»   » షాక్: పాకిస్థాన్ యాడ్లో తెలుగు హీరోయిన్

షాక్: పాకిస్థాన్ యాడ్లో తెలుగు హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘ఉల్లాసంగా ఉత్సాహంగా' సినిమా ద్వారా తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైన భామ స్నేహ ఉల్లాల్. అయితే ఆమె నటిస్తున్న యాడ్ ఒకటి హాట్ టాపిక్ అయింది. పాకిస్థాన్ కు చెందిన యాడ్లో ఆమె నటించడమే ఇందుకు కారణం. ఇటీవలే ఆమెకు పిలుపు వచ్చిందని సమాచారం.

పాకిస్థాన్‌‌కు సంబంధించిన బ్రైడల్ కలెక్షన్(పెళ్లి కూతురు ధరించే దుస్తులు) ను ప్రమోట్ చేయడానికి ఆమె ఈ యాడ్ ఫిల్మ్ లో నటిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన షూటింగ్ దుబాయ్ లో ప్లాన్ చేసారని, స్నేహ ఉల్లాల్‌కు పిలుపు రావడంతో అక్కడకు వెళ్లిందని అంటున్నారు. త్వరలోనే ఆ కలెక్షన్ ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోలు బయటకు రానున్నాయి.

Tollywood actress in Pakistan Ad

ఈ మధ్య కాలంలో పలువురు పాకిస్థాన్ నటులు, నటీమణులు బాలీవుడ్ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీణా మాలిక్, ఫవాద్ ఖాన్, హుమా ఖురేషి తదితరు పాకిస్థాన్ నుండి ఇండియా వచ్చి ఇక్కడి చిత్రాల్లో నటిస్తున్నారు. అదే విధంగా స్నేహ ఉల్లాల్ కూడా పాకిస్థాన్ యాడ్ ఫిల్మ్ లో నటించేందుకు సిద్ధమైంది.

స్నేహ ఉల్లాల్ సినిమాల విషయానికొస్తే.... చాలా కాలంగా ఆమెకు సరైన అవకాశాలు లేవు. ప్రస్తుతం ఆమె ‘బెజుబాన్ ఇష్క్' అనే హిందీ మూవీలో నటిస్తోంది. జస్వంత్ గంగానీ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో ముగ్దా గాడ్రే, స్నేహ ఉల్లాల్, నిషాత్ మల్కాని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జూన్ 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
Sneha Ullal has been invited to Dubai for an ad shoot. This is going to be for a Pakistani bridal collection and Sneha Ullal is quite excited.
Please Wait while comments are loading...