For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Mahesh Babu Rajamouli: మహేశ్ బాబు SSMB29 చిత్రంలో హాలీవుడ్ స్టార్ హీరో? ఇంకా ఎన్నో క్రేజీ ముచ్చట్లు!

  |

  ఒకరు సూపర్ స్టార్.. మరొకరు దర్శక ధీరుడు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు మాములుగా ఉండవు. అవునండీ.. మీకు వచ్చిన డౌట్ నిజమే. ఇప్పుడు మాట్లాడుతుంది మహేశ్ బాబు, రాజమౌళి సినిమా గురించే. వీరిద్దరి కలయికలో సినిమా రావాలని ఎన్నో ఏళ్లుగా అభిమానులు, ప్రేక్షకులు, సినీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక అలాంటి తరుణం రానే వచ్చింది. జక్కన్న రాజమౌళి, హ్యాండ్సమ్ హీరో మహేశ్ బాబు కాంబోలో SSMB29గా సినిమా రానున్న విషయం తెలిసిందే. దానికి సంబంధించిన ఓ విషయం తాజాగా ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది.

  భారీ అంచనాలకు అనుగుణంగా..

  సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌలి కాంబినేషన్ లో సినిమా రావాలని ఇటు అభిమానుల దగ్గరి నుంచి ప్రేక్షకులు, మూవీ లవర్స్ వరకు ఎంతో ఆశపడ్డారు. ఇప్పుడు వారి కల నిజం కాబోతుంది. ఇప్పుడు వీరిద్దరి కలయికలో వస్తున్న SSMB29 సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే సినిమా క్యాస్టింగ్ నుంచి తెరకెక్కించే విధానం వరకు భారీగా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో హాలీవుడ్ పాపులర్ నటుడు శామ్యూల్ ఎల్ జాక్సన్ (Samuel L. Jackson) ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

  హాలీవుడ్ పాపులర్ యాక్టర్..

  అవేంజర్స్, స్టార్ వార్స్, ట్రిపుల్ ఎక్స్, జురాసిక్ పార్క్, మార్వెల్ చిత్రాల్లో నటించే ఈ యాక్టర్ ప్రతి సినిమాకు సుమారు రూ. 80 కోట్ల నుంచి 160 కోట్ల పారితోషికం తీసుకుంటాడు. మరి ఇతను మహేశ్ బాబు సినిమాలో ఉన్నాడో లేడో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. ఇక ఇప్పుడు మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరో క్రిస్ హేమ్స్ వర్త్ (Chris Hemsworth)ను తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో క్రిస్ తో ఓ కేమియో చేయించనున్నాడట జక్కన్న. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన థోర్ సిరీస్ లో హీరోగా నటించాడు క్రిస్ హేమ్స్ వర్త్.

  అవేంజర్స్ విలన్ తో చర్చలు..

  ఇటీవలే థోర్ లవ్ అండ్ థండర్ సినిమాతో అలరించిన క్రిస్.. దాదాపుగా రూ. 172 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటాడు. అంతేకాకుండా ఇటీవల లాస్ ఏంజిల్స్ కేంద్రంగా నడిచే హాలీవుడ్ లీడింగ్ క్రియేటివ్ ఆర్టిస్ట్ ఏజెన్సీ (CAA)తో రాజమౌలి ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ సంస్థ సినిమాల ఎండార్స్ మెంట్, బ్రాండింగ్, మార్కెంటింగ్ తోపాటు అనేక మంది హాలీవుడ్ డైరెక్టర్లు, నటీనటులకు చిత్రాలు, డేట్స్ చూసుకోవడం చేస్తుంది. ఈ సంస్థ సహాకారంతోనే అవేంజర్స్ ఫేమ్ జోష్ బ్రోలిన్ (Josh Brolin) (థానోస్)తో చర్చించాడట రాజమౌళి. మహేశ్ సినిమాలో జోష్ బోర్లిన్ ను మెయిన్ విలన్ పాత్రలో తీసుకునేందుకు అతనితో చర్చించినట్లు సమాచారం.

  ఇండియానా జోన్స్ తరహాలో..

  ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా హాలీవుడ్ ప్రముఖ అడ్వెంచర్ చిత్రం ఇండియానా జోన్స్ మూవీ సిరీస్ తరహాలో ఉంటుందని జక్కన్న తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పినట్లు సమాచారం. అత్యధిక బడ్దెట్ తో ఈ మూవీ తెరకెక్కనుందట. ఇంకా స్క్రిప్ట్ వర్క్ పూర్తి కానీ మహేశ్ బాబు SSMB29 చిత్రం స్టోరి కథ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని విజయేంద్ర ప్రసాద్ తెలిపినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయాలన్నింటిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన ఇంతవరకు రాలేదు. వీటన్నింటిపైన క్లారిటీ రావాలంటే సినిమాకు సంబంధించిన వారు స్పందించాల్సిందే. లేదా సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

  ప్రపంచ దేశాలను చుట్టి వచ్చే సాహస కథగా..

  ప్రపంచ దేశాలను చుట్టి వచ్చే సాహస కథగా..

  అయితే ఇటీవల జరిగిన టెరెంటో ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రం గురించి రాజమౌళి స్పందించిన విషయం తెలిసిందే. మహేశ్ బాబు SSMB29గా వస్తున్న ఈ మూవీ ప్రపంచ దేశాల్లో సాగే సాహసయాత్ర (Globe Troting Action Fiesta)గా ఉంటుందని రాజమౌళి తెలిపారు. కెఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేశ్ బాబుకు జోడిగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్, అలియా భట్ జత కట్టనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

  English summary
  Thor Hero Chris Hemsworth In Rajamouli Mahesh Babu SSMB29 Movie
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X