»   » ‘దసరా’ హీరో రజనీయా? మహేషా? ఎన్టీఆరా?

‘దసరా’ హీరో రజనీయా? మహేషా? ఎన్టీఆరా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ దసరా ఎన్నడూ లేని విధంగా మూడు పెద్ద సినిమాలతో ముందుకొస్తోంది. దాదాపు 105 కోట్ల వరకూ వ్యాపారం జరగనుందని అంచనా. ఈ నేపధ్యంలో దసరా హీరో ఎవరు..కలెక్షన్స్ అన్నీ ఎవరు కొట్టుకెళ్ళతారనే ఆసక్తి అందరిలో నెలకొనటం చాలా సహజం.ఆ మూడు చిత్రాలు... రజనీకాంత్ 'రోబో", మహేష్ 'ఖలేజా", ఎన్టీఆర్ 'బృందావనం". వీటిలో దేని ప్రత్యేకత దానిదే. ఈ మూడు చిత్రాల మధ్య ఆసక్తికరమైన పోటీ ఉంది. కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలోనే ఇవి ఓ రేంజిలో పోటీపడుతున్నాయి.

ఇక ఈ మూడు చిత్రాల పరిస్దితిని ఒక్కసారి పరిశీలిస్తే...ముందుగా దసరా...బరిలోకి దిగుతున్న రజనీకాంత్ తమిళ (ఎంధిరన్) అనువాదం రోబో అక్టోబర్ 1న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి దర్శకుడు శంకర్ కావడం, హీరోయిన్ గా రజనీ సరసన ఐశ్వర్యరాయ్ తొలిసారిగా చేయడం, సన్ పిక్చర్స్ సంస్థ ఏషియాలోనే భారీ బడ్జెట్ 180 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించడం, ఎ.ఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చడం, తెలుగు అనువాద హక్కులు రికార్డుస్థాయిలో 27 కోట్లుకు అమ్మడువటం ఆసక్తి కలిగించి జనాల్ని ధియోటర్ లకి లాక్కొచ్చే అంశాలు.

ఇక మహేష్ 'ఖలేజా" విషయానికొస్తే...రోబో వచ్చిన వారం వ్యవధిలో అక్టోబర్ 7న ఈ చిత్రం విడుదల కానుంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న మహేష్ చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. 'దైవమ్ మానుష్య రూపేణా" అనే థీమ్‌తో ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ తెరకెక్కించాడు. మహేష్ సాధారణ సరదా టాక్సీ డ్రైవర్‌గా నటించాడు. ఇందులో ఎప్పటిలా నెమ్మదిగా కాకుండా గట్టిగా మాట్లాడతాడట. స్టిల్స్ చూస్తే మహేష్ లుక్స్, హెయిర్ స్టయిల్, కాస్ట్యూమ్స్ అన్నీ అదిరిపోతున్నాయి. అలాగే పాటలు కూడా బాగా కుదిరాయి. దాదాపు నలభై కోట్ల వ్యయంతో ఈ చిత్రం రూపొందింది. గతంలో త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన అతడు చిత్రం విజయం సాధించటం, మూడేళ్ళ తర్వత మహేష్ చిత్రం విడుదల కానుండటం ఈ చిత్రానికి హైప్ క్రియేట్ చేస్తోంది.

ఇక కేవలం 'ఖలేజా" వచ్చిన ఒక్కరోజు గ్యాప్‌తో 'బృందావనం" వస్తోంది. ఇప్పుడున్న హీరోల్లో అందరికంటే ముందే మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ ఈసారి క్లాస్ ప్రేక్షకులకు, ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యే ప్రయత్నం ఈచిత్రంలో చేయడం...హీరోలతో సంబంధం లేకుండా కథను నమ్ముకుని ఇంతకుముందు హిట్‌ లు కొట్టిన దిల్‌రాజు ఈసారి స్టార్‌తో సినిమా చేసినా కథకే ప్రాధాన్యం ఇచ్చానని చెప్పడం...కాజల్, సమంత ఎన్టీఆర్ సరసన తొలిసారిగా గోపికలుగా నటించడం ఈ చిత్రంపై అంచనాలను పెరిగేలా చేస్తున్నాయి. దాదాపు 38 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ చిత్రం టైటిల్ దగ్గరనుండి ప్రోమోలు వరకూ ఎన్టీఆర్ ను కొత్తగా ప్రెజెంట్ చేస్తూ వస్తోంది. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

ఇక ఈ దసరా బరిలో దిగి నిలదొక్కుకునే చిత్రం...టెక్నికల్ ఎంటర్టైనర్..రజనీ 'రోబో"నా? మహేష్ యాక్షన్ ఎంటర్‌టైనరా? ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనరా? అనేది కొద్దిరోజుల్లోనే తెలిపోనుంది. ఏదైమైనా ఈ మూడు చిత్రాలుతో ప్రేక్షకులకు మాత్రం ఫుల్ ఎంటర్టైనర్. వీటి తర్వాత వర్మ రక్త చరిత్రకు ప్రిపేర్ కావాలి కదా...ఇంతకీ ముగ్గరులో ఎవరు గెలుస్తారంటారు...

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu