»   » ఎవరి బిస్కెట్లకు పడిపోను, నేను శేఖర్ కమ్ముల పేరు చెప్పానా?: శ్రీరెడ్డి

ఎవరి బిస్కెట్లకు పడిపోను, నేను శేఖర్ కమ్ముల పేరు చెప్పానా?: శ్రీరెడ్డి

Posted By:
Subscribe to Filmibeat Telugu
ఎవరి బిస్కెట్లకు పడిపోను, నేను శేఖర్ కమ్ముల పేరు చెప్పానా? : శ్రీరెడ్డి

టాలీవుడ్లో సంచలనం రేపుతున్న శ్రీరెడ్డి వ్యవహారంలో తన పేరు తెరపైకి రావడంతో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందించిన సంగతి తెలిసిందే. ఆమె పేరు ప్రస్తావించకుండా స్పందిస్తూ... తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించే ప్రయత్నం చేశారు. తన గురించి చేసిన ఆ పోస్ట్ లోని ప్రతీ మాట తప్పు అని ఒప్పుకొని, క్షమాపణ చెప్పకపోతే, చట్టపరంగా చర్యలు తీసుకుంటాను అని వార్నింగ్ ఇచ్చారు.

శేఖర్ కమ్ముల వ్యాఖ్యలపై తాజాగా శ్రీరెడ్డి స్పందించారు. నేను ఎవరినీ పర్సనల్‌గా తీసుకుని ఏమీ అనలేదు. నా ఇష్టం వచ్చినట్లు నా సోషల్ పేజీ మీద ఏమైనా రాసుకుంటాను. ఆ కామెంట్స్ తమ గురించే అని ఎవరైనా ఫీలైతే దానికి నేనేమీ చేయలేను అని శ్రీరెడ్డి అన్నారు.

ఎవరి బిస్కట్లకు లొంగడం లేదు

ఎవరి బిస్కట్లకు లొంగడం లేదు

నా దగ్గర చాలా మందికి సంబంధించిన ప్రూప్స్ ఉన్నాయి. నేను ఎవరి బిస్కెట్లకు పడిపోవడం లేదు. ఎవరిచ్చిన సంచులు పుచ్చుకోవడం లేదని క్లియర్ గా చెబుతున్నాను. తప్పకుండా ఆధారాలు విడుదల చేస్తాను. గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. లీగల్ గా వెళుతున్నాము. లీగల్ గా వెళ్లేపుడు పబ్లిసిటీ కోసం, మీ అందరి(నెటిజన్లు) ఆనందం కోసం ఇప్పుడే ఆధారాలు బయట పెట్టలేను. ఎవరికైతే క్యూరియాసిటీ ఉందే కొంతకాలం పాటు మెయింటేన్ చేయండి.... అని శ్రీరెడ్డి అన్నారు.

అన్యాయం జరిగింది నాకు

అన్యాయం జరిగింది నాకు

అన్యాయం అయిపోయింది నేను. న్యాయం జరుగాల్సింది నాకు. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో నాకు తెలుసు. అనవసరంగా మీరు(కొందరు నెటిజన్లు) రెచ్చిపోయి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయవద్దు....అని శ్రీరెడ్డి అన్నారు.

నీ పేరు మెన్షన్ చేశానా?

నీ పేరు మెన్షన్ చేశానా?

‘‘నీ పేరు మెన్షన్ చేశానా? లేక నీ సినిమా పేరు మెన్షన్ చేశానా? జైల్లో పెట్టిస్తానంటున్నావు శేఖర్ కమ్ముల ఈ రోజు. చట్ట ప్రకారం వెళ్తావా? వెళ్లు నాకేమైనా భయమా? నువ్వు శేఖర్ కమ్ముల అయితే నాకేంటి? నీ దగ్గర డబ్బులు ఉంటే నాకేంటి? మీరు తప్పు చేయకుంటే సైలెంటుగా ఉండండి'' అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు.

పెద్దవాళ్లకి చెప్పేది ఒకటే...

పెద్దవాళ్లకి చెప్పేది ఒకటే...

పెద్దవాళ్లకి ఒకటే చెబుతున్నాను. నేను సింగిల్ పర్సన్ అనుకుంటున్నారు. సింగిల్ పర్సనల్ అయినా మనసులో దైర్యం ఉండాలి. వెనకాల ఎవరో అవసరం లేదు. డబ్బులుండాల్సిన అవసరం లేదు. పోరాటానికి గుండెలో ధైర్యం ఉంటే చాలు. మీరు తప్పు చేయకుంటే మాట్లాండకండి. తప్పు చేస్తే నా కోర్టులో కాకున్నా, ఆ కోర్టులో కాకున్నా దేవుడు అనేవాడు ఉన్నాడు శిక్ష తప్పకుండా వేస్తాడు... అని శ్రీరెడ్డి అన్నారు.

త్వరలోనే అందరికీ నోటీసులు అందుతాయి

త్వరలోనే అందరికీ నోటీసులు అందుతాయి

తప్పులు చేసిన వారి అందరికీ సంబంధిన విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. శేఖర్ కమ్ముల విషయంలో వెనక్కి తగ్గావు అదీ ఇదీ అంటున్నారు. ఏంటండీ వెనక్కి తగ్గేది. శేఖర్ కమ్ముల తప్పు చేశాడు, చేయలేదు అని ఏమీ చెప్పను. కానీ నా వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయి. లీగల్ గా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాను. త్వరలోనే ఒక్కొక్కరికీ నోటీసులు వెళతాయి.... అని శ్రీరెడ్డి తెలిపారు.

మాకు ఫ్యామిలీ ఉంది, హర్టవుతుంది

మాకు ఫ్యామిలీ ఉంది, హర్టవుతుంది

మా ఫ్యామిలీ హర్టయింది, లీగల్ నోటీసులు ఇస్తా అంటే...శేఖర్ కమ్ముల గారు మిమ్మల్ని ఉద్దేశించి అనడం లేదు కానీ నేను ఒకటి చాలా క్లియర్ గా చెబుతున్నాను. మాకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి. మాకు కూడా మనసులు ఉంటాయి. మా మనసులు కూడా హర్ట్ అవుతాయి... అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు.

అంతకు ముందు శేఖర్ కమ్ముల తన పోస్టులో....

అంతకు ముందు శేఖర్ కమ్ముల తన పోస్టులో....

ఈ వ్యవహారంలో శేఖర్ కమ్ముల మంగళవారం ఓ పోస్టు చేశారు. ‘‘నన్ను కించపరుస్తూ, సోషల్ మీడియాలో నిన్న వచ్చిన పోస్ట్, నా దృష్టికి వచ్చింది. ఆ పోస్ట్ లో ప్రతీ మాట అబద్ధం. అసభ్యం. అవమానకరం. ఆ పోస్ట్ నాకు, నా కుటుంబానికి, నన్ను గౌరవించేవారికి చాలా మనస్థాపం కలిగించింది. నేను ఎప్పుడూ కలవని, అసలు చూడనే చూడని, కనీసం ఫోన్లో కుడా మాట్లాడని అమ్మాయి , నా గురించి ఆధారం లేని ఆరోపణలు చేయటం షాకింగ్ గా ఉంది. ఈ దిగజారుడు చర్య వెనక ఎవరున్నా, వారి ఉద్దేశం ఏమైనా, నేను చెప్పదల్చుకున్నది ఒకటే. ఇది తప్పు, నేరం, అనైతికం. స్త్రీ ల సమానత్వం, సాధికారతలని నేను ఎంత నమ్ముతానో నా సినిమాలు, నా కార్యక్రమాలు చూస్తే అర్ధమౌతుంది. నా వ్యక్తిత్వం, నమ్మే విలువలు నా ప్రాణం కంటే ముఖ్యం. వాటి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే, వదిలి పెట్టే ప్రసక్తి లేదు. ఆ పోస్ట్ లోని ప్రతీ మాట తప్పు అని ఒప్పుకొని, క్షమాపణ చెప్పకపోతే, చట్టపరంగా చర్యలు తీసుకుంటాను." అని వ్యాఖ్యానించారు.

English summary
Tollywood actress Sri Reddy Reacted On Sekhar Kammula tweets. Director Shekhar Kammula reacted on Sri Reddy facebook post. He posted that Yesterday a social media post maligning me came to my notice. It is vulgar, demeaning and full of lies. It has caused deep grief to my family, to me and many more who value me. I could never imagine in my wildest dreams that a woman whom I don't know, have not seen or never spoken to in person or on the phone can suddenly make these baseless allegations.Whatever might be their intentions and whoever might be involved in this diabolic act , I would like to say that it is WRONG, IMMORAL and CRIMINAL. APOLOGIZE and take back every word that was posted against me or be ready to face legal action, which will include criminal/civil proceedings.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X