»   » క్రికెట్ దేవుడితో... టాలీవుడ్ అందాల దేవత, ట్విట్టర్ లో ఇలా ఫొటోలు

క్రికెట్ దేవుడితో... టాలీవుడ్ అందాల దేవత, ట్విట్టర్ లో ఇలా ఫొటోలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ ను ఇంటర్వూ చేశానంటూ రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేసింది. స‌చిన్‌: ఎ బిలియ‌న్ డ్రీమ్స్ సినిమా ప్రమోషన్స్ కోసం ఓ ప్రీమియర్ షో ను కూడా ఏర్పాటు చేశాడు సచిన్. ఈ మూవీ అద్భుతం.. కోట్ల మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని ట్వీట్ లో పేర్కొంది.

రకుల్‌ప్రీత్‌సింగ్‌

రకుల్‌ప్రీత్‌సింగ్‌

అంతేకాదు ఇప్పటివరకు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌.. తాజాగా రిపోర్టర్‌ అవతారమెత్తింది. ఏకంగా మాస్టర్‌ బ్యాట్స్‌మెన్‌ సచిన్‌ టెండూల్కర్‌ మీద ప్రశ్నల వర్షం కురిపించింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.

'సచిన్ - ఎ బిలియన్ డ్రీమ్స్

'సచిన్ - ఎ బిలియన్ డ్రీమ్స్

ఔను మీరు చదివింది నిజమే కెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఇంటర్వ్యూ చేసింది. సచిన్ నటించిన 'సచిన్ - ఎ బిలియన్ డ్రీమ్స్' సినిమా వచ్చే శుక్రవారంనాడు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, సినిమా ప్రమోషన్ లో భాగంగా సచిన్ హైదరాబాద్ వచ్చాడు.

సచిన్‌తో కలిసి తీయించుకున్న ఫోటో

సచిన్‌తో కలిసి తీయించుకున్న ఫోటో

తాను ఎంతో ఇష్టపడే సచిన్ ను ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ ఇంటర్వ్యూ చేసింది. సచిన్‌ అంటే ఎంతో ఇష్టపడే రకుల్‌.. ఆయన జీవితం గురించి పలు ఆసక్తికర ప్రశ్నలు సంధించింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది రకుల్‌. సచిన్‌తో కలిసి తీయించుకున్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన రకుల్‌..

ఎంతో గర్వంగా ఉంది

ఎంతో గర్వంగా ఉంది

‘క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ను ఇంటర్వ్యూ చేయడం ఎంతో గర్వంగా ఉంది. ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుంద'ని ట్వీట్ చేసింది. సెలబ్రిటీలూ కొన్ని సార్లు ఇలా అభిమానులైపోతారు. అయినా సచిన్ లాంటి ప్రపంచ ప్రసిద్ద క్రికెటర్ తో కాసేపైనా గడిపి, ఆయన్ని ప్రశ్నలడిగే చాస్ వస్తే ఎంతటి సెలబ్రిటీ అయినా ఇంత ఆనందపడటం లో అశ్చర్యం ఏముందీ.

English summary
The legendary cricketer Sachin Tendulkar is busy promoting his biopic Sachin: A Billion Dreams and is currently in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu