For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చరణ్‌పై ఈర్ష్య పుట్టింది, వాన్ని సాధించా : చిరు (ఫోటో ఫీచర్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్ : రామ్ చరణ్‌ను చూస్తే ఈర్ష్యగా ఉందంటూ మెగా స్టార్ చిరంజీవి తన తనయుడు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. సోమవారం పార్క్ హయత్ హోటల్ లో జరిగిన చరణ్ తాజా సినిమా 'తుఫాన్' ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేసారు.

  "వాన్ని చూస్తే కాస్త ఈర్ష్యగా ఉంది, నేను 'ప్రతిబంధ్' చిత్రంలో నటించడానికి 13 ఏళ్లు పట్టింది. కానీ చరణ్ మూడేళ్లకే హిందీ చిత్రసీమలో అడుగు పెట్టి లెజండరీ నటుడు అమితాబ్ నటించిన 'జంజీర్' చిత్రంలో నటిస్తున్నాడు. తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. నా బిడ్డ కాబట్టి తక్కువ మాట్లాడాల్సి వస్తుంది. చరణ్ లాంటి బిడ్డ నా వాడు అయినందుకు చాలా గర్వంగా ఉంది.....నేను జీవితంలో ఏదైనా సాధించానా? అంటే అది రామ్ చరణ్‌నే" అని చెప్పుకొచ్చారు చిరంజీవి.

  తుఫాన్ చిత్రం ప్రేక్షకులకు పూర్తి సంతృప్తిని ఇస్తుందని, ఇందులో చరణ్ పెర్ఫార్మెన్స్, ఆటిట్యూడ్ ఇలా అన్ని విషయాల్లో ఓ మెట్టు పైకి ఎదిగాడు. రామ్ చరణ్ కు ఇది హ్యాట్రిక్ విజయమవుతుందని చెప్పారు. జంజీర్ హిందీ వెర్షన్లో షేర్ ఖాన్‌గా నటించిన సోనూసూద్ తెలుగులో కూడా నటించాల్సి ఉన్నప్పటికీ వీలు కాలేదు. మగధీరలో షేర్ ఖాన్‌గా నటించి ప్రేక్షకులకు గుర్తిండిపోయిన శ్రీహరి ఆయన స్థానంలో చేస్తారో లేదో అని ఫోన్ చేసి అడిగితే వెనువెంటనే ఒప్పుకుని చేశారని, స్నేహానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు శ్రీహరి" అన్నారు.

  రామ్ చరణ్ మాట్లాడుతూ...మొదట ఈ సినిమా చేయమని అపూర్వ లఖియా అడిగినప్పుడు ఒప్పుకోలేదు. నాన్న పేరు నిలబెట్టేందుకు ఎంతో కష్టపడ్డాను. మళ్లీ అమితాబ్ లాంటి వారి గొప్ప వారి సినిమా రీమేక్ లో నటించి తలనొప్పి అవసరమా అనుకున్నాను. నచ్చకపోతే చేయకు కానీ..భయపడి వెనకడుగు వేయవద్దని నాన్న కూడా చెప్పాడు. అపూర్వ అడిగిన 8 నెలల తర్వాత కథ విన్నాను. అప్పుడు చేయాలనిపించింది. ఆయన వర్కింగ్ స్టైల్ చాలా బాగుంది" అన్నారు.

  శ్రీహరి, అపూర్వ లఖియా, ప్రియాంక తదితరులు ఏమన్నారు అనే వివరాలు స్లైడ్ షోలో....

  శ్రీహరి మాట్లాడుతూ...తుఫాన్ సినిమా ఆంధ్రదేశం ఎల్లు దాటి బాణంలా దూసుకోలుతుంది. దాన్ని ఎవరూ దాటలేరు. మగధీర ఏడాది ఆడుతుందని చెప్పాను. ఈ సినిమా చరణ్ కెరీర్లో పెద్ద హిట్టవుతుందన్నారు.

  అపూర్వ లఖియా మాట్లాడుతూ... నాకు తెలుగు రాక పోయినా..తెలుగు సినిమా మేనేజ్ చేసాను. ఇందుకు యోగి ఎంతగానో సహకరించారు అని తెలిపారు.

  చిరంజీవిగారిని, చరణ్ ని చూస్తే నా ఫ్యామిలీలా ఉంటారు. చరణ్ తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. ఈచిత్రం అందరికీ నచ్చుతుంది అన్నారు.

  రామ్ చరణ్ తో చిరంజీవి ముచ్చట్లు

  ప్రియాంకతో చెర్రీ, చిరంజీవి చిట్ చాట్

  తుఫాన్ ట్రైలర్ విడుదల కార్యక్రమానికి హాజరైన తెలుగు సినీ ప్రముఖులు

  English summary
  Thoofan first look traier launched by Chiranjeevi : The trailer launch of Toofan was held at Park Hyatt in Hyderabad today (March 25, 2013). It was grand event, which was attended by Chiranjeevi, Ram Charan, Priyanka Chopra, Apoorva Lakhia, Srihari and many other celebrities. Chiru released the promo as a birthday gift for his son Ram Charan two days in advance.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X