»   » నేనూ నాభార్యా... ఒకళ్ళని ఒకళ్ళు చంపేసుకునే వాళ్ళం

నేనూ నాభార్యా... ఒకళ్ళని ఒకళ్ళు చంపేసుకునే వాళ్ళం

Posted By:
Subscribe to Filmibeat Telugu

పంజా, ధమ్ము లాంటి సినిమాల్లో కూడా చేసినా మిర్చీ సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు సంపత్ రాజ్, ఇక కృష్ణగాడి వీర ప్రేమ గాథ తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన ఈ సూపర్ విలన్ పవర్‌ఫుల్‌ విన్‌ పాత్రలను పోషించి ఆ పాత్రలకు పక్కా న్యాయం చేసేలా కష్టపడుతూ ఉంటాడు.

విడాకుల గురించి:

విడాకుల గురించి:

తాజాగా సంపత్‌ రాజ్‌ మీడియాతో మాట్లాడుతూ తన విడాకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేటి కాలంలో విడాకులు చాలా కామన్‌ అయిన వేళ సంపత్‌ రాజ్‌ వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురి చేసాయ్. పెళ్ళి జరిగినప్పుడు 23వ వయస్సులోనే 19ఏళ్ల అమ్మాయితో పెళ్ళి జరిగిందట

నాకు 23 ఏళ్లు. తనకేమో 19 ఏళ్లు:

నాకు 23 ఏళ్లు. తనకేమో 19 ఏళ్లు:

‘‘మాది పెద్దలు కుదిర్చిన వివాహమే. అప్పుడు నాకు 23 ఏళ్లు. తనకేమో 19 ఏళ్లు. ఆ వయసులో పెళ్లి చేసుకుంటే.. 27-28 ఏళ్లు వచ్చే సరికి ఇద్దరి దారులు వేరు అనే విషయం అర్థమవుతుంది. అదే నా విషయంలోనూ జరిగింది. 31 ఏళ్ల వయసులో నేను నా భార్యతో విడాకులు తీసుకున్నాను.

విడిపోయి హ్యాపీగా బతుకుదామని:

విడిపోయి హ్యాపీగా బతుకుదామని:

మా ఇద్దరి దారులు వేరు అని తెలిశాక.. తనతో విడాకుల గురించి మాట్లాడాను. విడిపోయి హ్యాపీగా బతుకుదామని చెప్పాను. ఒకవేళ కలిసుంటే.. నేను నిన్ను చంపడమో.. నువ్వు నన్ను చంపడమో జరుగుతుందని చెప్పాను. మాకు విడాకులయ్యే నాటికి మాకు ఆరేళ్ల పాప ఉంది. ఆ పాప బాగోగులు నేనే చూసుకుంటున్నాను.

చాలామంది భర్తల లాగే:

చాలామంది భర్తల లాగే:

నా భార్య తన కెరీర్‌లో నిలబడాలి కాబట్టి.. నా కూతురు బాధ్యతలను నేనే తీసుకున్నాను. తను ప్రస్తుతం బెంగళూరులో పన్నెండో తరగతి చదువుతోంది. వాళ్ల అమ్మను ఎప్పుడూ కలుస్తూ ఉంటుంది'' అని సంపత్ వివరించాడు.కలిసి ఉంటే సుఖం లేనప్పుడు విడిపోయి హాయిగా ఉండొచ్చు అని చాలామంది భర్తల లాగే తానూ నిరూపిస్తున్నాడు సంపత్ రాజ్.

English summary
Tollywood Bad boy Sampath Raj Talking about his luck in the film industry, Sampath said, “I’m supposed t be divorced for coming into films and I thank my ex-wife for the divorce.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu