twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ ఇద్దరు ఉంటే శ్రీదేవి బతికేదేమో.. జాహ్నవికి చెప్పిన చివరి మాటలు ఇవే..

    By Rajababu
    |

    శ్రీదేవి ఆకస్మిక మరణం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను శోకసంద్రంలో ముంచింది. సినీలోకానికి కాకుండా తన కుటుంబానికి కూడా తీరని అన్యాయం చేసింది. తన కూతురు సినీరంగ ప్రవేశాన్ని కళ్లారా చూడకుండానే మళ్లీ రాని లోకాలకు తరలివెళ్లింది. శనివారం రాత్రి అందాల తార శ్రీదేవి దుబాయ్‌లో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. శ్రీదేవి చివరిక్షణాల్లో కూతుర్లేవరూ లేకపోవడం విషాదంగా మారింది.

    Recommended Video

    Sridevi Passes Away : Janhvi Kapoor In Critical Situation
    కూతుళ్లంటే ఎనలేని ప్రేమ

    కూతుళ్లంటే ఎనలేని ప్రేమ

    శ్రీదేవికి తన కూతుళ్లు జాహ్నవి, ఖుషీ కపూర్ అంటే ఎనలేని ప్రేమ. ఓ తల్లిగానే కాకుండా వారితో స్నేహంగా ఉండటం తెలిసిందే. ప్రతీ విషయంలోను కూతుళ్లకు వెన్నంటి ఉండటం శ్రీదేవీ చేసేది. వారి భవిష్యత్తు కోసం తన కెరీర్‌నే త్యాగం చేసింది.

    కంటికి రెప్పలా చూసుకునే..

    కంటికి రెప్పలా చూసుకునే..

    తన తల్లిని జాహ్నవి, ఖుషీకపూర్‌లు ఎల్లవేళలా కంటికి రెప్పలా చూసుకొనేవారు. తనకు ఆరోగ్యం గురించి, తన సంరక్షణపై బాధ్యతగా మెసులుకొంటారని పలుమార్లు శ్రీదేవి చెప్పిన విషయం తెలిసిందే.

    తల్లికి దూరంగా జాహ్నవి

    తల్లికి దూరంగా జాహ్నవి

    తన మేనల్లుడు మోహిత్ మార్వా పెళ్లికి హాజరైన సమయంలో జాహ్నవి ఆ కార్యక్రమానికి దూరంగా ఉంది. దడక్ సినిమా షూటింగ్ బిజీ కారణంగా జాహ్నవి పెళ్లికి వెళ్లకపోయిన సంగతి తెలిసిందే. పెళ్లికి హాజరైన ఖుషీ ఆ తర్వాత తండ్రితో కలిసి ముంబైకి వెళ్లింది. ఏదో కారణంగా శ్రీదేవి అక్కడే ఉండిపోయింది.

    అనారోగ్యాన్ని దాచిందా?

    అనారోగ్యాన్ని దాచిందా?

    అయితే ఆ సమయంలోనే ఒత్తిడి కారణంగా శ్రీదేవి ఆరోగ్యం విషమించిందా? అనారోగ్యాన్ని ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టిందా అనేది విషయంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తనతోపాటు కూతుళ్లు ఉండి ఉంటే శ్రీదేవి బతికి ఉండేదేమో అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

    కూతుళ్ల భవిష్యత్‌కు కోసం

    కూతుళ్ల భవిష్యత్‌కు కోసం

    బాలీవుడ్ తెరకు పరిచయం అవుతున్న జాహ్నవికి శ్రీదేవి ఎన్నో సలహాలు ఇచ్చేదట. నటిగా రాణించడానికి, ఆకట్టుకోవడానికి ఎలాంటి పద్దతులు అనుసరించాలో క్లియర్‌గా చెప్పేదట.

    ఓ తల్లిగా శ్రీదేవి ఆరాటం

    ఓ తల్లిగా శ్రీదేవి ఆరాటం

    ప్రతి తల్లి పడే ఆరాటంలో భాగంగానే నా పిల్లలకు అన్ని విపులంగా చెప్పేదానిని. సినీరంగంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే హార్డ్ వర్క్ చాలా ముఖ్యం అని ఎప్పుడూ చెబుతాను. నీకున్న ప్రతిభలో 100 శాతం ఎప్పుడూ ఇచ్చేందుకు ప్రయత్నించాలి. కష్టించి పనిచేస్తే అదే మీకు శ్రీరామరక్ష అని చెబుతుంటాను అని శ్రీదేవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

    జాహ్నవి ముందు పలు సవాళ్లు

    జాహ్నవి ముందు పలు సవాళ్లు

    జాహ్నవి బాలీవుడ్‌లోకి వస్తుందంటే నాతో పోలీకలు వస్తాయి. ఆమె ఎన్నో రకాల ఒత్తిడులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జాహ్నవిని ఇప్పటికే అనేక విషయాల్లో సంసిద్ధం చేశాను. జాహ్నవి కెరీర్‌ను తీర్చిదిద్దడానికి నేకు కూడా రెడీ అయ్యాను అని శ్రీదేవి వెల్లడించారు.

    జాహ్నవి కెరీర్ విషయంలో

    జాహ్నవి కెరీర్ విషయంలో

    జాహ్నవి కెరీర్ విషయంలో నా సహకారం పూర్తిస్థాయిలో ఉంటుంది. నాకు నా తల్లి ఎలాంటి సహకారం అందించిందో నేను కూడా అదే తరహాలో ముందుకెళ్తాను. నేను సినిమా పరిశ్రమలో ప్రవేశించే నాటికి మాకు ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదు. జాహ్నవి విషయంలో అన్ని రకాల సపోర్ట్ ఉంది. అదే మాకు చాలా సంతోషం కలిగించే విషయం అని శ్రీదేవి చెప్పింది.

    సైరత్ రీమేక్‌లో జాహ్నవి

    సైరత్ రీమేక్‌లో జాహ్నవి

    కెరీర్ ఆరంభంలోనే జాహ్నవికి శ్రీదేవి తోడు లేకపోవడం చాలా ఇబ్బందైన విషయం. మరాఠీ భాషలో ఘన విజయం సాధించిన సైరత్ సినిమా ఆధారంగా జాహ్నవి దడక్ చిత్రం రూపొందుతున్నది. ఈ చిత్రం జూలై 6న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.

    English summary
    Sridevi's untimely death has left a void in Bollywood. But more than her fans and film industry, it's a big loss to her family. Five months before daughter Janhvi Kapoor's big Bollywood debut, Sridevi died of a cardiac arrest in Dubai. Sridevei had said in one occassion, "As a mother, like any mother, whether they are coming to this profession or any other, you just tell them to do the right thing. Like, do hard work, give your 100 percent, hard work always pays."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X