For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  2012 తెలుగు హీరోయిన్స్ హిట్స్,ప్లాప్స్(ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్ : తెలుగు చిత్రసీమలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా... కొందరి స్థానం మాత్రం పదిలంగానే ఉంటుంది. అడపాదడపా ఫ్లాప్ లు పలుకరించినా... ప్రేక్షకులు మాత్రం వెంటనే తమ మదిలో నుంచి వారిని చెరిపేయలేరు. దర్శకనిర్మాతలు కూడా తమ తరవాతి చిత్రాల్లో వాళ్లనే ఎంపిక చేసుకోవడానికి ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. అలాంటి జాబితాలో స్థానం దక్కించుకొన్న కొందరు హీరోయిన్స్ ఈ ఏడాది ఎలాంటి అనుభూతుల్ని మిగిల్చిందో చూస్తే...

  సినీ పరిశ్రమలో హిట్సే మాట్లాడతాయంటారు. అయితే కొందరు హీరోయిన్స్ విషయంలో ఆ సూత్రం వర్తించదనే చెప్పొచ్చు. తమన్నా, కాజల్, సమంత, ఇలియనా, నయనతార, త్రిష ... వీరికి ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్ర తాంబూలం దక్కుతోంది. ఈ ఏడాది త్రిష., నయనతార,శ్రియ లకు మాత్రం విజయాలు రాలేదు.

  తాప్సీ, రిచా వంటి కొందరు హీరోయిన్స్ బిజీగా ఉన్నా వారి చిత్రాలు పెద్దగా విడుదల కాలేదు. 2013 లో అయినా వారికి మంచి భవిష్యత్ ఉంటుందని ఆశిస్తూ...ఒక్కసారి...2012 లో వారి జయ,పరాజయాలు పరికిస్తే...

  రచ్చ హిట్ తో తమన్నా 2012 మొదలెట్టింది. ఈ సంవత్సరం ఆమె నటించిన నాలుగు సినిమాలు విడుదల అయ్యాయి. రచ్చ మినహా మిగతా మూడు చిత్రాల్లో ....ఎందుకంటే ప్రేమంట, రెబెల్ ప్లాప్ కాగా, కెమెరామెన్ గంగతో యావరేజ్ అనిపించుకుంది. ఇప్పుడు ఆమె చేతిలో నాగచైనత్య సినిమా భలే తమ్ముడు ఉంది.

  కాజల్ ...బిజినెస్ మ్యాన్ హిట్ తో హీట్ ఎక్కించింది. రవితేజ సారొచ్చారుతో చతికిలపడింది. అయితే మధ్యలో ఆమె డబ్బింగ్ చిత్రాలు సూర్యతో చేసిన బ్రదర్స్ డిజాస్టర్ కాగా, విజయ్ తో చేసిన తుపాకి ఓకే అనిపించుకుంది. ప్రస్తుతం ఆమె చేసిన నాయక్ ..2013 సంక్రాంతికి రెడీ అవుతోంది. అలాగే ఎన్టీఆర్ తో బాద్షా చిత్రం కూడా ఆమె చేతిలో ఉంది.

  సమంత నటించిన ఈగ,ఎటో వెళ్లిపోయింది మనస్సు చిత్రాలు విడుదల కాగా అందులో ఈగ హిట్ అనిపించుకుంటే..ఎటో వెళ్లిపోయింది మనస్సు ప్లాప్ అయ్యింది. ఆమె నటించిన ఆటోనగర్ సూర్య విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె త్రివిక్రమ్,పవన్ కాంబినేషన్ లో రూపొందే పేరు పెట్టని చిత్రం కమిటైంది.

  గోవా బ్యూటీ ఇలియానా విషయానికి వస్తే...ఆమె నటించిన జులాయి చిత్రం హిట్ అయ్యింది. అలాగే దేముడు చేసిన మనుష్యులు, డబ్బింగ్ చిత్రం స్నేహితుడు భాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఆమె హిందీలో నటించిన బర్ఫీ చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. తెలుగులో ఏ చిత్రమూ ఆమె ప్రస్తుతం ఒప్పుకోలేదు. హిందీలో మరో చిత్రం అండర్ ప్రొడక్షన్ లో ఉంది.

  ప్లాప్ ల్లో ఉన్న శృతిహాసన్ కి కెరీర్ లో బ్రేక్ ఇచ్చిన చిత్రం గబ్బర్ సింగ్ ...2012 లోనే వచ్చింది. తర్వాత ఆమె నటించిన ‘3'అనే డబ్బింగ్ చిత్రం విడుదలై డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం రవితేజ సరసన బలుపు, రామ్ చరణ్ సరసన ఎవడు చిత్రాలు చేస్తోంది. మరో రెండు హిందీ చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి.

  ఢమురకం చిత్రం ఒకటే ఈ సంవత్సరం అనూష్క నటించింది విడుదల అయ్యింది. ఈ చిత్రం యావరేజ్ గా నమోదైంది. ఆనందతాండవం,శకుని చిత్రాలు డబ్బింగ్ అయ్యి ప్లాప్ అయ్యాయి. ప్రభాస్ తో ఆమె చేస్తున్న మిర్చి 2013 పిబ్రవరిలో విడుదల అవుతుంది. గుణశేఖర్ దర్శకత్వంలో రుద్రమదేవి అనే హిస్టారికల్ చిత్రం కమిటైంది.

  నయనతార నటించిన కృష్ణం వందే జగద్గురం, శ్రీరామ రాజ్యం చిత్రాలు రెండూ ఈ సంవత్సరం విడుదల అయ్యి ప్లాప్ అయ్యాయి. ప్రస్తుతం ఆమె నాగార్జున సరసన చేస్తున్న చిత్రం 2013 సమ్మర్ కి విడుదల అవుతుంది. ఆమె తమిళంలో నాలుగు చిత్రాలు చేస్తోంది.

  చెన్నై చిన్నది త్రిష ..చేసిన బాడీగార్డ్ ..2012 సంక్రాంతికి విడుదలై ప్లాప్ అయ్యింది. తర్వాత ఎన్టీఆర్ ప్రక్కన దమ్ము చిత్రం చేస్తే..అదీ వర్కువుట్ కాలేదు. ప్రస్తుతం ఎమ్.ఎస్ రాజు దర్శకత్వంలో రమ్ అమే చిత్రం మాత్రమే కమిటైంది.

  సెక్సీ బేబి శ్రియ ఈ సంవత్సరం శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, నువ్వా నేనా చిత్రాలు లలో చేసింది. రెండు చిత్రాలలో ఏదీ హిట్ కాలేదు. ప్రస్తుతం తమిళ,కన్నడ,హిందీ భాషల్లో తలో చిత్రం చేస్తోంది.

  ఈ సంవత్సరం వివాహం చేసుకున్న జెనీలియా ...చేసిన నా ఇష్టం చిత్రం డిజాస్టర్ అయ్యింది. హిందీలోనూ ఆమె చేసిన సినిమా ప్లాప్. ప్రస్తుతం తెలుగులో ఏ సినిమాలు లేవు కానీ, హిందీలో రెండు సినిమాలు మాత్రం ఆమె చేతిలో ఉన్నాయి.

  హాట్ బేబి తాప్సీ ఈ సంవత్సరంలో ఫుల్ బిజీగాఉంది కానీ దరువు మాత్రమే రిలీజై,ప్లాప్ అయ్యింది. ఆమె చేసిన గుండెల్లో గోదారి,షాడో,జాక్ పాట్ చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి. ముని 3 కొత్తగా కమిటైంది.

  హన్సిక నటించిన..దేనికైనా రెడి చిత్రం ఈ సంవత్సరం విడుదలై హిట్ అయ్యింది. తమిళ డబ్బింగ్ చిత్రం ఓకే ఓకే ప్లాప్ అయ్యింది. తాజాగా మంచు మనోజ్ సరసన ఓ చిత్రం ఆమె కమిటైంది.

  ఇష్క్ తో నిత్యామీనన్ ఈ సంవత్సరం హిట్ కొట్టింది. ఆ తర్వాత ఆమె చేసిన చిత్రాలు ఏదీ విడుదల కాలేదు. ప్రస్తుతం నితిన్ తో గుండె గల్లంతయ్యిందే, సిద్దార్ధతో జబర్దస్త్, శర్వానంద్ తో ఏమిటో ఈ మాయ చేస్తోంది. అవన్నీ వచ్చే సంవత్సరమే విడుదల అవుతాయి.

  దీక్షాసేధ్..ఈ సంవత్సరం...రెబెల్, నిప్పు, ఊ కొడతారా ఉలిక్కిపడతారా చిత్రాలు చేసింది. కానీ ఏదీ హిట్ కాలేదు. దాంతో ఆమె 2012 చేదు సంవత్సరంగా మిగిలింది.

  పార్వతీ మిల్టన్ చేసిన శ్రీమన్నారాయణ, యమహో యమ చిత్రాలు రెండూ భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. ఈ సంవత్సరం ఆమె పెళ్లి కుదిరింది. వచ్చే సంవత్సరంలో ఆమె పెళ్లి.

  రిచాగంగోపాధ్యాయ ఈ సంవత్సరం ..రవితేజ సరసన సారొచ్చారు చిత్రం మాత్రమే చేసింది. ఆమె చేసిన మిర్చి విడుదలకు సిద్దంగా ఉంది. నాగార్జున సరసన ఆమె భాయ్ లో ఎంపికైంది.

  English summary
  
 
 It seems that 2012 is A Good Year for Hot Beauties 'Tamanna,Kajal and Samantha'. Nayantara and Trisha are unlucky beauties. Wish them 2013...will be a Successful year. 
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X