»   » అప్పట్లో ట్రిక్, ఇప్పుడు గ్రాఫిక్స్ అంతేగా : బాహుబలి గాలి తీసేసిన కైకాల సత్యనారాయణ

అప్పట్లో ట్రిక్, ఇప్పుడు గ్రాఫిక్స్ అంతేగా : బాహుబలి గాలి తీసేసిన కైకాల సత్యనారాయణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రపంచమంతా 'బాహుబలి' రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రంగా కీర్తిని పొందింది. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అంత కంటే భారీ కలెక్షన్లు సాధించింది. అయితే బాహుబలి సినిమా పేరు చెబితే.. సాహో బాహుబలి అనే మెజారిటీ ప్రేక్షకులు ఉన్నట్టే.. ఈ సినిమాకి అంత సీన్ లేదు అని విమర్శించే వారు అధిక సంఖ్యలో ఉన్నారు. తాజాగా ఆ లిస్ట్‌లోకి చేరారు సీనియర్ యాక్టర్ కైకాల సత్యానారాయణ.

టాలీవుడ్ మహామూవీ

టాలీవుడ్ మహామూవీ

ప్రభాస్ , రానా , అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్ వంటివారు ప్రధాన పాత్రల్లో ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన టాలీవుడ్ మహామూవీ అని పిలుచుకుంటున్న సినిమా బాహుబలి . ఇలాంటి సినిమాను తేలిగ్గా తీసిపడేశారు సీనియర్‌ నటుడు. అసలు ‘బాహుబలి' సినిమాలో ఏముంది అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ‘బాహుబలి' గురించి మాట్లాడారు.

ఏమైనా కథ ఉందా?

ఏమైనా కథ ఉందా?

"బాహుబలి' సినిమా మీరంతా చూసే ఉంటారు. అందులో ఏమైనా కథ ఉందా? వినసొంపైన డైలాగులు, ఆహ్లాదకరమైన సంగీతం ఉన్నాయా? ఇటువంటి యుద్ద సన్నివేశాలతో విఠలాచార్యగారు ఎప్పుడో సినిమాలు తీసేశారు. అప్పట్లో ఆ ఫైట్స్‌ని ట్రిక్‌ అనేవారు. ఇప్పుడేమో గ్రాఫిక్స్‌ అంటూ కోట్లు ఖర్చు చేస్తున్నారు. సినిమా తీశామంటే ప్రజలకి ఇంతో అంతో ఉపయోగపడాలి".

మూడు వాక్యాల్లో చెప్పొచ్చు

మూడు వాక్యాల్లో చెప్పొచ్చు

‘నేను ‘బాహుబలి' సినిమా చూశాను. ఏముంది అందులో. కథగా చెప్పుకోవడానికి అసలేముంది. ఆ సినిమా గురించి చాలా సింపుల్‌గా మూడు వాక్యాల్లో చెప్పొచ్చు. భారీ సెట్లు, గ్రాఫిక్స్‌ మాత్రం ఉన్నాయి. మా రోజుల్లో వాటిని ‘ట్రిక్స్‌' అనే వాళ్లం. ఇప్పుడు దానికి అందమైన పేరు పెట్టి ‘గ్రాఫిక్స్‌' అంటున్నారు.

తెలుగు సినిమా స్థాయి పెరిగినట్టేనా?

తెలుగు సినిమా స్థాయి పెరిగినట్టేనా?

మార్కెట్‌కు ఐదొందల కోట్లు పెట్టాల్సిన అవసరముందా?. ఆ బడ్జెట్‌తో ఐదొందల సినిమాలు చేసుకోవచ్చు. అయినా ఇలాంటి సినిమాలను హాలీవుడ్‌ వాళ్లు ఎప్పుడో తీశారు. వీటన్నింటినీ ఎన్నో ఇంగ్లీష్‌ సినిమాల్లో చూశాం.బోలెడు ఖర్చుపెట్టి సెట్‌లు వేసి సినిమా తీసేస్తే మన తెలుగు సినిమా స్థాయి పెరిగినట్టేనా?

ఎన్నో సినిమాలు అద్భుతంగా ఆడాయి

ఎన్నో సినిమాలు అద్భుతంగా ఆడాయి

మొన్న ‘బిచ్చగాడు' అనే చిన్న సినిమా వచ్చింది. బ్రహ్మాండంగా ఆడింది. గతంలో వచ్చిన ఎన్నో సినిమాలు అద్భుతంగా ఆడాయి. వాటిల్లో నీతి కూడా ఉండేది. కళ్లు జిగేల్‌మనిపించేలా సెట్లు వేసేస్తే తెలుగు సినిమా స్థాయి పెరిగినట్టా' అని సత్యనారాయణ ప్రశ్నించారు.

విఠాలాచార్య

విఠాలాచార్య

వేషాలు తగ్గిపోతే., పరిశ్రమలో లేకపోతే నిన్నా మొన్న వచ్చిన కుర్ర హీరోలకు ఇచ్చిన గౌరవం కూడా టాలీవుడ్ సీనియర్ నటులకు ఇవ్వరనేది ముమ్మాటికీ నిజం అంటూ అసహనం వ్యక్తం చేశారు కైకాల సత్యనారాయణ. ఇదే సందర్భంలో ఒకనాటి జానపద సినిమాల దర్శకుడు విఠాలాచార్య గురించి మాట్లాడుతూ .

సీనియర్ నటి జమున కూడా

సీనియర్ నటి జమున కూడా

ఎటువంటి టెక్నాలజీ లేని అలనాటి రోజులలో జానపద సినిమాలు తీసి ఎన్నో విజయాలు సాధించిన విఠాలాచార్య సినిమాలు 'బాహుబలి' స్థాయికంటే గొప్పవి అని అర్ధం వచ్చేడట్లుగా మాట్లాడుతూ కైకాల చేసిన కామెంట్స్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి..కొద్ది రోజుల క్రితం సీనియర్ నటి జమున కూడా బాహుబలి ని విమర్శించటం గమనార్హం

English summary
One of the Most Senior Actor In Tollywood Kaikala Satya Narayana Shocking Comments On Baahubali Movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu