For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సింగపూర్ లో మన హీరో,హీరోయిన్స్ రచ్చ రచ్చ ( ఫొటోలు )

  By Srikanya
  |

  హైదరాబాద్‌: మరికొద్ది గంటల్లో జరగబోయే సైమా 2016 కోసం సింగపూర్ ముస్తాబైంది. ఆ ముస్తాబులో ముత్యాల్లో మెరిసిపోతోంది మన తెలుగు నటీనటులు. సింగపూర్ హోటల్స్ లో మన టాలీవుడ్ సెలబ్రెటీలు ఆల్రెడీ చేస్ చేసేసారు. రెండు రోజులు పాటు జరిగే ఈ ఈవెంట్ ని అద్బుతంగా ప్లాన్ చేసారు. వారి ఫొటోలను మీరు ఇక్కడ చూడవచ్చు.

  ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించే సైమా అవార్డుల వేడుక ఈసారి సింగపూర్‌లో జరగటం అందిరిలో ఉత్సాహం నింపుతోంది. ఈ కార్యక్రమాన్ని జూన్‌ 30, జులై 1న దక్షిణాది సినిమా ప్రముఖుల సమక్షంలో భారీగా నిర్వహించనున్నారు.

  ప్రతి ఏటా జరుగుతున్న దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు చెందిన దక్షిణాది భాషలకు చెందిన ఉత్తమ కళాకారులకు అందించే సైమా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగనుంది. సినిమా రంగానికి చెందిన 19 విభాగాల్లోని కళాకారులకు ఈ అవార్డులను అందించనున్నారు.

  2015లో విడుదలైన చిత్రాలను పరిగణలోకి తీసుకుని ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి అవార్డులను అందజేయనున్నారు. గురువారం, శుక్రవారం జరిగే ఈ కార్యక్రమానికి పలువురు సినీ తారలు ఎంతో ఉత్సాహంగా ప్రయాణమయ్యారు.

  దక్షిణ చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు ఖుష్బు, దేవిశ్రీ ప్రసాద్‌, శ్రుతిహాసన్‌, ప్రగ్యా జైశ్వాల్‌, సాయేషా సైగల్‌, హన్సిక, వేదిక, అనిరుధ్‌, ప్రణీత, అలీ తదితరులు సింగపూర్‌కు చేరుకున్నారు.

  ఈ విషయాన్ని సైమా తమ ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలుపుతూ.. ఫొటోలను పంచుకుంది. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో తారల స్టేజీ ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. గత నాలుగేళ్లుగా ఈ సైమా అవార్డుల వేడుకను నిర్వహిస్తున్నారు.

  సింగపూర్‍లోని సుంటెక్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న ఈ వేడుకలో పర్ఫామ్ చేసేందుకు స్టార్స్ అంతా ఇప్పటికే సిద్ధమయ్యారు. మంచు లక్ష్మి ఈ వేడుకకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

  వీరంతా

  వీరంతా

  తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన నటీనటులు ఈ వేడుకలో పాల్గొంటున్నారు.

  నిత్యామీనన్

  నిత్యామీనన్

  తెలుగు,తమిళ, మళయాళ ప్రేక్షకులకు సుపరిచితమై నిత్యామీన్ ఇక్కడ ఇలా..

  ఇద్దరూ ఇద్దరూ

  ఇద్దరూ ఇద్దరూ

  ఇద్దరు బాడీ బిల్డర్స్ ప్రక్క ప్రక్కనే నిలబడ్డారు.వారే సుధీర్ బాబు, దగ్గుపాటి రానా

  అన్నదమ్ములు

  అన్నదమ్ములు

  అల్లు అన్నదమ్ములు అల్లు శిరీష్, అల్లు అర్జున్ ఇద్దరూ ఇలా కనిపించారు.

  అఖిల్

  అఖిల్

  గత రెండు రోజులుగా వార్తల్లో నిలుస్తున్న అఖిల్, ప్రక్కనున్న హీరో ఎవరంటారా..ఇంకెవరూ మన వరుణ్ తేజ

  కుమార్తెతో

  కుమార్తెతో

  కుమార్తె నిర్వాణతో లక్ష్మి మంచు ..ఈమే ఈ పోగ్రామ్ ని హోస్ట్ చేస్తోంది.

  నయనతార

  నయనతార

  నయనతార లేని ఈ పంక్షన్ ని ఊహించలేమేమో కదూ

  జానికి గారి తో

  జానికి గారి తో

  ఈ ఫొటోలో జానకి గారితో పాటు ఉన్నవాళ్లంతా మనకు తెలుసున్నవాళ్లేగా

  గ్లామర్ క్వీన్

  గ్లామర్ క్వీన్

  ఇప్పటికే ఈమె ఎవరో మీకు అర్దమైపోయిందికదా...హన్సిక లాంటి గ్లామర్ గాల్ లేనిదే ఎలా

  ఫన్ అండీ ఫన్

  ఫన్ అండీ ఫన్

  అలీ ఎక్కడుంటే అక్కడ కామెడీ ప్రవహిస్తుంది. అందుకే అలీ వచ్చేసాడు

  ఎవరంటే

  ఎవరంటే

  కాస్త పట్టిపట్టిచూడండి..ఈ అందం ఎవరో గుర్తు పట్టేస్తారు మీరు.లేదా..ఆమె ప్రణీతండీ బాబు

  సోనాలి చౌహాన్

  సోనాలి చౌహాన్

  లెజండ్ లో బాలయ్య ప్రక్కన చేసిన సోనాలి చౌహాన్

  లక్ష్మీ రాయ్

  లక్ష్మీ రాయ్

  అదేనండీ రాయ్ లక్ష్మిగా పేరు మార్చుకున్న మన లక్ష్మీ రాయ్

  బన్ని

  బన్ని

  అల్లు అర్జున్ ఈసారి సోలాగా కనపడ్డాడు..కొద్దిగా గడ్డం పెంచాడు

  ఖుష్బు

  ఖుష్బు

  ఒకప్పటి తమిళ సూపర్ స్టార్ హీరోయిన్ . ఇప్పుడు పొలిటీషన్ కూడా

  వేదక

  వేదక

  తెలుగులోనూ ఒకరెండు సినిమాలు చేసిన వేదిక తన తల్లి తో కలిసి

  మంచులక్ష్మి

  మంచులక్ష్మి

  లక్ష్మీ మంచు లేకపోతే ఆ అల్లరే మిస్సవుతాం అంటారు అంతా.అందుకే ఎక్కడైనా ఆమే.

  ఫెరఫార్మెన్స్

  ఫెరఫార్మెన్స్

  సైమా ...స్టేజీపై ఫెరఫార్మెన్స్ చేయబోయేది వీరంతా

  అక్కడే

  అక్కడే

  ఈ చిత్రం తెలుగు టీజర్ , టైటిల్ ని సైమా లోనే ప్రకటించనున్నారు.

  హ్యూమా ఖురేష్

  హ్యూమా ఖురేష్

  బాలీవుడ్ లో ఎదుగుతున్న స్టార్ హీరోయిన్ హ్యూమ ఖురేషీ ఇలా

  English summary
  2015 సంవత్సరానికి సంబంధించిన సైమా అవార్డు వేడుకలు సింగపూర్‌లో జరగనున్నాయి. నేడు, రేపు (జూన్ 30, జూలై 1) భారీ ఎత్తున జరగనున్న ఈ వేడుకకు దక్షిణాది సినీ పరిశ్రమల నుంచి స్టార్స్ అంతా విచ్చేశారు. ఆ ఫొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X