»   » హీరో కూతురు పెళ్లి :తెలుగు సినీ ప్రముఖలంతా అక్కడే (ఫొటోలు)

హీరో కూతురు పెళ్లి :తెలుగు సినీ ప్రముఖలంతా అక్కడే (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు : కన్నడ కంఠీరవ డా|| రాజ్‌కుమార్‌ మనవరాలు, నటుడు శివరాజ్‌కుమార్‌ కుమార్తె డాక్టర్‌ నిరుపమ వివాహానికి దక్షిణ భారత చిత్ర పరిశ్రమ తరలివచ్చింది. రాజకీయ నేతలు, ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. హ్యాట్రిక్‌ హీరో శివరాజ్‌కుమార్‌ (కన్నడ కంఠీరవుడు డాక్టర్‌ రాజ్‌కుమార్‌ పెద్ద కొడుకు) కుమార్తె డాక్టర్‌ నిరుపమ- డాక్టర్‌ దిలీప్‌ల వివాహం సోమవారం బెంగళూరులోని ప్యాలెస్‌ మైదానంలో ఘనంగా నిర్వహించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఐదు వేలమంది వీక్షించేందుకు అనువుగా ఏర్పాట్లు చేశారు. వేలాది మంది అభిమానులు హాజరైనారు. రాజ్‌కుమార్‌ సొంతగ్రామం గాజనూరు నుంచి రెండు బస్సుల్లో గ్రామస్థులు ఆదివారమే వివాహ వేదికకు చేరుకున్నారు. విఖ్యాత ఆధ్యాత్మికవేత్త- ఉడుపి పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ, తెలుగు చిత్ర ప్రముఖులు హరికృష్ణ, నాగార్జున, శ్రీకాంత్‌, తమిళనటుడు ప్రభు, కేంద్ర మంత్రులు సదానందగౌడ, అనంతకుమార్‌, కర్ణాటక మంత్రులు ఆర్‌.వి.దేశ్‌పాండే, డి.కె.శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. కన్నడ చిత్ర పరిశ్రమ మొత్తం తరలివచ్చింది.

అతిథులను శివరాజ్‌కుమార్‌ స్వయంగా ఆహ్వానించారు. భోజనాల వద్ద తొక్కిసలాటకు అవకాశం లేకుండా ప్రముఖులకు, అభిమానులకు వేర్వేరుగా ఏర్పాట్లు చేశారు. పదుల రకాల భక్ష్యాల్ని వండివార్చారు. వేడుక అనంతరం సంప్రదాయం ప్రకారం నిరుపమను వరుడి నివాసానికి తోడ్కొని వెళ్లారు. సాయంత్రం రిసెప్షన్‌ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల్ని నిర్వహించారు.

స్లైడ్ షోలో తెలుగు నుంచి వెళ్లిన వారిని చూద్దాం

రామ్ చరణ్

రామ్ చరణ్

తెలుగు హీరో రామ్ చరణ్ ఈ జంటను ఆశ్వీరదించటానికి రిసెప్షన్ కు వెళ్లారు

నాగార్జున

నాగార్జున

ఈ వివాహ వేడుకలో నాగార్జున ఇలా...

రాజమౌళి

రాజమౌళి

రిసెప్షన్ కి రాజమౌళి హాజరయ్యారు

శ్రీకాంత్

శ్రీకాంత్

మరో తెలుగు హీరో శ్రీకాంత్ ఈ వేడుకలో...

హరికృష్ణ

హరికృష్ణ

నందమూరి కుటుంబం నుంచి హరికృష్ణ వచ్చారు

English summary
Kannada actor Shiva Raj Kumar's daughter, Nirupama's Wedding and a grand reception that followed took place in Bangalore yesterday. Tollywood celebs, who has good relations with the Rajkumar family flew down to the city, to attend the wedding and bless the couple.
Please Wait while comments are loading...