For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సహజీవనం ఆనందంగానే ఉంది : ప్రియుడి విషయాలు చెప్పిన ఇలియానా

  |

  టాలీవుడ్ వెండితెర మీద ఓ శృంగార దేవతగా ఓ వెలుగు వెలిగిన ఇలియానా ఆర్పేసిన దీపంలా మారిపోయింది. ఎప్పుడు నాలుగైదు సినిమాలతో తెలుగు పరిశ్రమలో హడావిడి చేసే ఇలియానా బాలీవుడ్‌కు తరలిపోయింది. హిందీ పరిశ్రమలో ఒకట్రెండు సినిమాల్లో బాగానే మెరిసింది. అయితే హిందీలో ఏక్ సే ఏక్ హీరోయిన్లు ఉండటంతో అనుకున్నంతగా ఇలియానా రాణించలేకపోయింది. ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్న ఇలియానా ప్రస్తుతం ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్‌తో డేటింగ్ చేస్తున్నది.

  ఇలియానా

  ఇలియానా

  ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా.... తర్వాత బాలీవుడ్లో అడుగు పెట్టి సౌత్ సినిమాల వైపు కన్నెత్తయినా చూడటం లేదు. అమ్మడు నటించిన తొలి చిత్రం మంచి విజయం సాధించినప్పటీ.... తర్వాత సినిమాలన్నీ ప్లాపయ్యాయి. వరుస ప్లాపులతో ఇలియానాకు కూడా అవకాశాలు కూడా తగ్గిపోయాయి.

  Unknown Facts About Mega Star Chiranjeevi "Birthday Special"
  బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ

  బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ

  గత రెండేళ్లలో ఇలియానా చేసిన సినిమాలు కేవలం రెండే అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చేతిలో పెద్దగా సినిమాలు లేక పోవడంతో... ఖాళీ సమయాన్ని తన బాయ్ ఫ్రెండుతో గడపటానికి కేటాయిస్తోంది. ఇలియానా బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ... ఫోటో గ్రాఫర్ కావడంతో అతడు తన అందందాలను మరింత అందంగా ఎక్స్ ఫోజ్ చేస్తూ తీసిన ఫోటోలను అభిమానులకు చూపిస్తూ కాలం గడుపుతోంది.

  ప్రేమ వ్యవహారాన్ని దాచిపెట్టలేదు

  ప్రేమ వ్యవహారాన్ని దాచిపెట్టలేదు

  అయితే ఇలియానా అందరిలాంటి నటి కాదు. బాలీవుడ్‌లో ఇతర నటీమణుల్లాగా ఆమె తన ప్రేమ వ్యవహారాన్ని దాచిపెట్టలేదు. వీలు చిక్కినప్పుడల్లా తన ప్రేమికుడి ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూనే ఉంది. ఆస్ట్రేలియాకు చెందిన 29 ఏళ్ల ఫొటోగ్రాఫర్‌ ఆండ్ర్యూ నీబోన్‌తో ఇలియానా సహజీవనం చేస్తోంది.

  మిడ్‌-డే' పత్రికకు ఇంటర్వ్యూ

  మిడ్‌-డే' పత్రికకు ఇంటర్వ్యూ

  వీరిద్దరూ సరదాగా దిగిన ఫొటోలు అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో దర్శనమిస్తూనే ఉంటాయి. తాజాగా ఇలియానా 'మిడ్‌-డే' పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ తన ప్రియుడి గురించి పలు విషయాలు తెలిపింది. అతని గురించి తరచూ మాట్లాడటం తనకు ఇష్టం ఉండదని, అతను మామూలుగా ఉండటానికి ఇష్టపడతానని, అతని ప్రైవసీకి భంగం కలిగించకూడదని తెలిపింది.

  11 ఏళ్లుగా కొనసాగుతున్నాను

  11 ఏళ్లుగా కొనసాగుతున్నాను

  'చిత్ర పరిశ్రమలో నేను 11 ఏళ్లుగా కొనసాగుతున్నాను. ఇక్కడి పని సంస్కృతి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. నటులుగా మాకు ఎంతో ప్రేమ లభిస్తుంది. అదే సమయంలో కారణం లేకున్నా ఎంతో వ్యతిరేకతను మూటగట్టుకుంటాం. మేం చేసే వ్యాఖ్యలు కూడా కొన్నిసార్లు ఇబ్బందులు సృష్టిస్తాయి.

  అతను సాధారణ వ్యక్తి.

  అతను సాధారణ వ్యక్తి.

  ఇదంతా ఆండ్రూ భరించాల్సి రావడం సరికాదనేది నా భావన. అతను సాధారణ వ్యక్తి. ప్రైవసీని ఇష్టపడతాడు. కొంతమంది వచ్చి అతను భారతీయుడు కాదు అంటూ ఏవేవో చెప్తుంటారు. కానీ, అతను నాకు ప్రత్యేకమైన వ్యక్తి. ఏ తప్పు లేకపోయినా నా కుటుంబాన్ని ఒకరు వేలెత్తిచూపే పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటాను' అని ఇలియానా తెలిపింది.

  కలిసి ఉండటానికి పెళ్ళే చేసుకోవాలా

  కలిసి ఉండటానికి పెళ్ళే చేసుకోవాలా

  మరీ ఆండ్ర్యూను ఎప్పుడూ పెళ్లి చేసుకుంటారని ప్రశ్నించగా.. ప్రస్తుతానికి తాము సహజీవనంలో గడుపుతూ ఆనందంగా ఉన్నామని, పెళ్లి, సహజీవనానికి మధ్య భేదం చాలా చిన్నదని పేర్కొంది. సో ఆండ్రూతో కూడా ఫార్మల్ గా పెళ్ళేమీ ఉండకపోవచ్చు అనే అనుకోవాలి. అయినా మనపిచ్చిగానీ పెళ్ళి చేసుకుంటే కలిసి ఉంటారు గానీ... కలిసి ఉండటానికి పెళ్ళే చేసుకోవాలా

  English summary
  While the actor loves posting pictures with her beau, she is not too comfortable talking about their relationship in public. In an interview to Mid-Day, Ileana opens up on relationship with Andrew Kneebone
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X