»   » అదండీ అసలు విషయం... క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

అదండీ అసలు విషయం... క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'బాహుబలి' అనే భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ స్పాట్లో అత్యాధునికమైన డాటా స్టోరీజ్ డివైజ్ కనిపించడంతో దానిపై రకరకాల ప్రచారం జరిగింది. 'అత్తారింటికి దారేది' చిత్రం విడుదలకు ముందే పైరసీకి గురైన నేపథ్యంలో....'బాహుబలి' సినిమా బయటకు లీక్ కాకుండా ఈ డాటా స్టోరేజీ డివైజ్ తెప్పించారని అంతా అనుకున్నారు.

డాటా స్టోరీజీ డివైజ్‌పై రకరకాల ప్రచారం జరుగుతుండటంతో రాజమౌళి ట్విట్టర్లో స్పందించారు. 'ఇది కేవలం డాటా స్టోరేజీ కోసం ఉపయోగించే హార్డ్ డిస్క్. డైలీ షూటింగుకు సంబంధించిన ఫుటేజ్ అందులో స్టోర్ చేస్తాం. జస్ట్ డాటా బ్యాకప్ కోసమే. పైరసీ అరికట్టేందుకే అని అంతా అనుకుంటున్నారు. అది వాస్తవం కాదు' అని రాజమౌళి స్పష్టం చేసారు.

<blockquote class="twitter-tweet blockquote"><p>This is just a data storage harddisk Many r thinkin this is a security device agnst piracy..there is no such thing <a href="http://t.co/O2I8pFvKoK">pic.twitter.com/O2I8pFvKoK</a></p>— rajamouli ss (@ssrajamouli) <a href="https://twitter.com/ssrajamouli/statuses/391755186139443200">October 20, 2013</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

సినిమా వివరాల్లోకి వెళితే...ప్రస్తుతం 'బాహుబలి' షూటింగ్ మూడో షెడ్యూల్ జరుగుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు రాణా, అనుష్క, రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సినిమా కోసం ఫిల్మ్ సిటీలో కోట్లాది రూపాయల ఖర్చుతో భారీ సెట్టింగులు వేసారు. అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ వాస్తవికత ఉట్టిపడేలా ఈ సెట్ డిజైన్ చేసారు.

ఇంకా సత్యరాజ్, నాజర్, అడవి శేషు, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది.

దాదాపు రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.

English summary
"This is just a data storage hard disk. Many r thinkin this is a security device agnst piracy..there is no such thing" Rajamouli tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu