»   » త్రివిక్రమ్, రానాలతో టచ్ లో ఉంది, ఆఫర్స్ ఇస్తారా?

త్రివిక్రమ్, రానాలతో టచ్ లో ఉంది, ఆఫర్స్ ఇస్తారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: "నేను ఇంకా తెలుగులో త్రివిక్రమ్ , రానా వంటి స్నేహితులతో టచ్ లోనే ఉన్నాను. కానీ దాని అర్దం వారికి ఫోన్ చేసి, ఆఫర్స్ అడుగుతానని కాదు. నాకు ఫలానా క్యారక్టర్ నప్పుతుంది అనుకుంటే నన్ను ఆ పాత్రకు అడుగుతారు. నా మేనేజర్ వారికి ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడు ", అని చెప్పుకొచ్చింది ఇలియానా. అయితే తన చిరకాల మిత్రుడు పూరి జగన్నాథ్ పేరు మాత్రం ఆమె ప్రస్దావించలేదు.

ఒకప్పుడు తెలుగులో ఒక వెలుగు వెలిగిన ఇలియానా బాలీవుడ్ పై మోజుతో టాలీవుడ్ కు దూరమైంది. అయితే అప్పుడప్పుడూ తన కొత్త చిత్రాల ప్రమోషన్ కోసం ఇక్కడకు వస్తూనే ఉంటుంది. తాజాగా ఇలియానా చాలా కాలం తర్వాత తన తాజా చిత్రం రుస్తం ప్రమోషన్ కోసం సిటీలో తళుక్కుమంది. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చింది.

ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఎన్నో విషయాలు చర్చించింది. తెలుగులో ప్రస్తుతం సినిమాలు ఏమీ చేయకపోవటం గురించి, తన శరీరం ఫిట్ గా ఉంచుకోవటం గురించి, తన లవర్ గురించి, తను వివాహం ఎప్పుడు చేసుకోబోతోంది వంటి ఎన్నో విషయాలు చర్చించింది.

ఇలియానా మాట్లాడుతూ... 'నేను కావాలని టాలీవుడ్ కు దూరం కాలేదు. మంచి పాత్రలు రాకపోవడంతోనే సినిమాలు చేయడం లేదు.మంచి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తాను. అలాగే నేను ఎప్పుడూ ఎవరి దగ్గరకి వెళ్లి వేషం అడగలేదు. ఇక్కడున్న నా స్నేహితులు త్వరలోనే మంచి ఆఫర్స్ తో నా వద్దకు వస్తారని ఆసిస్తున్నా' అంది.

ఆ విశేషాలు మీకు క్రింద స్లైడ్ షోలో

లుక్ గురించి

లుక్ గురించి

"నిజానికి నేను ఇప్పటికీ నా శరీరంలో ఎగస్ట్రా ఫ్యాబ్ ఉందేమో అని తొలిగించుకోవటానికి రోజూ కష్టపడతాను. రోజూ జిమ్ లో కష్టపడతాను." అని చెప్పుకొచ్చింది.

కష్టమే

కష్టమే

అయినా 30 సంవత్సరాల్లోకి ఎంటర్ అయ్యాక శరీరం మెయింటైన్ చేయటం చాలా చాలా కష్టం. ఎందుకంటే మెటబాలిజమ్ చాలా స్లో అవుతుంది. ఇలియానా ఈ మధ్యనే 30 నిండింది.

బోయ్ ఫ్రెండ్ గురించి

బోయ్ ఫ్రెండ్ గురించి

"ఇందులో దాయటానికి ఏముంది ? ఇలాంటి విషయాలు దాయటం వల్ల ఉపయోగంలేదు. అయితే నాకు పర్శనల్ లైఫ్ గురించి మాట్లాడటం ఇష్టం ఉండదు I ," అని ఫ్రాంక్ గా చెప్పింది.

పెళ్లి ఎప్పుడో...

పెళ్లి ఎప్పుడో...

"ఏమో నాకు తెలియదు. ఎప్పటికి, ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు," అని వివాహం గురించి చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం

ప్రస్తుతం

హిందీలో అక్షయ్‌కుమార్‌తో 'రుస్తూమ్' చిత్రంలో నటిస్తున్నాను. ఈ చిత్రం నాకు మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉంద'ని చెప్పారు.

పోటీ ఎక్కువ

పోటీ ఎక్కువ

ఎప్పటికప్పుడు కొత్తవాళ్లు వస్తున్న బాలీవుడ్‌లో ఇలియానాకు సరైన పట్టు దొరకడం లేదు. దీంతో బాలీవుడ్‌లో ఇలియానా శకం ముగుస్తుందా అని సినీ పండితులు లెక్కలు వేస్తున్నారు.

ఆశలన్నీ..

ఆశలన్నీ..

ఇలియానా ఆశలన్నీ అక్షయ్‌కుమార్‌తో నటించిన ‘రుస్తుం' చిత్రంపైనే ఉన్నాయి. ఈ సినిమా ఆమెకు తాడోపేడో తేల్చేస్తుంది.

చివరి చిత్రమా

చివరి చిత్రమా

‘రుస్తుం' చిత్రం ఆగస్టులో విడుదలయ్యాక హిట్ అయితే ఓకె, లేదా అదే చివరి చిత్రవౌతుందా అని అంచనాలు వేస్తున్నారు.

అదే సమస్య

అదే సమస్య

తెలుగులో టాప్‌స్టార్‌గా వున్న ఇలియానా తన స్టార్‌డమ్‌నంతా ఉపయోగించి హిందీ సినిమాల్లో చేయడానికి వెళ్లిపోవడాన్ని ఇన్నాళ్లూ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు.

అదే భాధ

అదే భాధ

ఇప్పుడు ఇలియానా కూడా అదే బాధతో వుంది. తన కెరీర్ ఎటు నుంచి ఎటు వెల్తుందో అర్దంకాని పరిస్దితుల్లో ఉంది

హ్యాపీ ఎండింగ్

హ్యాపీ ఎండింగ్

హ్యాపీ హ్యాపీగా బాలీవుడ్‌లో సెటిల్ అవుదామని వెళితే రెండు మూడు మంచి ఆఫర్లు వచ్చాయి. ఏమైందో ఏమో ఒక్కసారిగా ఆమె కెరీర్ హ్యాపీ ఎండింగ్‌లాగా మారిపోయింది.

భయంతో

భయంతో

కెరీర్ ఎండ్ అవుతుందా ఏమిటీ అన్న భయంతో ఇన్నాళ్లూ నెట్టుకొచ్చింది. దాంతో మళ్లీ సౌత్ వైపు చూస్తోంది

ప్రయోగాలు

ప్రయోగాలు

సినిమాలు లేవు కదా, ఏం చేస్తున్నారు అని అడిగితే ప్రస్తుతం తాను ఫొటోగ్రఫిలో ప్రయోగాలు చేస్తున్నానంటోంది.

హాబీ

హాబీ

చిన్నపిల్లల ఫొటోలు తీయడం తనకు ఎంతో ఇష్టమైన హాబీ అని, ఆ హాబీని ఇప్పుడు పూర్తి స్థాయిలో ఉపయోగిస్తున్నానని అంటోంది.

అప్పటికీ

అప్పటికీ


బాలీవుడ్‌లో పోటీని తట్టుకోవాలంటే రెచ్చిపోయి చేయాల్సిందేనని మొహమాటం లేకుండా చెబుతుంది. అయినా ఫలితం మాత్రం కనపడటం లేదు

ఓకే అన్నా..

ఓకే అన్నా..


ఒకప్పుడు బికినీకి, లిప్ లాక్ కి నో అన్న ఇలియానా ఆమధ్య అందుకు కూడా రెడీ అని చెప్పేసింది.

ఎవరూ రావటంలేదు

ఎవరూ రావటంలేదు


గతంలో టాలీవుడ్‌లో కోటికి పైగా పుచ్చు కున్న ఇలియానాకు ఇప్పుడు అంత ఇచ్చేం దుకు ఎవరూ ముందుకు రావడం లేదట

సగం కోత

సగం కోత

దాంతో తన రెమ్యునరేషన్‌ సగానికి కుదించేసి తెలుగులో ఓ ఆఫర్‌ చేజిక్కించుకుందని అంటున్నారు. అయితే ఆ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు మాత్రం బయటకి రాలేదు.

 దిగాలు

దిగాలు

టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు తన రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేసిన ఇలియానా ఇప్పుడు వేషాలు లేకపోవడంతో దిగాలు పడింది.

వాళ్ల దగ్గరకే

వాళ్ల దగ్గరకే

అదివరకు తనకు ఛాన్సులు ఇచ్చిన డైరెక్టర్ల దగ్గరికి వెడదామా అంటే వాళ్లంతా హీరోల చుట్టూ తిరుగుతున్నారు.

English summary
"I'm still in touch with some of my friends like Trivikram, Rana etc, but that doesn't mean I will call them and ask for roles. If somebody feels I'm apt for a character, my manager is always available for them", Ileana D Cruz quips.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu