»   » సూపర్ స్టార్ భార్య పాప్ కార్న్ అమ్మటం ఏమిటీ..!? ఎందుకంటే...

సూపర్ స్టార్ భార్య పాప్ కార్న్ అమ్మటం ఏమిటీ..!? ఎందుకంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

మంచు వారసురాలు లక్ష్మీ ప్రసన్న సినిమాల్లోనే కాకుండా.. టెలివిజన్ రంగంలో కూడా సత్తా చాటుతోంది. సినిమాలు తీయడం నటించడంతో పాటే.. టీవీల్లో టాక్ షోలతోనూ సక్సెస్ ఫుల్ పర్సన్ గా పేరు తెచ్చుకుంది. ప్రేమతో మీ లక్ష్మితో స్టార్ట్ చేసి - లక్కుంటే లక్ష్మి - దూసుకెళ్తా - బూమ్ బూమ్ వంటి కార్యక్రమాలను దిగ్విజయంగా డీల్ చేసిన అనుభవం ఉంది. అలాగే ఈమెకు సామాజిక సేవపై కూడా మక్కువ ఎక్కువ. చెన్నై వరదల సయమంలో మేము సైతం అంటూ ఓ కేంపెయిన్ ను టాలీవుడ్ తరఫున నడపడంలో.. లక్ష్మీ మంచు కీలక పాత్ర పోషించింది. ఇదే కాకుండా కొన్ని సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొన్న అనుభవం మంచితనం ఆమె సొంతం. అందుకే ఓ ఎంటర్ టెయిన్ మెంట్ ఛానల్.. మేముసైతం అంటూ ప్రారంభించబోతున్న కార్యక్రమానికి తొలి ఆప్షన్ గా ఈమెనే ఎంచుకుంది.

ఇప్పటివరకూ లక్ష్మి చేసిన ప్రయత్నం వల్ల నిజంగా అద్బుతమైన ఫలితాలే వచ్చాయి. కొన్ని కుటుంబాలకు అత్యవసర సమయాల్లో సహాయం అందుఇంది. కొందరు పిల్లలకైతే చదువు పూర్తి అయ్యే దాకా మేము అండగా ఉంటాం అంటూ ఒక బరోసా వచ్చింది. హీరోలనూ, సినీ సెలబ్రిటీలనూ ఒప్పించి రోడ్దుమీదకి తీసుకు రావటం లో మంచులక్ష్మి పాత్ర ఖచ్చితంగాఉంది. ఒకరి తర్వాత ఒకరుగా వస్తున్నారు అయితే యువనటులు రావటం పాల్గొనటం వరకూ ఓకేగానీ విజయనిర్మల లాంటి సీనియర్ నటి , దర్శకురాలు కూడా జనం లోకి రావటం ఆశ్చర్యం కలిగించే విశయమే... ఇంతకీ ఆమె ఏం చేసారూ అంటే.....

Photo Courtesy : Gemini TV

 సూపర్ స్టార్ కృష్ణ సతీమణి:

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి:

జెమిని టీవీలో ప్రసారమయ్యే "మేము సైతం" కార్యక్రమం కోసం సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల పాప్ కార్న్ అమ్మే పనిలో పడ్డారు. హైదరాబాద్ లోని ఒక ఏరియాలో ఆమె రోడ్డు మీదికి వచ్చి పాప్ కార్న్ అమ్మకాలు చేపట్టారు. ఇంత వయసులోనూ ఒక మంచి కారణం కోసం విజయ నిర్మల లాంటి ఒక సెలబ్రిటీ రోడ్దు మీద నిలబడటం చాలా మందినే కదిలించింది.

శనివారం రాత్రి 9.30 గంటలలకు:

శనివారం రాత్రి 9.30 గంటలలకు:

ఓ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఆమె ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణ అభిమానులతో సరదాగా మాట్లాడుతూ.. జోకులేస్తూ పాప్ కార్న్ అమ్మకాలు చేపట్టారు. విజయనిర్మల ప్రోగ్రాం ఈ శనివారం రాత్రి 9.30 గంటలలకు జెమిని టీవీలో ప్రసారమవుతుంది. ‘మేము సైతం' కార్యక్రమంలో ఇప్పటిదాకా చాలా వరకు యువ హీరో హీరోయిన్లే ఎక్కువగా అతిథులుగా వచ్చారు.

ఎంతో మందికి సాయం:

ఎంతో మందికి సాయం:

మోహన్ బాబు లాంటి ఒకరిద్దరు తప్ప సీనియర్ ఆర్టిస్టులు వచ్చింది లేదు. ఈ నేపథ్యంలో విజయనిర్మల ఈ కార్యక్రమానికి రావడం సర్ప్రైజే. మున్ముందు మరింత మంది సీనియర్ ఆర్టిస్టుల్ని రప్పించాలని చూస్తోంది మంచు లక్ష్మి. అభాగ్యుల్ని ఆదుకోవడం కోసం మంచు లక్ష్మి.. జెమిని టీవీ సహకారంతో చేపడుతున్న ఈ ప్రోగ్రాంకు మంచి స్పందన వస్తోంది. సెలబ్రెటీలు చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో మందికి సాయం చేశారు.

సాయిధరమ్ తేజ్

సాయిధరమ్ తేజ్

ఈ మధ్యే సాయిధరమ్ తేజ్ అతిథిగా హాజరైన ప్రోగ్రాం ద్వారా రూ.20 లక్షలు సమకూరడం విశేషం.60మంది బాలబాలికలతో జరిపాకలో వీరబాబు, సత్యకళ దంపతులు ఆశ్రమం నడుపుతున్నారు. ఆశ్రమ భవన నిర్మాణానికి అండగా నిలిచేందుకు హీరో సాయిధరమ్ తేజ్ స్వీట్ స్టాల్ నడిపి వినూత్న సేవ చేశారు.

మోహన్ బాబు:

మోహన్ బాబు:

ఇందులో భాగంగానే మోహన్ బాబు ఇండ్లీలో అమ్మారు. తిరుపతిలోని తన తన శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థల ఎదురుగా రోడ్డుమీద ఇడ్లీలు అమ్మారు. ఇడ్లీలు అమ్మగా వచ్చిన సొమ్మును మంచు లక్ష్మి 'మేము సైతం' కార్యక్రమానికి అందజేసారు. 'మేము సైతం' కార్యక్రమం అనేది ఓ ఫండ్ రైజింగ్ ఈవెంట్. సినీ సెలబ్రిటీలు ఇలాంటి పనులు చేయడం ద్వారా నిధులు సేకరించడం అన్నమాట. ఇలా వచ్చిన సొమ్మును సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. ఈ కార్యక్రమంలో ఇప్పటికే చాలా మంది తెలుగు సినీ సెలబ్రిటీలు భాగం అయ్యారు.

అఖిల్ ఆటో నడిపాడు:

అఖిల్ ఆటో నడిపాడు:

ఈ పోగ్రాం కోసం అక్కినేని నటవారసుడు అఖిల్ ఆటో నడిపాడు. ఈ పోగ్రాంలో ఇదే మొదటిది కావటంతో అప్పుడు సంచలనమైంది. అఖిల్ ఆటో నడుపుతున్నాడనగానే జనం బాగానే ఎక్కారు. రకుల్ కూరగాయలు అమ్ముతూంటే మంచి బిజనెస్ జరిగింది. జెమెనీ లో వచ్చే పోగ్రామ్ అయినా అఖిల్ వంటి స్టార్స్ చేయటంతో మంచి కవరేజ్ వస్తోంది. అక్కినేని అబిమానులు ఈ సేవా కార్యక్రమాలను తెగ మెచ్చుకుంటూ పోస్ట్ లు పెట్టారు.

అఖిల్ వంటి హీరో:

అఖిల్ వంటి హీరో:

ఆటో లో జనం కన్నా బయిటే ఎక్కువ మంది ఉన్నట్లున్నా రు కదూ...సెలబ్రెటీలా మజాకానా అఖిల్ వంటి కుర్రాడు డ్రైవ్ చేస్తూంటే ఎక్కేది ఎవరూ ఇంకెవరు ఉత్సాహంగా అమ్మాయిలే ఈ పోగ్రామ్ కోసం సరదాగా కాస్సేపు అటూ ఇటూ ఆటో నడిపి ఇలా రిలాక్స్ అన్నమాట ఫ్యాన్స్ తో అఖిల్ వంటి హీరో వస్తున్నాడంటే ఆ పోగ్రామ్ కు ఎంత మైలేజ్ వస్తుందో ఇక్కడ మీరు చూడవచ్చు. రకుల్ మాత్రం మాంచి ఉత్సాహంగా ఈ కూరగాయలు అమ్మేసింది.

సేల్స్ గర్ల్ గా :

సేల్స్ గర్ల్ గా :

సీనియర్ హీరోయిన్ శ్రియ సూపర్ మార్కెట్ లో సేల్స్ గర్ల్ గా పనిచేసింది. మరో స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి సైతం ..సేల్స్ గర్ల్ గా చేసింది.ప్రణీత తాజాగా మంచు లక్ష్మి నిర్వహిస్తున్న ఛారిటీ సెలబ్రిటీ షో మేము సైతం కార్యక్రమం కోసం ఫ్రూట్ సెల్లర్ గా మారింది. ఓ క్యాన్సర్ భాధితుడి కోసం రోడ్డెక్కి ఫ్రూట్స్ అమ్మిన ప్రణీత ముప్పై వేలు పై చిలుకు సొమ్ముని కలెక్ట్ చేసింది. ఇంక ఫ్రూట్స్ కొనడానికి వచ్చిన వారితో కలిసి డ్యాన్స్ చేసి సందడి చేసింది ఈ అందాల భామ.

రైతుబజార్ లో:

రైతుబజార్ లో:

దగ్గుబాటి రానా రైతుబజారులో మూటలు మోస్తూ కూలీ అవతారం ఎత్తాడు. రైతుబజార్ లో ఖాకీ దుస్తులు, ఎర్రటి తువాలు ధరించి మూటలు మోశాడు. ఇప్పటికే ఈ కార్యక్రమం కోసం రకుల్‌ కూరగాయలు అమ్మగా, రానా కూలీగా మారి మూటలు మోశాడు. ఇక అఖిల్‌ ఖమ్మంలో ఆటో నడిపి తద్వారా వచ్చిన డబ్బులు ఛారిటీకి ఇచ్చాడు. మరి.. రానాతో మూటలు మోయించి, అఖిల్ తో ఆటో నడిపించిన మంచు లక్ష్మి.. ఇప్పుడు ఎన్టీఆర్, మహేశ్ లతో ఏం చేయించబోతోందని అనేది ఆసక్తికరంగా మారింది. మరింతకూ ఛారిటీ షో కోసం ఈ ఇద్దరూ ఏం చేయబోతున్నారో..!

English summary
Vijaya Nirmala appeared on the famous Gemini TV show, 'Memu Saitham'. The veteran actress and director came forward to raise funds to support a unprivileged family by selling Popcorn.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu