Just In
Don't Miss!
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'తిక్క' హాలీవుడ్ కాపీనా?, ఆల్రెడీ అల్లరి నరేష్ చేసాడుగా?, హీరో ఏమంటున్నాడు?
హైదరాబాద్: సాయి ధరమ్ తేజ హీరోగా రూపొందిన తిక్క చిత్రం రేపు (ఆగస్టు 13న) విడుదల అవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం హాలీవుడ్ చిత్రానికి కాపీ అంటూ ప్రచారం మొదలైంది. మరో ప్రక్క ఆల్రెడీ అదే కథని అల్లరి నరేష్ ఇంతుకు ముందు చేసాడు అంటున్నారు. అయితే అందులో ఎంతవరకూ నిజం ఉంది. ఏ హాలీవుడ్ చిత్రం కాపీ అంటున్నారు.
తన తొలి సినిమా పిల్లా నువ్వు లేని జీవితంతో మంచి సక్సెస్ సాధించిన సాయి తరువాత విడుదలైన రేయ్ సినిమాతో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో తరువాతి సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు.హారిష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో 20 కోట్ల వసూళ్ల మార్క్ కు చేరువైన సాయి.. ఆ తరువాత విడుదలైన సుప్రీంతో, ఆ మార్క్ ను ఈజీగా దాటేసి స్టార్ హీరోల లీగ్ లో చేరిపోయాడు.
తాజాగా తిక్క సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్న మెగా వారసుడు, ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ మీద కన్నేశాడు. అయితే సాయి తిక్కకు ఒక్క రోజు ముందే వెంకటేష్ బాబు బంగారం రిలీజ్ అవుతుండటంతో తిక్క కలెక్షన్ల మీద ప్రభావం పడే అవకాశం ఉందన్న టాక్ అంతటా వినిపిస్తోంది. మరి సీనియర్ హీరో ఇమేజ్ ను దాటి సాయి ధరమ్ తేజ్ రికార్డ్ అందుకుంటాడేమో చూడాలంటున్నారు ట్రేడ్ పండితులు.
స్లైడ్ షోలో..తిక్క..హాలీవుడ్ కాపీ డిటేల్స్

అప్పట్లో వచ్చిన
అప్పట్లో హాలీవుడ్ లో వచ్చి ఘన విజయం సాధించిన హ్యాంగోవర్ కు తెలుగు నేటివిటి అద్ది వదలిన కాపీ అంటున్నారు తెలుగు సినిమా జనం.

తిక్క కథ ఏంటి
లవ్ లో బ్రేకప్ అయిన హీరో... ఫ్రెండ్ తో తాగి ఆ హ్యాంగోవర్ లో సిటీ మొత్తం చేసే హంగామా, అల్లరి, దాని నుంచి వచ్చే పరిణామాలే కథ అని తెలుస్తోంది.

హ్యాంగోవర్ లో కథ ఏంటి
హీరో తన పెళ్లి సందర్బంగా ఫ్రెండ్స్ కు బాచిలర్ పార్టీ ఇచ్చినప్పుడు జరిగిన హంగామా, అల్లరి, దాని పరిణామాలే కథ.

అల్లరి నరేష్ తో
ఆల్రెడీ హ్యాంగోవర్ చిత్రం అనఫీయల్ రీమేక్ గా అల్లరి నరష్ హీరోగా వచ్చిన యాక్షన్ త్రిడీ చిత్రం రిలీజై ఫ్లాఫైంది.

సాయి ధరమ్ తేజ ఏమంటాడు
ఈ సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. హాలీవుడ్ మూవీ 'హ్యాంగోవర్'కీ, దీనికీ సంబంధం లేదు అని తేల్చి చెప్పాడు

తిక్క కథ ప్రకారం..
ఈ చిత్రంలో రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేసే యువకుడిగా కనిపిస్తాడు సాయి. లవ్‌లో ఫెయిలైన తర్వాత ఫ్రెండ్స్‌కి ఇచ్చిన బ్రేకప్ పార్టీలో మందు తాగడం వల్ల పరిస్థితులన్నీ మారతాయి. అప్పట్నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర య్యాయి? పార్టీలో పరిచయమైన స్నేహితులతో ఏం చేశాడు? అనేది సినిమా.

తాగుడు సీన్స్ కోసం..
మందు తాగిన సీన్స్ చేయడం కష్టమైంది. అప్పుడు నటుడు 'తాగుబోతు' రమేశ్ కొన్ని సలహాలిచ్చాడు. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను నవ్విస్తుంది అంటున్నారు సాయి.

పవన్ ప్రస్దావన లేదు
''ఈ చిత్రంలో హీరోకి పరిచయమయ్యే పాత్రలన్నీ తిక్క తిక్కగా ప్రవరిస్తాయి. అందుకే, ఆ టైటిల్ పెట్టాం. అంతేకానీ, మా మావయ్య పవన్ కల్యాణ్ ప్రస్తావన సినిమాలో ఉండదు. '' అని సాయి చెప్పారు

తిక్క హీరో
ఇప్పటివరకూ చేసిన క్యారెక్టర్స్, సినిమాలకు డిఫరెంట్‌గా చేశా. చరణ్, బన్నీలు 'తిక్క హీరో' అని ఆటపట్టిస్తున్నారని నవ్వుతూ చెప్పాడు సాయి

సవాల్ గా తీసుకున్నా..
చిరంజీవి, కల్యాణ్ మావయ్యల ఫిల్మ్స్ చూసా, వాళ్లలా కాక నేను కొత్తగా ఏం చేయగలనని సవాలుగా తీసుకుని ఈ సీన్స్ చేశా.

ఇరవైనిముషాలు
కృష్ణవంశీగారితో ఎప్పట్నుంచో పరిచయముంది. ఆయన అడిగిన వెంటనే 'నక్షత్రం'లో పోలీసాఫీసర్‌గా చేయడానికి అంగీకరించా. ఇరవై నిమిషాల పాటు తెరపై కనిపిస్తా అని సాయి చెప్పారు.

తర్వాత నిర్ణయం
కల్యాణ్‌రామ్‌తో మల్టీస్టారర్ సినిమా డిస్కషన్స్‌లో ఉంది. కథ రెడీ అయ్యాక నిర్ణయం తీసుకుంటాను. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నల్లమలుపు బుజ్జి, 'ఠాగూర్' మధు నిర్మించే సినిమా ఈ నెలాఖరున మొదలవుతుంది.