»   » టాలీవుడ్ లో తిరుగులేని హీరో పవన్ కళ్యాణ్!

టాలీవుడ్ లో తిరుగులేని హీరో పవన్ కళ్యాణ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ తో సినిమా అనగానే ప్రతి నిర్మాత ముందువరుసలో ఉంటారు. దీనికి కారణం అతని సినిమాకు ఖర్చు పెట్టిన డబ్బు సినిమా సక్సెస్ అయినా అవ్వకపోయినా వచ్చేస్తుందనే నమ్మకం ఉండటంతో ఎంత భారీగా ఖర్చుపెట్టడానికైనా నిర్మాతలు ఇష్టపడతారు. ప్రస్తుతం రీసెంట్ గా జయంత్ దర్శకత్వంలో ప్రారంభమైన పవన్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న గణేష్ కూడా ఇదే విషయం చెబుతున్నాడు.

నా దృష్టిలో పవన్ కళ్యాణ్ ఓ దేవుడు. పవన్ కళ్యాన్ కనుక డేట్స్ ఇచ్చి ఉండకపోతే, నేను ఇప్పటి వరకూ సినీ పరిశ్రమలో చేతులు కట్టుకునే వుండేవాణ్ణి..పవన్ డేట్స్ ఇచ్చిన తర్వాతే నేను మంచి నిర్మాతగా అందరిచేతా గుర్తింపు పొందగలుగుతున్నాను అంటున్నాడు. కమెడియన్ గణేష్. ప్రస్తుతం హిందీ లో'లవ్ ఆజ్ కల్" చిత్రాన్ని తెలుగులో పవన్ హీరోగా నిర్మిస్తోన్న గణేష్, బడ్జెట్ లిమిట్ పెట్టుకోకుండా తెలుగు సినీ పరిశ్రమలో సరికొత్త రికార్డుల్ని సృష్టించే రేంజ్ లో తన సినిమా వుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. స్వతహాగా మా ఫ్యామిలీ మంచి బ్యాక్ గ్రౌండ్ తో పాటు, సౌండ్ ఉన్న ఫ్యామీలి. ఈ మధ్య ఆంజనేయులు చిత్రాన్ని నిర్మించాను అది సంతృప్తి నిచ్చింది. అసలు మొదటి చిత్రం పవన్కళ్యాణ్ గారితో చేయాలని అనుకున్నాను కానీ ఆయన రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల డేట్స్ కుదరలేదు ఆ అదృష్టం నాకు ఇప్పుడు వరించింది.

పవన్ కళ్యాణ్ వజ్రం ఆ వజ్రం విలువ బయటికి వస్తేనే తెలుస్తుంది. పవన్ సినిమా రిలీజయినప్పుడే పవన్ రేంజ్ ఏంటో అందరికీ తెలుస్తుంది. ఆయనతో సినిమా చేశాను అనే సంతృప్తి చాలు అంతటి గొప్ప నటుడు ఆయన. పవన్ టాలీవుడ్ లో తిరుగులేని హీరో పవన్ డేట్స్ దక్కితే ఎవరైనా కోటీశ్వరుడే అంటూ ఓ రేంజ్ లో పవన్ పై అభిమానాన్ని చాటుకున్నాడు గణేష్ ఓ ఇంటర్వ్యూలో. గణేష్ ఎంతగా తన ఆస్తుపాస్తులగురించీ, సంపాదన గురించీ చెప్పుకుంటున్న గణేష్ వెనుక, మంత్రి బోత్సా సత్యనారాయణ అండదండలు వున్నాయనేది సుస్పష్టం కాదంటారా!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu