»   » నేను ఇపుడు గర్భవతిని: మీడియాతో కామ్నా జఠ్మలానీ

నేను ఇపుడు గర్భవతిని: మీడియాతో కామ్నా జఠ్మలానీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ల గర్భం దాల్చితే ఆ విషయాన్ని దాదాపుగా గోప్యంగా ఉంచుతారు. ఒక వేళ ఆ సమయంలో తాము ఏదైనా సినిమాలో నటిస్తున్నా లేదా తాము నటించిన సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నా ఈ విషయాన్ని బయట పెట్టడానికి అసలు ఇష్ట పడరు. అయితే హీరోయిన్ కామ్నా జఠ్మలానీ మాత్రం ఈ విషయాన్ని దాచుకోదలుచుకోలేదు.

త్వరలో విడుదల కాబోతున్న ‘చంద్రిక' సినిమా ద్వారా మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తున్న ఆమె ఇటీవల ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న సందర్భంగా ఈ సంతోషకరమైన విషయాన్ని బయట పెట్టింది. తాను గర్భం దాల్చిన విషయాన్ని మీడియా వారితో పాలుపంచుకుంది. సంతోషంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం తనకు ఐదో నెల అని, త్వరలోనే తల్లికాబోతున్నట్లు తెలిపింది.

Tollywood actress Kamna Jethmalani Is Pregnant

కామ్నా జఠ్మలానీ గతేడాది సూరజ్ నాగ్ పాల్ అనే బిజినెస్‌మేన్‌ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాల్లో నటించాలని డిసైడ్ అయింది. ఇందుకు భర్త సహకారం కూడా ఉండటం విశేషం.

కార్తీక్‌ జయరామ్‌ కథానాయకుడిగా, కామ్న జెఠ్మలానీ, శ్రీముఖి నాయికలుగా నటించిన ‘చంద్రిక' చిత్రం ఈ నెల 25న విడుదలవుతోంది. యోగేశ్‌ దర్శకత్వంలో ఫ్లయింగ్‌ వీల్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వి. ఆశ ఈ చిత్రాన్ని నిర్మించారు. సాజిద్‌ ఖురేషి సమకూర్చిన కథ, స్ర్కీన్‌ప్లే, ఆర్టిస్టుల అభినయం, గుణ్వంత్‌సేన్‌ పొందుపరచిన రీరికార్డింగ్‌, గ్రాఫిక్స్‌ చిత్రానికి ప్రధాన ఆకర్షణలవుతాయి.

English summary
Kamna Jethmalani who is making a comeback with Chandrika also starring Jayaram Karthik alias JK, was more than happy sharing the most happiest news — of her pregnancy with media persons.
Please Wait while comments are loading...