శ్రీవిష్ణు హీరోగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'నీదీ నాదీ ఒకే కథ'. మధ్య తరగతి మనుషుల జీవితం కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 23న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై హీరో నాని ఒక ట్వీట్ చేశారు.
'చూస్తుంటే ఇది నా కథలా కూడా అనిపిస్తుంది. శ్రీ విష్ణు పెర్ఫార్మెన్స్ చూశాక ఎంతో మనసుపెట్టి చేశాడో అర్థమైంది. అతనికి అతని టీంకు నా శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశారు నాని.
యంగ్ హీరో నారా రోహిత్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన 'బిచ్చగాడు' ఫేం శాత్నా టిటూస్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే గాక చిత్రంపై అంచనాలు క్రియేట్ చేసింది.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి | Subscribe to Telugu Filmibeat.