»   » లైఫ్ లో మళ్లీ సంపాదించుకోలేనంత డబ్బు.... : ప్రభాస్ ‘బాహుబలి 2’ ఇంటర్వ్యూ విశేషాలు

లైఫ్ లో మళ్లీ సంపాదించుకోలేనంత డబ్బు.... : ప్రభాస్ ‘బాహుబలి 2’ ఇంటర్వ్యూ విశేషాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'బాహుబలి-2' మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో చిత్ర యూనిట్ అంతా ప్రమోషన్లలో బిజీ అయిపోయారు. సినిమాలో యాంగ్రీగా కనిపించే ప్రభాస్ ఇక్కడ మీడియా వారు ఎలాంటి ప్రశ్నలు అడిగినా చాలా కూల్ గా సమాధానం ఇస్తున్నారు.

ఏ ఇంటర్వ్యూకు వెళ్లిన ప్రభాస్ నుండి రాజమౌళికి ముందు ఎదురవుతున్న ప్రశ్న..... కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్నే. అయితే రెండో భాగానికి సంబంధించి ఇది కీలకమైన సస్పెన్స్ పాయింట్ కాబట్టి ఈ విషయాన్ని మాత్రం ఎవరూ చెప్పడం లేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాతే చూడాలని కోరుతున్నారు.


రాజమౌళిని గుడ్డిగా నమ్మాం..

రాజమౌళిని గుడ్డిగా నమ్మాం..

‘బాహుబలి' తొలి భాగం ఇంత పెద్ద సక్సెస్ అవుతుందా? లేదా? అనేది మాకు ముందుగా తెలియదు. కేవలం రాజమౌళి విజన్ మీదే మా నమ్మకుకం. మేమంతా ఆయన్ను గుడ్డిగా నమ్మాం. మేం ఊహించిన దానికంటే సినిమా భారీ హిట్టయ్యింది.. అని ప్రభాస్ తెలిపారు.


భయంకరమైన టెన్షన్

భయంకరమైన టెన్షన్

నిర్మాతలు మాపై నమ్మకంతో కోట్లు ఖర్చు పెట్టారు. సినిమా ఫ్లాప్ అయితే వాళ్ల కోసం నేనో మూడు, రాజమౌళి ఓ మూడు సినిమాలు చేసినా నిర్మాతలు బయట పడలేనంత ఖర్చు పెట్టారు. అందుకే మొదటి భాగం రిలీజ్ సమయంలో భయంకరమైన టెన్షన్ ఉండేది..... తొలి భాగం హిట్టయింది కాబట్టి రెండో భాగం విషయంలో అప్పుడున్నంత టెన్షన్ లేదు. కాన్ఫిడెంటుగా ఉన్నామని ప్రభాస్ తెలిపారు.


లైఫ్ లో మళ్లీ సంపాదించుకోలేనంత డబ్బు

లైఫ్ లో మళ్లీ సంపాదించుకోలేనంత డబ్బు

రాజమౌళి ఎంత హార్డ్వర్క్ చేశాడు? నేను ఎన్నేళ్లు టైమ్ కేటాయించాను? అనేవి పక్కన పెడితే ... లైఫ్లో మళ్లీ సంపాదించుకోలేని డబ్బులను నిర్మాతలు ఖర్చుపెట్టారు. హిట్టయితే సరిపోదు. హిట్టయినా ప్లాప్ కిందే లెక్క. బ్లాక్ బస్టర్ అవ్వాలి....వేరే ఛాయిస్ లేదు. అప్పుడు నిర్మాతలు సేఫ్ అవుతారు అని ప్రభాస్ అన్నారు.


ఇప్పట్లో ఇలాంటి సినిమా చేయను

ఇప్పట్లో ఇలాంటి సినిమా చేయను

'బాహుబలి'ని ఎంజాయ్ చేశా. మళ్లీ ఇలాంటి సినిమా ఎవరైనా చేద్దామంటే నా వల్ల కాదు. అది లక్ష కోట్ల సినిమా అని చెప్పినా చేయను. నాలుగేళ్ల తర్వాత అలాంటిదేమైనా ఆఫర్ వస్తే చేస్తానేమో అని ప్రభాస్ స్పష్టం చేసారు.


హాలీవుడ్ వార్తల్లో నిజం లేదు

హాలీవుడ్ వార్తల్లో నిజం లేదు

నేను హాలవుడ్ వెలుతున్నట్లు వస్తున్న వార్తలు నిజం లేదు. చేస్తే హిందీ సినిమా చేస్తానేమో. హాలీవుడ్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు అని ప్రభాస్ అన్నారు.


వారి ఖర్చుకు భయపడి ఉదయాన్నే వెళ్లే వాన్ని

వారి ఖర్చుకు భయపడి ఉదయాన్నే వెళ్లే వాన్ని

బాహుబలి సినిమాలో గంట సమయం వేస్టయితే లక్షల్లో ఖర్చు. అందువల్ల, త్వరగా నిద్రలేచి షూటింగుకు వెళ్లాలనుకునేవాణ్ణి. 'మిర్చి'కి నా స్నేహితులే నిర్మాతలు. తొమ్మిదింటికి షూటింగుకు వస్తానని చెప్పొచ్చు. ఒకవేళ రాజమౌళి వింటాడనుకున్నా ... నిర్మాతల ఖర్చు చూసి నేనే భయపడేవాణ్ణి అని ప్రభాస్ అన్నారు.


రాజకీయాలపై

రాజకీయాలపై

నాకు రాజకీయాలే అర్థం కావు. పెద్దనాన్న ఓ సారి ఎంపీగా పోటీ చేసిపుడు మొగల్తూరు బాధ్యతలు అప్పజెప్పారు. అపుడు నా వయసు 18. ఆ ఎలక్షన్ పూర్తయిన తర్వాత ‘ఇలాంటి బాధ్యతలు నావల్ల కాదు' ఇకపై ఎప్పుడూ ఇలాంటివి చుయను అని దండం పెట్టేసి వచ్చేశా అని ప్రభాస్ తెలిపారు.


కీరవాణి గారు మీకు గర్వం లేదన్నారు?

కీరవాణి గారు మీకు గర్వం లేదన్నారు?

వ్యక్తిగతంగా మా కుటుంబానికి సన్నిహితులు కీరవాణి. ఆయన మా ఇంటికొచ్చి మా గోపీకృష్ణ మూవీస్‌తో ముడిపడి ఉన్న జ్ఞాపకాల్ని గుర్తు చేసుకొంటే భావోద్వేగంతో కూడిన వాతావరణం ఏర్పడుతుంది. మా అక్క అయితే ఏడుపులే. ఆ అనుబంధంతోనే నా గురించి కీరవాణిగారు అలా చెప్పారు. నాలోనూ గర్వం ఉందేమో (నవ్వుతూ). లేదన్నట్టుగా నటిస్తున్నానేమో! అని ప్రభాస్ అన్నారు.


ఏమీ కోల్పోలేదు

ఏమీ కోల్పోలేదు

ఐదేళ్లు రెండు సినిమాల కోసమే కేటాయించారని అందరూ అంటున్నారు కానీ, నిజానికి దాని వల్ల నేను కోల్పోయిందేమీ లేదు. అంతకుమించిన పేరు, గుర్తింపు నాకు వచ్చింది. భారతదేశంలో ఎక్కడికి వెళ్లినా నన్ను గుర్తు పడుతున్నారు. ఉత్తరాదిలో కొద్దిమంది ప్రభాస్‌ అంటే, మరికొద్దిమంది పరభాస్‌ అని పిలుస్తున్నారు... అని చెప్పుకొచ్చారు ప్రభాస్.


ఇకపై ఏడాదికి రెండు సినిమాలు

ఇకపై ఏడాదికి రెండు సినిమాలు

ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేయాలనే ఆలోచనైతై ఉంది. అయితే యాక్షన్‌ ప్రధానమైన సినిమాలు చేయడం మాత్రం కష్టం. ఒకవేళ చేసినా వాటికి ఆరేడు నెలలు ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరగాలి. అలా చేస్తే మాత్రం నాలుగు నెలల్లో చిత్రీకరణ పూర్తి చేయొచ్చు. రాజమౌళి ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌' విషయంలో అదే చేశారు అని ప్రభాస్ తెలిపారు.


English summary
Check out Prabhas interview about Baahubali 2. Baahubali 2: The Conclusion is an upcoming Indian epic historical fiction film directed by S. S. Rajamouli. It is the continuation of Baahubali: The Beginning.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu