నేటి విలన్స్ సమాజం నుంచే పుట్టుకొస్తున్నారు: అమీర్ ఖాన్
2004లో వచ్చిన 'ధూమ్' చిత్రం మంచి విజయం సాధించడంతో ఆ తర్వాత 2006 సంవత్సరంలో ధూమ్ 2 చిత్రం విడుదలై ప్రేక్షకుల ఆదరణ చూరగొంది. తాజాగా ఈ రెండు సినిమాలకు సీక్వెల్ గా 'ధూమ్ 3' చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో అమీర్ ఖాన్ నెగెటివ్ క్యారెక్టర్ చేస్తుండగా అతని సరసన కత్రినా కైఫ్ నటిస్తోంది.
అమీర్ మీడియాతో మాట్లాడుతూ 'సినిమాల్లో విలన్స్ స్ర్కిప్టు ఆధారంగా సృష్టించే పరిస్థితి మారి పోయింది. సమాజం నుంచే విలన్స్ పుట్టుకొస్తున్నారు. వాటినే సినిమాల్లో చూపిస్తున్నాం. నేటి సినిమాల్లో కనిపించేదంతా సమాజం నుంచి గ్రహించినదే' అని చెప్పుకొచ్చాడు. సినిమాల్లో చూపించే స్మగ్లర్స్, అండర్ వల్డ్ డాన్స్, మంచి పొలిటీసియన్స్, చెడ్డ పొలిటీషియన్స్ సమాజంలో ఉండే వారే అని అమీర్ చెప్పుకొచ్చారు.
ధూమ్ 3 చిత్రాన్ని యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి ఆదిత్య చోప్రా నిర్మాత. అమీర్ ఖాన్, అభిషేక్ బచ్చన్, కత్రినా కైఫ్, ఉదయ్ చోప్రా తదితరులు ఈచిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈచిత్రం 2013లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications












