twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR: ఆ మూడు టైటిల్స్ అదుర్స్.. రాజమౌళి పిలుపుకు అభిమానుల రెస్పాన్స్!

    |

    రాజమౌళి మీడియా సమావేశం నిర్వహించిన తర్వాత దేశవ్యాప్తంగా ఈ చిత్రం గురించి చర్చ మొదలైంది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు 1920 కాలం నాటి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుందని తెలిపారు. స్వాతంత్ర ఉద్యమ వీరులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు యుక్త వయసులో ఉన్న సమయంలో కొన్నేళ్లు అదృశ్యమై తిరిగి వచ్చి స్వాతంత్ర పోరాటం చేశారు. అదృశ్యమైన సమయంలో వీరిద్దరూ ఎలా ఉండేవారు అనేదే ఈ చిత్ర కథ అని రాజమౌళి తెలిపారు. ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ టైటిల్ కు మంచి అర్థాన్ని ఇచ్చేలా పూర్తి టైటిల్స్ మీరే సూచించండి అని రాజమౌళి అభిమానులకు పిలుపునిచ్చారు.

     రాజమౌళి పిలుపు

    రాజమౌళి పిలుపు

    ఆర్ఆర్ఆర్ కు పూర్తి అర్థాన్నిచ్చేలా మీరు సూచించిన టైటిల్ బావుంటే దానినే ఫిక్స్ చేస్తామని రాజమౌళి ప్రకటించారు. రాజమౌళి పిలుపుకు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మొదట ఆర్ఆర్ఆర్ ని కేవలం వర్కింగ్ టైటిల్ గా మాత్రమే అనుకున్నామని రాజమౌళి తెలిపారు. కానీ అందరూ ఇదే చాలా బావుంది, దీనినే కొనసాగించాలని కోరారని తెలిపారు. ఆర్ఆర్ఆర్ పూర్తి టైటిల్ వివిధ భాషల్లో వివిధ రకాలుగా నిర్ణయిస్తామని రాజమౌళి తెలిపారు.

    ఆ మూడు టైటిల్స్

    ఆ మూడు టైటిల్స్

    అభిమానులు క్రియేట్ చేసిన మూడు టైటిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందరూ ఈ టైటిల్స్ బావున్నాయని అంటున్నారు. రఘుపతి రాఘవ రాజారాం, రం రం రుథిరమ్, రౌద్ర రణ రంగం అనే టైటిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి మంచి టైటిల్స్ ని అభిమానులు ఇంకా ఆర్ఆర్ఆర్ టీంకు పంపుతూనే ఉన్నారు. రాజమౌళి అభిమానులు పంపిన టైటిల్స్ తో సంతృప్తి చెందుతారా లేక తాము నిర్ణయించుకున్న టైటిల్సే పెడతారా అనేది వేచి చూడాలి.

    RRR: మరో ఇద్దరు బాలీవుడ్ టాప్ స్టార్లతో రాజమౌళి సంప్రదింపులు?RRR: మరో ఇద్దరు బాలీవుడ్ టాప్ స్టార్లతో రాజమౌళి సంప్రదింపులు?

    రామ రావణ రాజ్యం

    రామ రావణ రాజ్యం

    రామ రావణ రాజ్యం అనే టైటిల్ ముందు నుంచి ప్రచారంలో ఉంది. బహుశా చిత్ర యూనిట్ అనుకుంటున్న టైటిల్ ఇదేనేమో అనే చర్చ కూడా జరుగుతోంది. ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీంగా నటించబోతున్నారు. స్వాతంత్ర సమరయోధుల కథని రాజమౌళి ఎలా తెరక్కేక్కిస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.

     దేశవ్యాప్తంగా

    దేశవ్యాప్తంగా

    బాహుబలి తర్వాత రాజమౌళి పేరు దేశంలోనే పరిచయం అక్కర్లేనిదిగా మారిపోయింది. అలాంటి రాజమౌళి దర్శత్వంలో ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతుండడంతో ఈ చిత్రం కోసం అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. అలియా భట్, డైసీ ఎడ్గార్ జోన్స్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం 2020 జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని 400 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్నారు.

    English summary
    Three interesting titles Goes viral in social media regarding RRR movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X