»   »  వాడుకుంటే ఆడుకుంటాడు: ఇతర హీరోల టెంపర్ కామెంట్స్

వాడుకుంటే ఆడుకుంటాడు: ఇతర హీరోల టెంపర్ కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘టెంపర్' మూవీ విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఎవరిని అడిగినా సినిమా సూపర్ అంటూ పొగడ్తలు గుప్పిస్తున్నారు. సాధారణ ప్రేక్షకులతో పాటు పలువురు సినీతారలు కూడా సినిమాపై తమ అభిప్రాయాలు వెల్లడించారు.

చాలా కాలంగా ఎన్టీఆర్ కెరీర్లో సరైన హిట్టు లేకుండా పోయింది. మధ్యలో ఒకటి రెండు సినిమాలు ఫర్వాలేదనిపించినా అభిమానులకు పూర్తి స్థాయిలో సంతృప్తి ఇవ్వలేక పోయాయి. అయితే ‘టెంపర్' ఎన్టీఆర్ అభిమానుల ఆకలి తీర్చింది. పూర్తి స్థాయిలో సంతృప్తి నిచ్చింది. రెస్పాన్స్ బావుండటంతో నిర్మాతకు కూడా భారీగా లాభాలు తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు.

స్లైడ్ షోలో ‘టెంపర్' మూవీపై ఇతర సినీ స్టార్ల అభిప్రాయాలు....

రాజమౌళి

రాజమౌళి

ఎన్టీఆర్ న‌ట‌న హై రేంజ్‌లో ఉంద‌ని, ముఖ్యంగా కోర్టు సీన్‌, పోలీస్ స్టేష‌న్ సీన్ చాలా కాలం గుర్తుండి పోతుంద‌ని, డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న ట్రేడ్ మార్క్ హీరో క్యారెక్ట‌రైజేష‌న డైలాగ్స్‌తోనే కాకుండా స్ట్రాంగ్ స్క్రిప్ట్‌, బ్యూటిఫుల్ క్ల‌యిమాక్స్ ఇచ్చాడ‌ని రాజమౌళి చెప్పుకొచ్చారు. టెంపర్ టీంకు కంగ్రాట్స్ చెప్పారు.

సమంత

సమంత


టెంపర్ సినిమా చాలా బావుంది. ఎన్టీఆర్ కెరీర్లోనే బెస్ట్ సినిమా అంటూ సమంత పొగడ్తలు గుప్పించింది.

రామ్

రామ్


తారక్ ని కరెక్ట్ గా వాడుకుంటే బాక్సాఫీసుతో ఆడుకుంటాడు. కంగ్రాట్స్ అంటూ యంగ్ హీరో రామ్ ట్వీట్ చేసారు.

నిఖిల్

నిఖిల్


ఊహించినట్లే తారక్ అన్నాయ్య, పూరి జగన్నాథ్ ఇరగదీసారు అంటూ నిఖిల్ ట్వీట్ చేసారు.

పరుచూరి గోపాల కృష్ణ

పరుచూరి గోపాల కృష్ణ

టెంపర్ సినిమా హిట్ కావడంతో ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ తారక్ కి కంగ్రాట్స్ చెప్పారు.

మంచు మనోజ్

మంచు మనోజ్


టెంపర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టయినందుకు నా బ్రదర్ తారక్ కి కంగ్రాట్స్ అంటూ మనోజ్ చెప్పుకొచ్చారు.

వరుణ్ సందేశ్

వరుణ్ సందేశ్


యంగ్ టైగర్ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్. అందుకే ఎన్టీఆర్ అంటే అందరూ ఇస్టపడతారు. సినిమా నాకు బాగా నచ్చింది. కంగ్రాట్స్ అంటూ వరుణ్ సందేశ్ ట్వీట్ చేసారు.

నాగ శౌర్య

నాగ శౌర్య


యంగ్ హీరో నాగ శౌర్య స్పందిస్తూ...టెంపర్ అదిరిందని వ్యాఖ్యానించారు.

కోన వెంకట్

కోన వెంకట్


సింగిల్ వర్డ్ లో చెబుతున్నాను....టెంపర్ బ్లాక్ బస్టర్ అంటూ కోన వెంకట్ ట్వీట్ చేసారు.

గోపీ మోహన్

గోపీ మోహన్


టెంపర్ మీదున్న అభిమానులను పూర్తిగా సంతృప్తి పరిచారు పూరిగారు. ఎన్టీఆర్ నట విశ్వరూపం టెంపర్. మాస్ కి కనెక్ట్ అయ్యే సినిమా ఇది అంటూ గోపీ మోహన్ ట్వీట్ చేసారు.

రామ్ గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మ


ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ అదరగొట్టాడు. పూరి జగన్నాథ్ కెరీర్లో ‘టెంపర్' బెస్ట్ సినిమా అని, డైలాగ్స్, టేకింగ్ విషయంలో అదరగొట్టాడని, చిరంజీవి 150వ సినిమాకు పూరి జగన్నాథే బెటరంటూ ట్వీట్ చేసారు. మెగా అభిమానులు నా మాటలు నమ్మకుంటే ‘టెంపర్' సినిమా చూడాలని చూసించారు. చిరంజీవి 150వ సినిమాకు పూరి తోడైతే అది మెగా ఫిల్మ్ అవుతుందని జోష్యం చెప్పారు.

English summary
Young Tiger NTR and Puri Jagannadh's 'Temper' was released today and the film has been receiving positive response all over. The film opened to packed houses and NTR fans are delighted with the super hit talk for the movie. Some celebrities who have watched the film praised NTR and Puri Jagannadh for their effort.
Please Wait while comments are loading...