»   » సిల్వర్ సింధు: రజనీ, బాలయ్య, మహేష్, రాజమౌళి, ఎన్టీఆర్ స్పందన...

సిల్వర్ సింధు: రజనీ, బాలయ్య, మహేష్, రాజమౌళి, ఎన్టీఆర్ స్పందన...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రియో ఒలంపిక్స్‌లో తెలుగు జాతి కీర్తి పతాకాన్ని ఎగరవేడయంతో పాటు దేశ పరువు నిలబెట్టిన బాడ్మింటన్ క్రీడాకారిణి పివి.సింధుపై దేశ వ్యాప్తంగా ప్రశంస వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు సినీ ప్రముఖులు సైతం ఇందులో జాయిన్ అయ్యారు. సింధును పొగడ్తలతో ముంచెత్తారు.

నటుడు బాలయ్య స్పందిస్తూ.. 21 ఏళ్ల చిరుప్రాయంలో భారతీయ జాతిపతాక గౌరవాన్ని ప్రపంచపు నలుమూలలా వ్యాపింపజేయడంతోపాటు తెలుగు వారి ఘన కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మన తెలుగు వనిత కుమారి పి.వి.సింధుని గౌరవించుకోవడం తెలుగు వారిగా, భారతీయులుగా మన కర్తవ్యం. తొలి ప్రయత్నంలోనే "ఒలింపిక్" పతాకం అందుకొన్న మొట్టమొదటి యువతిగా రికార్డ్ సృష్టించిన సింధు మరెందరో స్ఫూర్తిగా నిలిచింది. మా బసవతారకం ఆసుపత్రిలో నిర్వహించిన ఎన్నో కార్యక్రమాలకు విశిష్ట అతిధిగా విచ్చేసిన సింధు నేడు ప్రపంచ వ్యాప్తంగా కీర్తింపబడుతుండడం నాకెంతో సంతోషాన్నిస్తోందని నందమూరి బాలకృష్ణ తెలిపారు.

గుణ్ణం గంగరాజు స్పందసిస్తూ...
రెండు నిమషాలు బాధ కలిగుండొచ్చు, ఆశించింది చేతికి రాలేదని. భారతీయులందరికీ. తెలుగువాళ్ళకి ఇంకొంచుం ఎక్కువగా. టీ వీ ముందు అలా కూర్చుండిపోయి వుండొచ్చు. కాని సింధుకి అంత సమయం కూడా పట్టలేదు, కోలుకోవటానికి. నెట్ అవతలి పక్కకు వెళ్ళింది. అక్కడ నేల మీద బోర్లా పడుకుని ఇప్పటివరకు ఏ యూరపియన్ అమ్మాయికి దక్కని బంగారు పతకం దక్కిన ఆనందం తో కన్నీళ్ళు కారుస్తున్న కేరొలీన మారిన్ ని పైకి లేపి హత్తుకుంది.ఇది సహ అనుభూతి; ఇది తన పైన నెగ్గిన వారికి సింధు చూపిన గౌరవం, ఆప్యాయత. మారిన్ సింధు ని కౌగిలించుకొని ఆ విజయోత్సాహం లో తన కోచ్ ల వద్దకు వెళ్ళిపోయింది. తన రేకెట్ కోర్ట్ మీద మర్చిపోయి. సిందు ఆ రేకట్ తీసి, మారిన్ కిట్ బేగ్ దగ్గర పెట్టి అప్పుడు తన గురువు దగ్గరకు వెళ్ళింది. ఇది సంస్కారం. ఇదీ బంగారం. తల్లి తండ్రుల పెంపకం, గురువుల శిక్షణ తో వచ్చేది; గవర్నమెంటు సంబరాలతో, శాసనాలతో ఉప్పొంగేది కాదు. సింధు ఏ దేశానిదో, ఏ రష్ట్రానిదో అన్నది అనవసరం. ఇలాంటి బంగారం ఒకటుంది ప్రపంచం లో. అది మలచిన రమణ విజయలక్ష్మిలకు, గురువు గోపిచంద్ కు నమస్కరిద్దాం అన్నారు.

స్లైడ్ షోలో రాజమౌళి, ఎన్టీఆర్, అఖిల్, ఇతర సినీ స్టార్లు పి.వి.సింధు గురించి ఏమన్నారు అనే విషయాలు చూద్దాం...

బాలయ్య

బాలయ్య

మా బసవతారకం ఆసుపత్రిలో నిర్వహించిన ఎన్నో కార్యక్రమాలకు విశిష్ట అతిధిగా విచ్చేసిన సింధు నేడు ప్రపంచ వ్యాప్తంగా కీర్తింపబడుతుండడం నాకెంతో సంతోషాన్నిస్తోందని నందమూరి బాలకృష్ణ తెలిపారు.

రజనీకాంత్

రజనీకాంత్

హాట్సాఫ్ సింధు అంటూ రజనీకాంత్ ట్వీట్.

ఎన్టీఆర్

ఎన్టీఆర్

ఛాంపియన్ లా ఫైట్ చేసావంటూ జూ ఎన్టీఆర్ ప్రశంసలు.

కొరటాల శివ

కొరటాల శివ

సింధు నువ్వే మాకు బంగారం అంటూ దర్శకుడు కొరటాల శివ ట్వీట్.

హీరో రామ్

హీరో రామ్

పివి సింధు విజయంపై తెలుగు హీరో రామ్ ఇలా స్పందించారు.

మహేష్ బాబు

మహేష్ బాబు

మహేష్ బాబు సింధును ప్రశంసిస్తూ ట్వీట్ చేసారు. ఇదే ట్వీట్ ను అఖిల్ ట్వీట్ చేసాడు.

గర్వకారణం అంటూ అఖిల్

గర్వకారణం అంటూ అఖిల్

నువ్వు మాకు గర్వకారణం అంటూ అఖిల్ ట్వీట్

వరుణ్ తేజ్

వరుణ్ తేజ్

పివి సింధు విజయంపై వరుణ్ తేజ్ స్పందిస్తూ....

నాని

నాని

యాక్టర్ నాని స్పందిస్తూ ఇలా...

అల్లు శిరీష్

అల్లు శిరీష్

పివి సింధు విజయంపై అల్లు శిరీస్ స్పందిస్తూ...

సమంత

సమంత

హీరోయిన్ సమంత స్పందిస్తూ...

రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ ఇలా...

రాజమౌళి

రాజమౌళి

గర్వకారణం అంటూ దర్శకుడు రాజమౌళి

English summary
Telugu girl PV Sindhu bagged a silver medal for India at the Rio Olympics, after a hard fought final. This was her maiden attempt. Tollywood celebrities took to Twitter to congratulate her for putting up a tough fight in the final.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu