For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  30 దాటిన ఈ ముదురు హీరోయిన్స్ , పెళ్లి చేసుకుంటారా , ఎఫైర్స్ తోనే?

  By Srikanya
  |

  హైదరాబాద్: కొందరు హీరోయిన్స్ చూస్తూంటే ఎంత వయస్సు వచ్చినా అందం మాత్రం ఎక్కడా చెక్కు చెదరకుండా ఉంటూ ఎట్రాక్ట్ చేస్తూంటారు. తెరపై ఎలా ఉన్నా వ్యక్తిగత జీవితంలో వీళ్ల పెళ్లిళ్ల గురించి ఎప్పుడూ చర్చే జరుగుతూంటుంది.

  అయితే ఆర్దికంగా ఉన్నత స్దానంలో ఉండటంతో వారిని వివాహం కోసం తల్లి, తండ్రులు కూడా పట్టుపట్టరు. అలాగే భాధ్యత వదిలించుకోవటంగా భావించరు. దాంతో ముప్పైలు దాటినా నలభై దగ్గర పడుతున్నా చాలా మంది హీరోయిన్స్ బ్రహ్మచారణిలుగానే కంటిన్యూ అవుతున్నారు. అలాంటి కొందరి మన హీరోయిన్స్ ని ఇక్కడ చూద్దాం.

  మొన్నటిదాకా తెలుగు చిత్రసీమలో సమంత పెళ్ళి గురించే మాట్లాడుకొన్నారు. ఆమె వివాహం వచ్చే యేడాదిలో నాగచైతన్యతో జరగబోతోందని ఓ స్పష్టత రావడంతో ఆ చర్చకి పుల్‌స్టాప్‌ పడింది. ఇంతలో అనుష్క పెళ్ళి విషయం తెరపైకొచ్చింది. దాంతో ఇంకెవరెవరు హీరోయిన్స్ పెళ్లి వయస్సు ని దాటి ముందుకు వెళ్తున్నారనే చర్చ మొదలైంది. ఈ నేఫధ్యంలో మన హీరోయిన్స్ వివాహాలు, ప్రేమలు, ఎఫైర్స్ గురించి ఓ సారి మాట్లాడుకుందాం.

  ప్రేమలో ఉందంటున్నారు మరి

  ప్రేమలో ఉందంటున్నారు మరి

  వాస్తవానికి అనుష్క కు పెళ్లీడు ఎప్పుడో వచ్చింది. అందుకే అనుష్క పెళ్లంట అంటూ తరచుగా ప్రచారం మొదలైపోతుంటుంది. అయితే ఈసారి మాత్రం ఆ ప్రచారం నిజమయ్యే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అనుష్క చిత్రసీమకి చెందిన ఓ ప్రముఖ వ్యక్తిని వివాహమాడబోతోందని, ‘బాహుబలి - ది కన్‌క్లూజన్‌' తర్వాత ముహూర్తం కూడా కుదిరిందని చెప్పుకొంటున్నారంతా. మరి ఆ ప్రముఖ వ్యక్తి ఎవరనేది ఇప్పుడు ప్రశ్న. అనుష్క తన సన్నిహితులతో చెప్పడంతోనే ఈ విషయం బయటికొచ్చిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. చేతిలో కొన్ని సినిమాలున్నాయి కాబట్టి, మరికొంతకాలం ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచి, ఆ తర్వాత స్వయంగా వెల్లడించాలని అనుష్క నిర్ణయించుకొన్నట్టు సమాచారం.

  రెండేళ్ళు చేసాకే

  రెండేళ్ళు చేసాకే

  ఈ ఏడాది ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల సినిమాలను విడుదల చేసి, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక సినిమాలో నటిస్తున్న కాజల్ పెళ్లి విశేషాలు వెబ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తన కంటే చిన్నదైన సోదరి నిషా అగర్వాల్ వివాహం చేసుకోవడంతో, కాజల్ పరిణయం ఎప్పుడన్న ఆసక్తి అభిమాన వర్గాల్లో నెలకొని ఉంది. ఓ రెండేళ్ళ పాటు సినిమాలు చేసిన పిదప, ఇక సినిమాలకు పూర్తిగా చెక్ పెడుతూ... వ్యక్తిగత జీవితానికే పరిమితం అయిపోతానని కాజల్ చెప్పినట్లుగా టాక్.

  సాప్ట్ వేరే ఇంజినీరుతో...

  సాప్ట్ వేరే ఇంజినీరుతో...

  గత రెండేళ్లుగా..ముంబయికి చెందిన ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరితో మిల్కీబ్యూటి ప్రేమాయణం నడిపుతోందట. అతగాడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడట. ఇప్పటికే ప్రేమలో పీకల్లోతు మునిగిపోయిన ఈ జంట ప్రేమను పెళ్లిగా మార్చాలనుకుంటుందట. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను ఫినిష్ చేసుకుని..ఇక కొత్త సినిమాలను అమ్మడు ఒప్పుకోదట. పెళ్లయ్యాక సినిమాలు మానేసి తాను స్థాపించిన గోల్డ్ డిజైన్ అండ్ గోల్డ్ బిజినెస్ చూసుకుంటుందట అమ్మడు.

  త్రిష పెళ్లి ఎప్పుడంటే

  త్రిష పెళ్లి ఎప్పుడంటే

  తమిళ నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో త్రిష నిశ్చితార్థం ...ఈ ఏడాది జనవరిలో కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పెళ్లి తేదీ ప్రకటించలేదు. నిశ్చితార్థం తర్వాత వరుణ్, త్రిష విహారయాత్రకు కూడా వెళ్లారు. అయితే, ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, వాళ్లు విడిపోయారు. మళ్లీ పెళ్లి ఊసే ఎత్తటం లేదామె.

  నయనతార పెళ్లి

  నయనతార పెళ్లి

  నయనతార లవ్ మేటర్ ప్రస్తుతం చర్చనీయాశంగా మారింది. శింబు, ప్రభుదేవాలతో బ్రేకప్ అయ్యాక తమిళ దర్శకుడు విఘ్నేష్ తో నయనతార ప్రేమలో పడ్డట్టు వార్తలు వచ్చాయి.`నానుమ్ రౌడీ దాన్` అనే చిత్రం వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కగా అప్పటి నుండి నయన విఘ్నేష్ ల మధ్య ప్రేమ పుట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ పూర్తి ప్రేమలో మునిగి తేలుతున్నట్లు తెలుస్తోంది. మరి వీరి పెళ్లి ఎప్పుడనేది వీరే చెప్పాలి.

  ఏ క్షణంలో అయినా చేసుకుంటాను

  ఏ క్షణంలో అయినా చేసుకుంటాను

  నాలుగు పదుల వయసులోనూ మత్తెక్కించే అందంతో కనిపిస్తుంటుంది టబు. `ఏ క్షణంలో నైనా నేను పెళ్లి చేసుకోవచ్చు` అని చెప్పుకొచ్చింది. లేటు వయసు లో పెళ్లి గురించి చెప్పిందేంటబ్బా అని అంతా ఆసక్తికరంగా మాట్లాడుకొంటున్నారు. ``నా పెళ్లి గురించి అందరూ మాట్లాడుకొంటుంటారు. కానీ నేను మాత్రం ఎప్పడూ దాని గురించి సీరియస్ గా ఆలోచించలేదు. అలాగని నేను పెళ్లి చేసుకోనని కాదు. ఎప్పుడు ఏ క్షణంలో నైనా నా పెళ్లి జరగొచ్చు. ఇల్లు పెళ్లి పిల్లలు... ఇలా అందరిలాగే నేనూ ఆలోచిస్తున్నా`` అని చెప్పుకొచ్చింది టబు.

  పెళ్లంటే ఇష్టమే లేదు

  పెళ్లంటే ఇష్టమే లేదు

  బాలీవుడ్ హీరోయిన్ నేహా ధూపియా పెళ్లంటే భయపడుతోంది. తనకిప్పట్లో పెళ్లి చేసుకునే యోచన లేదని స్పష్టం చేసింది.ఓ సాిర మీడియా ప్రశ్నలకు నేహా స్పందిస్తూ.... 'నాకిప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేదు. ఎందుకంటే, పెళ్లి చేసుకోవడం అంటే యుద్దానికి వెళ్లడమేనని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైతే నేను ఒంటరి దానినే' అని స్పష్టంగా చెప్పింది.

  బోయ్ ఫ్రెండ్ తో విడిపోయింది మరి

  బోయ్ ఫ్రెండ్ తో విడిపోయింది మరి

  హీరోయిన్ అమీషా పటేల్, బాలీవుడ్ దర్శకుడు విక్రమ భట్ మధ్య ఆ మధ్య రంజైన ప్రేమాయనం సాగిన విషయం తెలిసిందే. కొంత కాలం పాటు ఇద్దరూ ఒకే ఇంట్లో సహజీవనం చేసారు. ఆ మధ్య వారిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ప్రబలంగా ప్రచారంలోకి వచ్చింది. ఏమైదో ఏమోగానీ ఇద్దరు విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు. కాలం కర్మం కలిసిరాక ఇద్దరూ విడిపోయారు. అమీషా 'పర్సనల్' లైఫ్‌ని అతి సన్నిహితంగా చూసిన విక్రమ్ భట్.. ఆమె కథని 'రాజ్-3' ద్వారా తెరకెక్కించనున్నాడన్న వార్తలు వినిపించాయి.

  తప్పకుండా పెళ్లి చేసుకుంటాను కానీ..

  తప్పకుండా పెళ్లి చేసుకుంటాను కానీ..

  బాలీవుడ్ బ్యూటీ సుస్మితా సేన్ 40 దాటినా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటుగా సినీరంగంలో ప్రవేశించిన నటీమణులందరూ పెళ్లి చేసుకోగా.. సుస్మితాసేన్‌ మాత్రం ఇప్పటికీ లవ్‌ ఎఫైర్స్‌తో వార్తల్లో కనిపిస్తూనే ఉంది. నేను వివాహం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాను. బహుశా వచ్చే ఏడాది ఇది జరగవచ్చు అని సుస్మితాసేన్‌ స్పష్టం చేసింది. అయితే ఎవరిని పెళ్లి చేసుకోబోతోంది అనే విషయం మాత్రం ఆమె ఇంకా వెల్లడించలేదు. వివాహ వ్యవస్థను నేను దృఢంగా విశ్వసిస్తాను. పెళ్లికి ఇది తగిన సమయమని నాకు అనిపిస్తోంది. పొడవాటి గౌను వేసుకుని రాజకుమారిలా క్రైస్తవ పద్దతిలో వివాహం చేసుకోవాలని నాకు ఉంది, మా నాన్న కోరినందున నేను భారతీయ సాంప్రదాయ వివాహం కూడా చేసుకుంటాను అని వెల్లడించింది.

  దేశానికి మొట్టమొదటి ‘మిస్‌ యూనివర్స్‌' కిరీటాన్ని అందించిన సుస్మితా సేన్‌, అంతకంటే మంచి కారణంతోనే చాలా మందికి ఆదర్శంగా నిలిచింది. పాతికేళ్ల వయసులో, టాప్‌ హీరోయిన్‌గా దూసుకెళ్తొన్న సమయంలో ఓ అనాథ చిన్నారిని దత్తత తీసుకుంది. కానీ పెళ్లి కాని అమ్మాయి, మరో చిన్నారి బాగోగులు చూసుకోవడం వీలుకాదంటూ కొందరు కోర్టులో అప్పీలు చేశారు. అయినా బొంబే హైకోర్టు దాన్ని కొట్టేసి చిన్నారి రెనీ బాధ్యతను సుస్మితకు అప్పగించింది. ఇంకొన్నేళ్ల తరవాత మరో మూడు నెలల చిన్నారిని దత్తత తీసుకొని ముద్దుగా అలీసా అని పేరు పెట్టుకుంది.

  చేసుకుంటుందా ..నమ్మకం లేదు

  చేసుకుంటుందా ..నమ్మకం లేదు

  జాతీయ ఉత్తమ నటి అవార్డుతో పాటు పద్మశ్రీ పురస్కారాన్నీ అందుకున్న శోభన అందం అభినయంతో పాటు వ్యక్తిత్వంతోనూ బోలెడంత మంది అభిమానుల్ని సంపాదించుకుంది. అప్పట్లో శోభన... ఒక పారిశ్రామిక వేత్తతో ప్రేమాయణం నడుపింది . ఆయనగారు ఉత్తర ప్రదేశ్ కు చెందిన రాహుల్ మెహ్రానట. ఆయన గారికి ఇంతకుముందే పెళ్లి అయిందిట. విడాకులు కూడా ఇచ్చాడుట. కానీ ఎందుకో ఆ ప్రేమ వ్యవహారం ముందుకు వెళ్ళలేదు. శోభన పెళ్లి చేసుకోలేదు. ఆరేళ్ల క్రితం మూడు నెలల పసికందును దత్తత తీసుకున్న శోభన ఓ భారీ వేడుకను ఏర్పాటు చేసి ఆ విషయాన్ని ప్రకటించింది. అనంత నారాయణి అని ఆ చిన్నారికి పేరు పెట్టి అన్నప్రాసన నుంచి పుట్టినరోజు వేడుకల వరకూ ప్రతిదీ ఘనంగా నిర్వహిస్తూ వస్తోంది. ‘ఇప్పుడిప్పుడే నారాయణి నాట్యం నేర్చుకుంటోంది. భవిష్యత్తులో తను నన్ను మించిపోవాలన్నదే నా కోరిక' అంటుంది శోభన. మరి ఇక చేసుకోదేమో

  అసలు ఆలోచనే లేనట్లుందే

  అసలు ఆలోచనే లేనట్లుందే

  తెలుగులో గోదావరి, సత్యమేవ జయితే చిత్రాలు చేసిన నీతూ చంద్ర అప్పట్లో సుస్మితా సేన్ మాజీ లవర్ రణదీప్ హుడా తో ప్రేమాయణం సాగించింది. అయితే ఆ ప్రేమాయణం ముందుకు సాగక ఆమె మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యిపోయింది. ఇప్పటికీ ఆమె సింగం 3 లో స్పెషల్ సాంగ్ చేస్తూ బిజిగా ఉంది కానీ పర్శనల్ లైఫ్ పై దృష్టి పెట్టలేదు.

  మనసులో ఎవరు ఉన్నారో మరి...

  మనసులో ఎవరు ఉన్నారో మరి...

  టాలీవుడ్, కోలీవుడ్‌లలో క్రేజీ బ్యూటీగా వెలిగి, బాలీవుడ్‌లో నటీమణిగా స్థిరపడిన అందాల భామ శ్రియ. ప్రస్తుతం బాలయ్య సరసన గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రంలో చేస్తున్న శ్రియ ఆ మధ్యన తాను సినీ పరిశ్రమకు చెందిన ఎవరినీ ప్రేమించడం లేదని స్పష్టం చేసింది. ఉద్యోగ రీత్యా సంబంధం ఉంది తప్ప, మరే సంబంధం లేదని తేల్చి చెప్పింది. తనకు నచ్చిన వాడు, సరిజోడు చిక్కాడంటే వెంటనే పెళ్లి చేసుకుంటానని శ్రియ తన మనసులోని మాటను తెలిపింది.

  సమంత

  సమంత

  మొన్నటిదాకా తెలుగు చిత్రసీమలో సమంత పెళ్ళి గురించే మాట్లాడుకొన్నారు. ఆమె వివాహం వచ్చే యేడాదిలో నాగచైతన్యతో జరగబోతోందని ఓ స్పష్టత రావడంతో ఆ చర్చకి పుల్‌స్టాప్‌ పడింది. ఇంతలో అనుష్క పెళ్ళి విషయం తెరపైకొచ్చింది. దాంతో ఇంకెవరెవరు హీరోయిన్స్ పెళ్లి వయస్సు ని దాటి ముందుకు వెళ్తున్నారనే చర్చ మొదలైంది. ఈ నేఫధ్యంలో మన హీరోయిన్స్ వివాహాలు, ప్రేమలు, ఎఫైర్స్ గురించి ఓ సారి మాట్లాడుకుందాం.

  ప్రియాంక పెళ్లి ఎప్పుడో

  ప్రియాంక పెళ్లి ఎప్పుడో

  బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా 34 ఈ జూలైతో వెళ్లిపోయీనా ఎక్కడా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు కనపడదు. ఆమె ఇంటర్నేషనల్ గానూ తన కెరీర్ ని బిల్డప్ చేసుకోవాలనే ఆలచనలోనే బిజిగా ఉండిపోయింది. తను ఖచ్చితంగా వివాహం చేసుకుంటానని, అయితే తనకు తగ్గ వరుడు దొరికినప్పుడు అది క్షణాల మీద జరిగే వ్యవహారమే నని చెప్తోంది.

  English summary
  There are lots of actresses out there, who are 30-plus, single and seemingly loving it. Click through to see the sizzling singles of Bollywood and South cinema.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X