»   » వరుణ్ సందేశ్ ఎంగేజ్మెంటులో స్టార్ల సందడి (ఫోటోస్)

వరుణ్ సందేశ్ ఎంగేజ్మెంటులో స్టార్ల సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: : టాలీవుడ్ హీరో వరణ్ సందేశ్, హీరోయిన్ వితికా షేరు ఎంగేజ్మెంట్ సోమవారం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు, ప్రముఖులు హాజరయ్యారు. వరుణ్, వితికాలతో దిగిన ఫోటోలను నవీన్ చంద్ర, నిఖితా నారాయణ్ తదితరులు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు.

‘పడ్డానండీ ప్రేమలో మరి' చిత్రంలో తనకు జోడీగా నటించిన వితికా షేరుతో వరుణ్ సందేశ్ కు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. గత కొంత కాలంగా ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారు. ఇద్దరూ తమ ప్రేమ వ్యవహారం విషయాన్ని పెద్దలకు చెప్పి ఒప్పించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీ డేస్' చిత్రం భారీ విజయం సాధించడంతో వరుణ్ సందేశ్ మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘కొత్త బంగారు లోకం' కూడా హిట్ కావడంతో వరుణ్ కి అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే ఆ తర్వాత వరుణ్ సందేశ్ చేసిన సినిమాలన్ని బాక్సాఫీసు వద్ద బొల్తా పడటంతో కెరీర్ కాస్త స్లో అయింది. పెళ్లి తర్వాత తనకు కెరీర్ పరంగా కలిస్తుందని వరుణ్ సందేశ్‌ భావిస్తున్నారట.

నవీన్ చంద్ర సెల్ఫీ

నవీన్ చంద్ర సెల్ఫీ

వరుణ్ సందేశ్-వితిక షేరు ఎంగేజ్మెంట్ సందర్భంగా సెల్పీ షేర్ చేసిన నటుడు నవీన్ చంద్ర.

వరుణ్-వితిక

వరుణ్-వితిక

వరుణ్ సందేశ్, వితిక షేరు ఎంగేజ్మెంట్ సోమవారం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.

నిఖితా నారాయణ్

నిఖితా నారాయణ్

హీరోయిన్ నిఖితా నారాయణ్ వరుణ్ సందేశ్, వితిక షేరు ఎంగేజ్మెంటుకు హాజరైంది. ఈ సందర్భంగా వారితో దిగిన సెల్ఫీ షేర్ చేసింది.

ప్రేమ పక్షులు

ప్రేమ పక్షులు

గత కొంత కాలంగా వరుణ్ సందేశ్, వితిక షేరు ప్రేమించుకుంటున్నారు.

 పడ్డానండీ ప్రేమలో మరి

పడ్డానండీ ప్రేమలో మరి

‘పడ్డానండీ ప్రేమలో మరి' చిత్రంలో తనకు జోడీగా నటించిన వితికా షేరుతో వరుణ్ సందేశ్ కు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది.

వివాహం

వివాహం

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

English summary
Actor Varun Sandesh and Actress Vithika got engaged today at a star studded event.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu