»   »  వరుణ్ తేజ తో మొదలెట్టి ఎన్టీఆర్ తో క్లోజ్

వరుణ్ తేజ తో మొదలెట్టి ఎన్టీఆర్ తో క్లోజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈ డిసెంబర్ నెలంతా వరుసగా ఆడియో పంక్షన్ లు కనపడుతున్నాయి. ముఖ్యంగా క్రిస్మస్, సంక్రాంతి సీజన్స్‌లో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమాల ఆడియో వేడుకులు ఇప్పటివరకు జరగలేదు. ఆ సినిమాల పాటల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న శ్రోతలకి ఈ నెల మొత్తం వరస పెట్టి వేడుకలు జరుగుతూనే ఉన్నాయని చెప్పాలి.

ఈ వేడకలకు ప్రారంభం చేసింది... పూరీ జగన్నాథ్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న లోఫర్. ఈ ఆడియో ఫంక్షన్‌తో ఈ నెల మొదలుఅవుతోంది. డిసెంబర్ 7న ప్రభాస్ చేతుల మీదుగా లోఫర్ పాటలు విడుదల అయ్యీయి. ఈ మూవీకి సునీల్ కశ్యప్ మ్యూజిక్ ఇచ్చాడు.

ఇక అక్కడ నుంచి దాదాపు నెలలో ప్రతీ వారాంతం ఏదో ఒక పెద్ద సినిమా ఆడియో పంక్షన్ తో హడావిడి ఉంది. ఛానెల్స్ కూడా ఈ ఆడియో పంక్షన్స్ తో టీఆర్పిలు బాగుంటాయని భావిస్తున్నాయి. మొత్తానికి డిసెంబర్ మొత్తం ఈ మ్యూజిక్ హంగామాతో మోతమోగబోతుంది.

మిగతా ఆడియో పంక్షన్స్ ఏవి..స్లైడ్ షోలో

లోఫర్

లోఫర్


వరుణ్ తేజ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రెడీ అయిన లోఫర్ చిత్రం ఆడియో నిన్న రాత్రి విడుదలైంది.

నేను శైలజ

నేను శైలజ

లోఫర్ ..ఫంక్షన్ కంప్లీటైన అయిదు రోజులకి అంటే డిసెంబర్ 12న రామ్, కీర్తి సురేష్ జంటగా నటించిన 'నేను శైలజ' మూవీ మ్యూజిక్ రిలీజ్ ఫంక్షన్ జరగబోతోంది.

సౌఖ్యం

సౌఖ్యం


ఇది పూర్తి అయిన మరుసటి రోజే డిసెంబర్ 13న గోపీచంద్, రెజీనా జంటగా తెరకెక్కిన సౌఖ్యం ఆడియో విడుదల కార్యక్రమం ఉంది. ఈ వేడుక ఒంగోలులో జరగనుంది.

డిక్టేటర్

డిక్టేటర్

సౌఖ్యం పాటల వేడుక ముగిసిన వెంటనే డిసెంబర్ 20న, ఏపీ కేపిటల్ అమరావతిలో బాలయ్య 99వ చిత్రం "డిక్టేటర్" పాటలను రిలీజ్ చేయనున్నారు.

నాన్నకు ప్రేమతో

నాన్నకు ప్రేమతో

చివర్లో జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నాడు. డిసెంబర్ 23న లేక 25న కానీ సుకుమార్ డైరెక్షన్‌లో జూనియర్ చేస్తున్న 'నాన్నకు ప్రేమతో' ఆడియో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నారు.

English summary
This December is going to be the month of some high profile audio launches.
Please Wait while comments are loading...