»   » 'వచ్చాడయ్యో సామి'.. పంచె కట్టులో ప్రజా నాయకుడిగా మహేష్ బాబు!

'వచ్చాడయ్యో సామి'.. పంచె కట్టులో ప్రజా నాయకుడిగా మహేష్ బాబు!

Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు నటిస్తున్న భరత్ అనే నేను చిత్రం ఆసక్తికరమైన పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ నెల 20 న భరత్ అనే నేను చిత్రం భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నాడు. దర్శకుడు కొరటాల ఈ చిత్రంలో కీలకమైన సామజిక అంశాలని టచ్ చేసినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు పవర్ ఫుల్ డైలాగులు ప్రధాన ఆకర్షణ కానున్నాయి.

విడుదల సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలని వేగవంతం చేసింది. ఏప్రిల్ 7 న భరత్ భహిరంగ సభ పేరుతో ఎల్ బి స్టేడియంలో భారీ ఈవెంట్ నిర్వహించనున్నారు. గురువారం సాయంత్రం 5 గంటలకు ఈ చిత్రంలోని మూడవ పాట ని విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో మహేష్ బాబు పంచె కట్టు లుక్ హుషారెత్తించే విధంగా ఉంది.

Third song from Bharath Ane Nenu will release tomorrow

'వచ్చాడయ్యో సామి' అనే సాంగ్ రేపు విడుదల చేయనున్నారు. మహేష్ బాబు ప్రజా నాయకుడిగా జనాలతో కలసి ఆది పాడే సందర్భంలోనిదిగా ఈ సాంగ్ కనిపిస్తోంది. భరత్ విజన్ పేరుతో విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

English summary
Third song from Bharath Ane Nenu will release tomorrow. Bharat bahiranga sabha on April 7th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X