నేడే ‘పంజా’ ఆడియో...అత్యద్భుతమైన లైవ్ పెర్ఫార్మెన్స్ ...!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'పంజా" ఆడియో ఆల్బం ఇవాళ విడుదల కానుంది. కళ్ళు మిరుమిట్లు గొలిపేల నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం లో జరుగనుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్స్ ఈ చిత్రం పై అంచనాలను తారాస్తాయికి చేర్చాయి. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. తాజా సమాచారం ప్రకారం ఈ ఆడియో వేడుకలో అత్యద్భుతమైన లైవ్ పెర్ఫార్మెన్స్ ప్లాన్ చేసినట్టు తెలిసింది.
ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొనే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని తమిళ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ చేస్తున్నారు. అంజలి లావెనియా, సారా జైన్ దియాస్ హీరొయిన్లుగా నటిస్తున్నారు. కోల్కతా నేపద్యం తో ఈ సినిమా సాగుతుంది. శోభు యార్లగడ్డ, నీలిమ తిరుమల శెట్టి సంయుక్తం గా ఈ మూవీ నిర్మిస్తున్నారు. షూటింగ్ పార్ట్ దాదాపుగా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంతో జరుగుతున్నాయి. డిసెంబర్ 9న సినిమా రిలీజ్ చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











