»   »  ఘాజీకి నాగచైతన్య ప్రశంస.. ఏమన్నారంటే..

ఘాజీకి నాగచైతన్య ప్రశంస.. ఏమన్నారంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరోలు రానా దగ్గుబాటి, నాగచైతన్య అక్కినేని ప్రముఖ నిర్మాత, దివంగత రామానాయుడి మనువండ్లు. వీరిద్దరూ కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా స్నేహితులుగానే కనిపిస్తారు. తనకు సన్నిహితుడైన రానా నటించిన చిత్ర ది ఘాజీ అటాక్ శుక్రవారం విడుదల కానున్నది. విడుదలకు ముందే ఈ చిత్రాన్ని వీక్షించిన నాగచైతన్య.. రానాపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపించాడు.

Tollywood star Naga Chaitanya praises Ghazi team and Rana

'ఘాజీ చిత్ర బృందం చేసిన కృషికి గర్వంగా ఫీలవుతున్నాం. తెలుగు సినిమాను మరో ఎత్తుకు తీసుకెళ్లేలా ఈ చిత్రం ఉన్నది. కంగ్రాట్స్. రానా.. నవ్వు ఇలాంటి గర్వించే చిత్రాల్లో ఇంకా నటించాలి' నాగచైతన్య ట్వీట్ చేశారు. ది ఘాజీ చిత్రం విడుదలకు ముందే విమర్శకుల ప్రశంసలందుకొంటున్నది. ప్రస్తుతం ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

English summary
Naga Chaitanya said, Ghazi makes us proud. It will be pushing Telugu cinema to another level.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu