, మహేష్ బాబు తన సైగలతో దాన్ని కంట్రోల్ చేయడం లాంటివి ఆ వీడియోలో చూపారు. ఈ వీడియోను దాదాపు కోటిన్నరమంది చూశారు.

    ఎన్నో ఊహలు

    ఎన్నో ఊహలు

    ఆ వీడియో చూసిన చాలా మంది సినిమాలో అత్యాధునిక టెక్నాలజీ వాడారని, జేమ్స్ బాండ్ సినిమాలో ‘స్పై' తరహాలో మహేష్ బాబు పాత్ర ఉంటుందని, రోబో స్పైడర్ మహేష్ బాబుకు సహాయంగా ఉంటుందని అంతా ఊహించుకున్నారు.

    Recommended Video

    Spyder First Review : డాన్స్ ఇరగదీసిన మహేష్ బాబు
    అసలు విజయం బయట పెట్టిన మహేష్ బాబు

    అసలు విజయం బయట పెట్టిన మహేష్ బాబు

    అయితే ప్రేక్షకులు ఊహించుకున్న రోబో స్పైడర్ సినిమాలో ఉండదట. ఈ విషయాన్ని మహేష్ బాబు స్వయంగా వెల్లడించారు. సినిమా కాన్సెప్ట్ ను చూపించేందుకే ఆ టీజర్ అలా తయారు చేశామని చెప్పాడు.

    ఆ వార్తల్లో కూడా నిజం లేదు

    ఆ వార్తల్లో కూడా నిజం లేదు

    ఈ చిత్రంలో తాను ఐబీ అధికారిగా కనిపిస్తాని, తాను డబుల్ యాక్షన్ చేశానని వచ్చిన వార్తలు అవాస్తవమని, అటువంటిది ఉంటే ట్రయిలర్ లో చూపించే వాళ్లమని చెప్పాడు. 'స్పైడర్'లో నటించడం తనకెంతో కొత్త అనుభవాన్ని ఇచ్చిందని తెలిపారు.

    అందరికీ నచ్చుతుంది

    అందరికీ నచ్చుతుంది

    ఈ సినిమా కథ యూనివర్శల్ కాన్సెప్ట్. మాస్, క్లాస్, యూత్, ఫ్యామిలీ..ఇలా ప్రతిఒక్కరూ చూడదగిన చిత్రం, అందరికీ ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకం ఉంది' అని మహేష్ బాబు తెలిపారు.

    నాన్నే ఇన్స్‌స్పిరేషన్, ఆయనంత డేర్ లేదు

    నాన్నే ఇన్స్‌స్పిరేషన్, ఆయనంత డేర్ లేదు

    నాన్నే తనకు ఇన్స్‌స్పిరేషన్ అని, ఆయన ఎన్నో గొప్ప పాత్రల్లో నటించారని, ఆయనది చాలా డేరింగ్ యాటిట్యూట్ అని, తనకు అంత డేర్ లేదని మహేష్ బాబు తెలిపారు.

    నాన్న చిత్రాలు రీమేక్ చేయను

    నాన్న చిత్రాలు రీమేక్ చేయను

    ‘మా నాన్న నటించిన సినిమాలను రీ మేక్ చేసే ఆలోచన లేదు. అలా చేస్తే వాటికి పూర్తి న్యాయం చేయలేము. అందుకే అలాంటి ఆలోచన తనకు రాదని మహేష్ బాబు తెలిపారు.

    అంతకు ముందు స్ట్రగుల్ అయ్యాను, ఆ తర్వా స్టార్ అయ్యాను

    అంతకు ముందు స్ట్రగుల్ అయ్యాను, ఆ తర్వా స్టార్ అయ్యాను

    ఒక్కడు, పోకిరి, అతడు, దూకుడు, శ్రీమంతుడు.. ఈ చిత్రాలన్నీ నా కెరీర్ ను మలిచాయి. ఇవి నా కెరీర్లో ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్. ఒక్కడు సినిమా తర్వాతే నేను స్టార్ అయ్యాను. అంతకుముందు, చాలా స్ట్రగుల్ అయ్యాను అని మహేష్ బాబు తెలిపారు.

    ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసిన సినిమా

    ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసిన సినిమా

    'అతడు' సినిమా నన్ను ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరగా తీసుకువెళ్లింది. పోకిరి సినిమా నాకో కొత్త స్టేటస్ ఇచ్చింది. 'దూకుడు' సినిమా నాకు టర్నింగ్ పాయింట్ అని మహేష్ బాబు చెప్పుకొచ్చారు.

    గర్వపడే సినిమా

    గర్వపడే సినిమా

    శ్రీమంతుడు సినిమా నాకు చాలా ముఖ్యమైంది. శ్రీమంతుడు సినిమా తర్వాత చాలా మంది గ్రామాలను దత్తత తీసుకోవడం గర్వంగా.. సంతోషంగా ఫీలవుతున్నాను. ఈ సినిమాల తర్వాత ‘స్పైడర్' నా కెరీర్ లో మరో ముఖ్యమైన చిత్రం అవుతుందనే నమ్మకం ఉందని మహేష్ బాబు తెలిపారు.

    English summary
    "There is no Spider in Spyder movie. We have released the Spider video to tell the movie conception only, There is nothing beyond that." Mahesh Babu said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X