»   » మూడురోజుల్లోనే 15 ఆఫర్లు... అరవింద్ స్వామి కి మణిరత్నం చేయలేనిది "ధృవ" సాధించింది

మూడురోజుల్లోనే 15 ఆఫర్లు... అరవింద్ స్వామి కి మణిరత్నం చేయలేనిది "ధృవ" సాధించింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

లేటెస్ట్ ధృవ లో సిద్ధార్థ్ అభిమన్యుగా నటించిన అరవింద్ స్వామి పాత్రలో వేరొకరిని ఊహించుకోలేం అన్నట్టుగా కనిపించాడు. చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌ని కూడా చాలా జాగ్రత్తగా, తెలివిగా పలికించడంలో అరవింద్ స్వామి చూపిన ప్రతిభ ఈ సినిమాకే మేజర్ హైలైట్స్‌లో ఒకటిగా చెప్పుకోవచ్చు. నాటితరం క్రేజీ హీరోల్లో ఒకరైన అరవింద స్వామి, ఇలా ఒక ఇంటరెస్టింగ్ రోల్‌తో మళ్ళీ తెలుగు తెరకు పరిచయమవ్వడం అన్నది ఈ సినిమాకు ఫ్రెష్ ఫీల్ తెచ్చిపెట్టింది.

దాదాపు చరణ్ పాత్రకున్నంత ఇంపార్టెన్స్ ఉండం, పోటాపోటీగా తన సీనియార్టీ ని చూపిస్తూ చరణ్ కి తగ్గ విలన్ గా కనిపించిన అరవింద స్వామి సెకెండ్ ఇన్నింగ్స్ లో ఎదే భారీ హిట్ అనొచ్చు. ఇక ఈ సినిమా ఆఫర్ ఇప్పుడు అరవింద్ కి ఎక్కద లేని ఆఫర్లని తెచ్చి పడేసింది... వీటిలో ఏది ఎంచుకోవాలో జాగ్రత్తగా ఎంచుకుంటూ ఆచి తూచి వ్యవరిస్తున్నాడట ఈ అందగాడు...

అవకాశాలు అంతగా రాలేదు:

అవకాశాలు అంతగా రాలేదు:

దీనికి ముందే మణిరత్నం "కడలి" లోనూ, ధృవ తమిళ మాతృక అయిన తనీ ఒరువన్ లోనూ చేసినా మరీఅంత క్రేజీ ఆఫర్లేం రాలేదు. అయితే ఒక్కసారిగా స్టార్ రేంజ్ ఇమేజీ, అరవింద స్వామి పూర్వ పు స్టార్ డం నీ మళ్ళీ తెచ్చిన సినిమా ధృవ. తనీ ఒరువన్ తమిళ్ లో కూడా పెద్ద హిట్టే అయ్యింది గానీ అవకాశాలు మాత్రం అంతగా రాలేదు.

తనిఒరువన్:

తనిఒరువన్:

కానీ తనిఒరువన్ మూవీని తెలుగులో ‘ధృవ' గా రిమేక్ చేసి రిలీజ్ చేశారు. తెలుగులో రిలీజ్ అయిన ‘ధృవ' మూవీకి ప్రస్తుతం ఇండస్ట్రీలో బారీ రెస్సాన్స్ వస్తుంది. ముఖ్యంగా రామ్ చరణ్ నటన కంటే హ్యాండ్సమ్ హీరో అరవింద్ స్వామికే ఎక్కువు కాంప్లిమెంట్స్ వస్తున్నాయి.‘ధృవ' లో సిద్ధార్థ్ అభిమన్యు అన్న నెగటివ్ రోల్‌లో అరవింద్ స్వామి నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

తెలుగు ప్రేక్షకులకు పెద్ద థ్యాంక్స్:

తెలుగు ప్రేక్షకులకు పెద్ద థ్యాంక్స్:

"నన్ను మళ్ళీ ఇంత బాగా ఆదరిస్తోన్నందుకు, సినిమాకు ఇంత పెద్ద విజయం తెచ్చిపెట్టినందుకు తెలుగు ప్రేక్షకులకు పెద్ద థ్యాంక్స్" అని అరవింద్ స్వామి తెలిపారు. ఇక ఈ మూవీ విజయం గురించి కాస్త పక్కన పెడితే... ఈ మూవీ కారణంగా అరవింద్ స్వామికి తెలుగులో 15 క్రేజీ ఆఫర్స్ వరించాయి. అన్నీ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలే. ఇదంతా కేవలం 7 రోజులు వ్యవధిలో వచ్చిన ఆఫర్స్ కావటం విశేషంగాఉంది.

ఆఫర్స్ వెల్లువ:

ఆఫర్స్ వెల్లువ:

‘ధృవ' మూవీ రిలీజ్ కంటే ముందుగా ఇండస్ట్రీ నుండి అరవింద్ స్వామికి ఆఫర్స్ వెల్లువ మొదలైంది.11డిసెంబర్ వరకూ అరవింద్ స్వామికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి వచ్చిన ఆఫర్స్ దాదాపు 15 వరకూ ఉన్నాయి. అయితే ఇందులో అరవింద్ స్వామి ఇప్పటికే 3 మూవీలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. మిగతా మూవీలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఇండస్ట్రీ నుండి తెలుస్తున్న సమాచారం.

హ్యాండ్సమ్ హీరోగా:

హ్యాండ్సమ్ హీరోగా:

ఒక దశలో హ్యాండ్సమ్ హీరోగా ఎందరో మగువల మనసులు దోచుకున్న అరవింద స్వామి కెరీర్ పీక్ టైమ్‌లో ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని అందరినీ నిరాశపరిచాడు. అయితే ఇప్పటికీ అరవింద స్వామిని మరచిపోలేదు జనాలు. ఇటీవల కోలీవుడ్‌లో రీ-ఎంట్రీ ఇచ్చిన స్వామి సెకండ్ ఇన్నింగ్స్‌లో 'తని ఒరువన్'తో స్మాషింగ్ హిట్ కొట్టేశాడు...

అందరి దృష్టి అరవింద్ స్వామిపై :

అందరి దృష్టి అరవింద్ స్వామిపై :

దీంతో అందరి దృష్టి అరవింద్ స్వామిపై పడింది... ఇప్పటికే 'తని ఒరువన్' టాలీవుడ్ రీమేక్‌లో బ్యాడ్ బాయ్‌గా కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అరవింద స్వామి ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులనూ మరోసారి అలరించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఇప్పుడు గ్లామరస్ డ్యాడ్ గా కనిపించనున్నాడట.

ఈసారి తండ్రి పాత్రలో:

ఈసారి తండ్రి పాత్రలో:

'రోజా, బోంబే' వంటి చిత్రాల ద్వారా బాలీవుడ్‌లోనూ భీభత్సమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న అరవింద్ స్వామి ఈసారి తండ్రి పాత్రలో బీ-టౌన్ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. తనుజ్ భ్రమర్ అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించనున్న 'డియర్ డాడ్' చిత్రంలో స్వామి ఓ 14ఏళ్ల అబ్బాయికి తండ్రిగా కనిపించబోతున్నాడు....

రొమాంటిగ్ హీరోగా:

రొమాంటిగ్ హీరోగా:

తండ్రీకొడుకుల బంధమే ప్రధానాంశంగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. గతంలో రొమాంటిగ్ హీరోగా బాలీవుడ్ జనాలను ఉర్రూతలూగించిన అరవింద్ స్వామి.ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ, సూపర్ విలన్ గానూ తీసుకున్న టర్న్ మళ్ళీ అతన్ని బిజీ ఆర్టిస్టుని చేసింది ఇక ఇప్పుడీ సెకండ్ ఇన్నింగ్స్ లో అదే స్థాయిలో మెప్పు
పొందుతాడేమో చూడాలి.

English summary
Aravind Swamy became a miraculous element of surprising victory factory in the movie "Dhruva", the Tollywood Film makers are now consistently requesting to act their films
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu