»   » రానా కు తప్పని తలనొప్పి, విషయం అందరికీ చెప్తున్నాడు

రానా కు తప్పని తలనొప్పి, విషయం అందరికీ చెప్తున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల లో ఫేక్ ఎక్కౌంట్ ల సమస్య రోజు రోజుకీ పెరుగుతోంది. సామాన్యుల ఫేక్ ఎక్కౌంట్ లు ఎవరూ పెద్దగా చేయరు కానీ, సెలబ్రెటీల ఫేక్ ఎక్కౌంట్ లు ఫేస్ బుక్, ట్విట్టర్ లో కుప్పలు తెప్పలుగా ఉంటున్నాయి. కొందరు సెలబ్రెటీలు వాటిని చూసి చూడనట్లు ఊరుకుంటూంటే, కొందరు మాత్రం వాటిని సీరియస్ తీసుకుని, తొలిగించే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read: క్రేజ్ కోసమే కానీ... : ఫేస్ బుక్ అవుతుంది వీళ్లే...ఫేక్ ఐడీలు, అసభ్య ఫొటోలు

ఎందుకంటే ఫేక్ ఎక్కౌంట్ క్రియేట్ చేసి వాటి ద్వారా...ఆయా నటులుకు సంభందించిన ఫేక్ న్యూస్ ని ప్రచారం చేస్తూంటారు కొందరు యాంటీ ఫ్యాన్స్. ఇది లేనిపొని కొత్త సమస్యలు తెచ్చిపెడుతుంది. హ్యాకింగ్ చేసి సమస్యలు క్రియేట్ చేయటం లాంటిదే ఈ ఫేక్ ఎక్కౌంట్ ల సమస్య కూడా.

తాజాగా దగ్గుపాటి రానా తనకు ఫేస్ బుక్ లో ఓ ఫేక్ ఎక్కౌంట్ ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని తన అభిమానులు, తనను ఫేస్ బుక్ లో ఫాలో చేసేవారి దృష్టికితీసుకు వచ్చే ప్రయత్నం చేసారు. ఈ మేరకు ఆయన ఓ పోస్ట్ పెట్టారు.

ప్రస్తుతం రానా బాహుబలి 2 చిత్రం బిజీలో ఉన్నారు. 'బాహుబలిలో నా పాత్ర అంతబాగా రావడానికి కారణం మాత్రం రాజమౌళినే.. అలాగే చెప్పాలంటే బాహుబలి - ది కంక్లూజన్ అనేది బాహుబలి - ది బిగెనింగ్ అనే దానికంటే చాలా పెద్దగా ఉంటుంది. అది చూసాక ఫస్ట్ పార్ట్ చాలా చిన్నది అనిపిస్తది. పోరాట సన్నివేశాలు, ఎమోషన్స్,సెట్స్ ఇలా అన్నీ సెకండ్ పార్ట్ లో ఎక్కువగా ఉంటాయని' రానా తెలిపాడు.

అలాగే రానా హీరో గా నటించిన 'ఘాజీ' చిత్రం కోసం ఆయన అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. తెలుగు .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ రెండు వెర్షన్స్ కి సంబంధించిన డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు వున్నారు.

Tollywood Actor Rana Disowns Fake Facebook Account

భారీ నిర్మాణ విలువలతో జనవరిలో ప్రారంభమైన ఈ సినిమా కథానుసారం నీటి లోపల ఒక ప్రధానమైన యుద్ధ ఘట్టం కూడా చిత్రీకరించారు. ఇప్పటికే సర్టిఫైడ్ డైవర్ అయిన రానా ఈ పీరియడ్ డ్రామా కోసం ప్రత్యేకించి "అండర్ వాటర్" పాఠాలేమీ నేర్చుకోలేదు కానీ, కొద్దిగా రిహార్సల్స్ చేశారు. కొద్ది రోజులు ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు నీటిలోనే ఉండి, షూటింగ్ చేస్తూ బాగా శ్రమపడ్డారని చిత్ర యూనిట్ సమాచారం.

English summary
Baahubali actor Rana has disowned a fake Facebook account. Rana Daggubati shared in Fb: " A fake profile of mine is doing the FB rounds....!! Pls dont add any direct requests from this account!! Thank you issue will be addressed shorty!!"
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu