»   » సికింద్రాబాదా: జయసుధపై రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్‌కు 'రియల్' చురక

సికింద్రాబాదా: జయసుధపై రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్‌కు 'రియల్' చురక

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న నట కిరీటీ రాజేంద్ర ప్రసాద్ రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ పైన పరోక్ష ప్రత్యక్ష విమర్శలు గుప్పించారు. మా అధ్యక్ష పదవికి రాజేంద్ర ప్రసాద్, జయసుధలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ ప్యానల్ బుధవారం మీడియా ముందుకు వచ్చింది.

మురళీ మోహన్, జయసుధల పైన రాజేంద్ర ప్రసాద్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. 'మా' అధ్యక్ష ఎన్నికలు ఏం రాజకీయ ఎన్నికలు కాదన్నారు. ఇదే సికింద్రాబాద్ ఎమ్మెల్యే ఎన్నికలు కావన్నారు. రాజకీయాలతో 'మా'ను కంపు చేశారని విమర్శించారు. తాను ధర్మ యుద్ధం చేస్తున్నానని చెప్పారు. ఇందులో తనను గెలిపించాలని కోరారు. సంకల్పం, మనసు ఉంటే ఏదైనా చేయవచ్చునన్నారు.

తాను సెల్‌పోన్లు పంచానని చెబుతున్నారని, కళాకారుడికి సెల్ ఫోన్ తీసుకొని ఓటు వేసే ఖర్మ ఉందా అని ప్రశ్నించారు. భూములు ఇచ్చేందుకు తనకు రియల్ ఎస్టేట్ లేదని మురళీ మోహన్‌ను ఉద్దేశించి అన్నారు. 'మా' అంటే అమ్మ అని, దానికి కనీసం నాలుగు రేకులతో కూడిన షెడ్డు కూడా లేదన్నారు. కళాకారుల నిలయం గొప్పగా ఉండాలని కోరుకునే వారిలో నేను ఒకడినని చెప్పారు.

This is not Secunderabad elections: Rajendraprasad to Jayasudha

జయసుధ అంటే తనకు గౌరవముందని, ఎంపీ మురళీ మోహన్ అంటే తనకు గౌరవం ఉందని చెప్పారు. మనం పోయేటప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఆస్తులు వెంట రావన్నారు. పీవీ నర్సింహా రావు వంటి రాజకీయ నాయకుల నుండి ఎందరో రాజేంద్ర ప్రసాద్ సినిమాలు చూసి ఇంట్లో ఆనందంగా గడిపిన వారన్నారు. తాను వారిలా రాజకీయాల నుండి రాలేదన్నారు.

వారు రాజకీయాల నుండి వచ్చారని, అందుకే సెల్‌ఫోన్లు పంచుతున్నారని ప్రచారం చేస్తున్నారన్నారు. జయసుధ మాజీ ఎమ్మెల్యే అని, ఆమెను వెనుక నుండి నడిపిస్తున్న మహా శక్తి ఎంపీ అన్నారు. ఇప్పటికే రాజకీయం చేసి కంపు చేశారని, 'మా'లో కూడా రాజకీయాలా అని మండిపడ్డారు. ఇలా మాట్లాడాల్సి వస్తున్నందుకు తాను బాధపడుతున్నానని చెప్పారు. ఎన్నికలకు కారణమైన వారిని కళాకారులు అననని, శాడిస్ట్ అంటానన్నారు.

'మా' ఎన్నికలను వారే రాజకీయం చేస్తూ.. పైగా తాను రాజకీయం చేస్తున్నానని చెబుతున్నారని, ఇది విడ్డూరమన్నారు. తాను అందరికీ నవ్వులు పంచిన వాడినని, తనకు రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు. తాను అన్ని విషయాలను సూటిగా చెప్పగలనన్నారు. రాజకీయాలతో 'మా'ను కంపు చేశారన్నారు. తనను వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.

ఇలాంటి మైండ్ గేమ్స్‌ను వారు రాజకీయాలలో వాడుకోవచ్చునని, కానీ మా అసోసియేషన్లో వాడుకోవద్దన్నారు. ఇది సికింద్రాబాద్ ఎన్నికలు కాదన్నారు. తాము ఇరవై రోజుల నుండి పోటీలో ఉంటే, వారు నిన్న వచ్చారని, రాజకీయం చేశారని ఆరోపించారు. తాను ఎప్పుడు విమర్శలకు అతీతమని, రాజకీయ ఎన్నికల్లా ఇక్కడ వద్దన్నారు. ఇక్కడ ఎవరికి ఎవరు శత్రువులు కాదన్నారు.

English summary
This is not Secunderabad elections: Rajendraprasad to Jayasudha
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu