»   »  కలెక్షన్లతో కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు.... అసలు ఏది వాస్తవం?

కలెక్షన్లతో కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు.... అసలు ఏది వాస్తవం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల ప్రమోషన్లలో కలెక్షన్ల వివరాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. సినిమా నిర్మాతలు, దర్శకుడు, ఆయా స్టార్ హీరోల అభిమానులు తమ హీరో సినిమా ఇంత భారీ మొత్తం వసూలు చేసిందని చెప్పుకోవడం గొప్పగా మారింది. అయితే ఈ కలెక్షన్ల వివరాలు చెప్పే విషయంలో ఎవరూ నిర్ణీతమైన పద్దతి పాటించడం లేదు.

కొందరు గ్రాస్ కలెక్షన్లను చూపి.... గొప్పగా చెప్పుకుంటుంటే, మరికొందరు షేర్ వివరాలు మాత్రమే ప్రకటిస్తున్నారు. బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 600 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. అయితే తర్వాత వచ్చిన శ్రీమంతుడు సినిమా మూడు వారాల్లోనే రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు ప్రకటించారు. రూ. 95 కోట్లు షేర్ వచ్చినట్లు ప్రకటించారు.


Tollywood movies collections

అసలు ఈ గ్రాస్ ఏమిటి? షేర్ ఏమిటి? అనే విషయాలు సాధారణ ప్రేక్షకులు అర్థం కావడం లేదు. సినిమా మొత్తం కలెక్షన్లను గ్రాస్ కలెక్షన్ అంటారు. పన్నులు, థియేటర్ అద్దెలు, ఇతర ఖర్చులు పోను మిగిలిన మొత్తాన్ని షేర్ అంటారు. నిన్న మొన్నటి వరకు తెలుగు నిర్మాతలు కలెక్షన్ విషయంలో ‘షేర్' మాత్రమే ప్రామాణికంగా తీసుకునే వారు.


అయితే ఈ మధ్య పోటీ ఎక్కువ కావడంతో గ్రాస్ కలెక్షన్లు ప్రటించి జనాల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. వాస్తవానికి గ్రాస్ కలెక్షన్ ప్రకారం చూస్తే తెలుగులో రూ. 100 కోట్లు సాధించిన తొలి సినిమా ‘మగధీర' అనే చెప్పాలి. బాహుబలి సినిమా ఒక్క తెలుగు వెర్షనే రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. షేర్ 108 కోట్లు వసూలు చేసింది.


సినిమా కలెక్షన్లు చూపించే క్రమంలో ఒక పద్దతి, ప్రామాణిక అంటూ ఏమీ లేక పోవడంతో ప్రేక్షకులు కన్ ఫ్యూజ్ అవుతున్నారు.

English summary
Telugu movies are doing a great job with respect to the amazing reviews as well as the bang on box office collections globally.
Please Wait while comments are loading...