Don't Miss!
- News
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత
- Finance
Infosys: ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ ఝలక్..! ఉద్యోగాల తొలగింపు.. ఆ టెక్నిక్ వాడుతూ..
- Travel
వైజాగ్ సమీపంలోని సందర్శనీయ పర్యాటక ప్రదేశాలు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Sports
INDvsAUS : స్పిన్నర్ల ఎంపికపై ఆసీస్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
RIP Vivek Sir వివేక్ మృతితో శోక సంద్రంలో సినీ తారలు.. అనుభూతులను గుర్తు చేసుకొంటూ ఎమోషనల్
సినీ వినీలాకాశం నుంచి ఓ ధృవతార నేలకు రాలింది. చాలా మంది జీవితాల్లో చీకట్లను నింపుతూ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. దాదాపు ముప్పై ఏళ్లుగా తనదైన కామెడీతో నవ్వులు పంచుతూ టాప్ కమెడియన్‌గా వెలుగొందిన వివేక్ గుండెపోటుతో మరణించారు. సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్రను వేసుకున్న ఆయన మరణం చాలా మందిని కలచి వేసింది. దీంతో ట్విట్టర్ వేదికగా పలువురు సినీ ప్రముఖులంతా వివేక్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. తద్వారా ఈ లెజెండరీ కమెడియన్ మధుర ఘట్టాలను గుర్తు చేస్తున్నారు. ప్రముఖుల స్పందన ఇలా!

ఇండియన్ సినిమాకు నష్టం: మంచు మనోజ్
వివేక్ మరణంపై తెలుగు హీరో మంచు మనోజ్ స్పందిస్తూ.. 'నాకు హార్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇది. భారతీయ సినిమాకు ఆయన మరణం తీరని లోటు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా అన్న. ఎప్పటికీ మిమ్మల్ని మిస్ అవుతాం. ఓం శాంతి' అంటూ ట్వీట్ చేశాడు.

ఆ వార్త విని షాక్‌కు గురయ్యాను: అరుణ్ విజయ్
కమెడియన్ వివేక్ మరణంపై కోలీవుడ్ యాక్టర్ అరుణ్ విజయ్ స్పందిస్తూ.. 'మీరు ఇక లేరన్న వార్తతో నేను షాక్‌కు గురయ్యాను. సున్నితమైన మనసున్న ఓ గొప్ప వ్యక్తి. మమ్మల్ని ఎంతగానో నవ్వించిన మీరు ఇంత త్వరగా వెళ్లిపోతారని అనుకోలేదు. మిమ్మిల్ని మేమంతా మిస్ అవుతున్నాం సార్' అంటూ ట్వీట్ చేశాడు.

మీ లోటును ఎవరూ భర్తీ చేయలేరు: హన్సిక
లెజెండరీ కమెడియన్ వివేక లేరన్న వార్తపై స్టార్ హీరోయిన్ హన్సిక స్పందిస్తూ.. 'ఎనర్జీకి ప్రత్యక్ష నిర్వచనం మీరు. ఇకపై మీరు లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. మీ లోటును ఎవరూ భర్తీ చేయలేరు' అంటూ ఎమోషనల్‌గా ట్వీట్ చేసింది.

నేను కలిసి గొప్ప వ్యక్తుల్లో మీరొకరు: జెనీలియా
వివేక్ కన్నుమూసిన వార్తపై హీరోయిన్ జెనీలియా స్పందిస్తూ.. 'డియర్ వివేక్ సార్. నా మొదటి తమిళ సినిమా సమయంలో మిమ్మల్ని కలుసుకున్నాను. ఇప్పటి వరకూ నేను కలిసి గొప్ప వ్యక్తుల్లో మీరొకరు. నాకు మీరు ఇచ్చిన మద్దతు ఎప్పటికీ మర్చిపోలేను. మీతో కలిసిన అనుభవాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను' అంటూ ట్వీట్ చేసింది.

ఆ బాధను మాటల్లో చెప్పలేను: హీరోయిన్ అంజలి
కమెడియన్ వివేక్ మరణంపై విచారం వ్యక్తం చేస్తూ హీరోయిన్ అంజలి ట్వీట్ చేసింది. 'మీరు లేరన్న వార్తను తట్టుకోలేకపోతున్నా. అది మాటల్లో వ్యక్తం చేయలేని బాధ. మీ లోటు తీర్చలేనిది. మేమంతా మిస్ అవుతున్నాం సార్' అంటూ అందులో పేర్కొంది.

నా గుండె ముక్కలయిపోయింది: హీరో ఆర్య
లెజెండరీ కమెడియన్ వివేక లేరన్న వార్తపై స్టార్ హీరో ఆర్య స్పందిస్తూ.. 'మీ మరణ వార్తతో నా గుండె పగిలిపోయినంత పనైంది. సినీ పరిశ్రమకే కాదు.. సమాజానికి కూడా మీ మరణం తీరని లోటును మిగిల్చింది. సమాజం కోసం ఏదైనా చేయాలని తపన పడ్డాడు. చివరికి ఇలా వెళ్లిపోయాడు' అంటూ ఎమోషనల్ అయ్యాడు.

మా బాల్యాన్ని గుర్తుండేలా చేశారు: కార్తికేయ
వివేక్ మృతిపై టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ స్పందిస్తూ.. 'మమ్మల్ని బాగా నవ్వించడంతో పాటు మా బాల్యాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసిన వివేక్ సార్ మరణం షాక్‌కు గురి చేసింది. మీరు పంచిన నవ్వులకు... మిగిల్చిన జ్ఞాపకాలకు ధన్యవాదాలు సార్. మీ లోటు పూడ్చలేనిది' అంటూ ట్వీట్ చేశాడు.

సీనియర్‌లా అనిపించలేదు మంగళం సార్: థమన్
కమెడియన్ వివేక్ కన్నుమూయడంపై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో 'మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిన రత్నం లాంటి వివేక్ సార్. తన కామెడీతో ఎలాంటి ఒత్తిడినైనా పోగొడతారు. బాయ్స్ సినిమాలో సీనియర్‌తో నటించినట్లు అనిపించలేదు. మిస్ యూ మంగళం సార్' అంటూ రాసుకొచ్చాడు.

సినిమాకు ఇది భారీ నష్టం: అక్కినేని సమంత
లెజెండరీ కమెడియన్ వివేక లేరన్న వార్తపై స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత స్పందిస్తూ.. 'వివేక్ సార్ లేరన్న వార్తతో షాకయ్యాను. మీరు లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి' అంటూ ట్వీట్ చేసింది.

నిజంగా హృదయం ముక్కలైంది: దుల్కర్ సల్మాన్
వివేక్ మరణ వార్తను విన్న తర్వాత మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ స్పందించాడు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో 'మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మీరెప్పటికీ మాకు సుపరిచితుడే అనిపిస్తుంది. నిజంగా ఇది హార్ట్ బ్రేకింగ్ న్యూస్. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా' అంటూ పేర్కొన్నాడు.
Recommended Video

మీ మరణంతో శూన్యంగా కనిపిస్తోంది: శృతి హాసన్
వివేక్ మరణంపై స్టార్ హీరోయిన్ శృతి హాసన్ స్పందిస్తూ.. 'మీ అకాల మరణం నన్ను ఎంతగానో బాధించింది. వివేక్ సార్‌ను కోల్పోతున్న.. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నా. మీ మరణంతో ఈ సినీ ప్రపంచం శూన్యంగా కనిపిస్తోంది' అంటూ ట్వీట్ చేసింది.