»   » ఆయనపై... ప్రేమ ఒలకబోసిన చిరు, చరణ్, మంచు లక్ష్మి

ఆయనపై... ప్రేమ ఒలకబోసిన చిరు, చరణ్, మంచు లక్ష్మి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మద్యం సేవించి కారు నడిపి ఒకరి మరణానికి, నలుగురు గాయపడటానికి కారణమైన హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. అయితే సల్మాన్ ఖాన్ కు సినీ పరిశ్రమలో గుడ్ నేమ్ ఉండటం, మంచోడు అనే ట్యాగ్ ఉండటం, పలు సేవా కార్యక్రమాల్లో భాగస్వామి కావడంతో నేరం చేసినప్పటికీ ఆయనపై సానుభూతి వెల్లువెత్తుతోంది.

జైలు శిక్ష పడిన వెంటనే సల్మాన్ కు రెండు రోజుల బెయిల్ దొరకడంతో ఇంటికి చేరుకున్న సల్మాన్ ను పరామర్శించేందుకు బాలీవుడ్ సెలబ్రిటీలంతా ఆయన ఇంటికి క్యూ కట్టారు. సల్మాన్ కు ఎంత కష్టం వచ్చిందంటూ....కన్నీటి పర్యంతం అవుతున్నారు. సల్మాన్ ఖాన్ కు మద్దతు ఇస్తున్న వారు కేవలం బాలీవుడ్లో మాత్రమే కాదు...టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనూ ఉన్నారు.

మెగా స్టార్ చిరంజీవితో పాటు, ఆయన తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మంచు లక్ష్మి, హన్సిక, రకుల్ ప్రీత్ సింగ్ సల్మాన్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేసారు. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన వివరాలు..

రామ్ చరణ్

రామ్ చరణ్


రామ్ చరణ్ సల్మాన్ ఖాన్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేయడంతో పాటు...ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదంటూ కామెంట్ చేసారు.

చిరంజీవి

చిరంజీవి

సల్మాన్ ఖాన్ కు శిక్ష పడటంపై చిరంజీవి కూడా చాలా బాధ పడిపోయారు. ఆయన కావాలని చేయలేదు, యాక్సిడెంట్ మాత్రమే అని అతన్ని వెనకేసుకొచ్చారు.

హన్సిక

హన్సిక

సల్మాన్ ఖాన్ కోసం మన్సిక ప్రార్థనలు చేసింది. సల్మాన్ కు మంచి జరుగాలని కోరుకుంది. శిక్ష పడిన వెంటనే కంటతడి పెట్టింది.

శ్రీయ

శ్రీయ

ఇండియా నన్ను ప్రేమిస్తుంది. నీకు అంతా మంచి జరుగుతుంది అంటూ సల్మాన్ ఖాన్ కు మద్దతుగా కామెంట్ చేసింది శ్రీయ.

మంచు లక్ష్మి

మంచు లక్ష్మి

సల్మాన్ ఖాన్ దోషిగా తేలి జైలు శిక్ష పడిన వెంటనే మంచు లక్ష్మి షాక్ కు గురైంది.

రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్ కూడా సల్మాన్ ఖాన్ కు మద్దతుగా, ఆయన ఫ్యామిలీకి ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థన చేసింది.

English summary
It is known that Salman Khan was found guilty in the 13 years-old, hit and run case. The actor was sentenced to five years in jail for a hit-and-run accident that left one man dead and four others injured. Though he is a Bollywood star, he always maintained good relations with the celebrities down South. Especially the actor was said to be a very close associate of Mega Family and Daggubati clan.
Please Wait while comments are loading...