»   » ‘తొలి ప్రేమ’ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్?

‘తొలి ప్రేమ’ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

వరుణ్ తేజ్ హీరోగా 'తొలి ప్రేమ' చిత్రం తెరకెక్కించి మొదటి సినిమాలోనే దర్శకుడిగా ఎంతో మెచ్యూరిటీ చూపించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వెంకీ అట్లూరి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వెంకీ అట్లూరి తర్వాతి సినిమా అఖిల్ అక్కినేనితో చేసే అవకాశం ఉందని టాక్.

ఇటీవల నాగార్జున తన వద్దకు వెంకీని పిలిపించుకున్నారని, అఖిల్ కోసం మంచి లవ్ స్టోరీ రాయాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే మరి అఖిల్‌తో సినిమా చేయడానికి వెంకీ సిద్ధంగా ఉన్నారా? లేదా? అనే విషయంలో అఫీషియల్ సమాచారం అయితే ఏమీ లేదు.

Tholi Prema director Venky Atluri may direct Akhil

అఖిల్ గత చిత్రం 'హలో'కు రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగానే ఉన్నప్పటికీ ఎందుకనో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద అద్భుతాలు సృష్టించలేక పోయింది. యావరేజ్ హిట్ చిత్రంగా నిలిచింది. అఖిల్ కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగాలంటే.... ఇంతకు మించిన హిట్ సినిమా ఒకటి కావాలనేది విశ్లేషకుల అభిప్రాయం.

అఖిల్ ఓ తమిళ దర్శకుడితో కలిసి పని చేయబోతున్నట్లుకూడా ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇంకా సరైన సమాచారం లేదు. మరో వైపు అఖిల్ తో రామ్ గోపాల్ వర్మ సినిమా చేయబోతున్నట్లు కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి.

English summary
Director Venky Atluri,is most likely to team up with Akhil Akkineni next. Even though it’s too premature to even discuss about the project. Film Nagar sources have hinted that actor Nagarjuna recently met Venky and requested him to pen a script for his son Akhil.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu