twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందరితో బాబాయ్ అనిపించుకున్న టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి.. ఆదివారం రాత్రి ఏమైదంటే?

    |

    కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది సినీ ప్రముఖులు కన్నుమూశారు. కొందరు కరోనా కారణంగా మరణించగా మరి కొందరు ఇతర అనారోగ్య కారణాలతో మరణిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది..ఆ వివరాల్లోకి వెళితే

    సీనియర్ నటుడు మృతి

    సీనియర్ నటుడు మృతి

    టాలీవుడ్ లో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు మరణించారు. అరవై నాలుగేళ్ల రాజా బాబు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు సమాచారం. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు.

    రాజబాబు మృతితో ఒక్కసారిగా టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. రాజబాబు మరణించారు అనే విషయం తెలుసుకుని టాలీవుడ్ సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

    ఆ సినిమాతో

    ఆ సినిమాతో

    రాజబాబు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నరసాపురపేటలో 1957 జూన్‌ 13న జన్మించారు. రాజబాబు తండ్రి నాటకాలు ఆడుతూ ఉండే వారు. దీంతో చిన్నప్పటి నుండి నటనపై ఎంతో ఆసక్తి కలిగిన రాజబాబు సైతం అనేక నాటకాల్లో నటించారు. దేశవ్యాప్తంగా తిరిగి నాటక ప్రదర్శనలు ఇచ్చిన ఆయన 1995లో హీరో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ఊరికి మొనగాడు అనే సినిమాతో టాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

    ఎక్కువగా ఆ డైరెక్టర్ సినిమాల్లోనే

    ఎక్కువగా ఆ డైరెక్టర్ సినిమాల్లోనే

    అలా మొదలైన రాజబాబు నటనా ప్రస్థానం మొన్నటి వరకు సాగింది. ఎక్కువగా కృష్ణ వంశీ సినిమాల్లో ఆయన కనిపించేవారు. సింధూరం, సముద్రం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మురారీ, శ్రీకారం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కళ్యాణ వైభోగం, మళ్ళీ రావా?, బ్రహ్మోత్సవం, భరత్ అనే నేను లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1995 నుంచి సుమారు 62 సినిమాల్లో కాq విభిన్నమైన పాత్రలు పోషించారు రాజబాబు. గోదావరి పల్లెటూరి పాత్రాలకు రాజబాబు చాలా చక్కగా సరిపోయే వారు.

    సీరియల్స్ లో సైతం

    సీరియల్స్ లో సైతం

    రాజబాబు యాసకు, ఆహార్యానికి ఆ పాత్రలు చక్కగా కుదిరేవి, అందుకే గోదారి పాత్రలకు ఆయనను దర్శక నిర్మాతలు వెతికి మరీ ఫైనల్ చేసేవారు. సినిమాలే కాకుండా అనేక సీరియల్స్ లో రాజబాబు నటించారు. బుల్లితెరలో సూపర్ హిట్ అయిన వసంత కోకిల, అభిషేకం, రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం, చి ల సౌ స్రవంతి లాంటి సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు సైతం రాజబాబు సుపరిచితమే.

    Recommended Video

    Santosh Sobhan Vs Director Maruthi Truth Or Dare | Manchi Rojulochaie
    బాబాయ్ అని ఆప్యాయంగా

    బాబాయ్ అని ఆప్యాయంగా


    2005లో అమ్మ సీరియల్‌లోని పాత్రకుగానూ ఆయన్ని నంది అవార్డు వరించింది. రాజబాబు కెరీర్‌లో ఇప్పటి వరకు దాదాపు 48 సీరియల్స్‌లో నటించారు. రాజబాబుకు భార్య , ఇద్దరు మగపిల్లలు ,ఒక ఆడపిల్ల వున్నారు. తెర మీద సరదా పాత్రలు చేసే రాజబాబును టాలీవుడ్ నటులు అందరూ బాబాయ్ అని ఆప్యాయంగా పిలిచేవారు. సెట్ లో సైతం తన చుట్టూ వున్న వారిని హాయిగా నవ్విస్తూ వుండే రాజ బాబు మరణించారన్న వార్త దిగ్బ్రాంతికి గురి చేస్తోంది.

    English summary
    Tollywood senior actor rajababu passed away on Sunday due to illness.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X