»   »  మన హీరోలే ఇలా తయారయ్యారు : కత్తిలా ఉన్నారు కదా..!

మన హీరోలే ఇలా తయారయ్యారు : కత్తిలా ఉన్నారు కదా..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్క్రిప్ట్ డిమాండ్ చేసినప్పుడల్లా పరంగా మన హీరోలు లేడీ గెటప్ లో కనిపిస్తూ కడుపుబ్బా నవ్వించడమనేది బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలం నుంచి వస్తున్నదే. అన్ని భాషలలోని అగ్ర కథానాయకులంతా ఏదో ఓ సందర్భంలో లేడీ గెటప్ లో కనిపించి అభిమానులను అలరించిన వారే. ఇక మన తెలుగు హీరోల విషయానికొస్తే చిరంజీవి., బాలకృష్ణ., వెంకటేష్, రాజేంద్ర ప్రసాద్, నరేష్ తదితరులు లేడీ గెటప్ లో థియేటర్స్ లో నవ్వుల జల్లు కురిపిస్తూ సందడి చేసినవారే.

కాస్త పేరున్న హీరోలు తమ సినిమాలలో ఫుల్ లెంగ్త్ ఉన్న ఆడ వేషం వేసి కనిపించడం చాలా అరుదు. నటుడు కమల్ హాసన్, 'భామనే సత్యభామనే' చిత్రంలో ముసలి పాత్ర పోషించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ తరువాత రాజేంద్ర ప్రసాద్ 'మేడమ్' సినిమాలో, నరేష్ 'చూపులు కలసిన శుభవేళ' సినిమాలో ఈ తరహా పాత్రలో నటించి మెప్పించాడు. ఇటీవలే మంచు మనోజ్ ''పాండవులు పాండవులు...'' సినిమాలో మోహినీ వేషంలో అలరించి అలరించాడు. చిరంజీవి, విక్రమ్, సుమంత్ వంటి హీరోలు కూడా అలా తళుక్కున ఆడ పాత్రలలో మెరిసారు..

హీరోలు ఆడవారిగా కనిపించడం అంటే అంత సులభమేమి కాదు. అలా చేయడం అంటే సాహసం చేయడమే మరి. ఆడవారిలా అలంకరిస్తే సరిపోదు ఆడవారిలా అనునయించాలి. అది అందరికీ చేతకాదు. దానికోసం శ్రమించాలి అలా లేడీ గెటప్‌ వేసుకుని ప్రేక్షకులను అలరించి, మెప్పించిన కొంతమంది హీరోలను చూద్దామా.

మన హీరోలే ఇలా తయారయ్యారు : కత్తిలా ఉన్నారు కదా..!

మన హీరోలే ఇలా తయారయ్యారు : కత్తిలా ఉన్నారు కదా..!

నరేష్‌: లేడీ గెటప్ అనంగానే మొదట గుర్తొచ్చే చిత్రం బళారే విచిత్రం సినిమా. ఈ సినిమాలో నరేష్‌ లేడీ గెటప్‌లో నిజంగా అమ్మాయి అనే ఫీలింగ్‌ కల్గించాడు. బ్యాచిలర్స్‌కి ఎవరూ రూమ్‌ ఇవ్వకపోవడంతో నరేష్‌ మరియు సుదాకర్‌ భార్యాభర్తలుగా బ్రహ్మనందం నరేష్‌కి మామగారిగా నటించి ప్రేక్షకులను నవ్వులలో ముంచెత్తారు. ఈ చిత్రం అప్పట్లో ఘనవిజయాన్ని సాధించింది. ఈ చిత్ర దర్శకుడు జంధ్యాల.

 మన హీరోలే ఇలా తయారయ్యారు : కత్తిలా ఉన్నారు కదా..!

మన హీరోలే ఇలా తయారయ్యారు : కత్తిలా ఉన్నారు కదా..!

రాజేంద్రప్రసాద్‌ : రాజేంద్రప్రసాద్‌ లేడీ గెటప్‌ అనగానే గుర్తొచ్చే సూపర్‌హిట్‌ చిత్రం మేడమ్‌. ఈ చిత్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ఈ చిత్రంలో మేడమ్‌ క్యారెక్టర్‌లో రాజేంద్రప్రసాద్‌ నటించాడు అనడం కంటే జీవించాడు అనేదే సరైన పదం.

 మన హీరోలే ఇలా తయారయ్యారు : కత్తిలా ఉన్నారు కదా..!

మన హీరోలే ఇలా తయారయ్యారు : కత్తిలా ఉన్నారు కదా..!

సుమంత్: ఏమో గుర్రం ఎగరావచ్చు కోసం సుమంత్ ఆడవేషం వేసాడు మాంచి కత్తి లాంటి పాపగా కనిపించి అందర్నీ మెప్పించాడు కూడా. సుమంత్ ఆ పాత్ర చేయడానికి తన తాతగారైన అక్కినేని నాగేశ్వరరావు గారే తనకి స్ఫూర్తి అని చెప్పాడు.

మన హీరోలే ఇలా తయారయ్యారు : కత్తిలా ఉన్నారు కదా..!

మన హీరోలే ఇలా తయారయ్యారు : కత్తిలా ఉన్నారు కదా..!

మంచు మనోజ్: పాండవులూ పాండవులూ తుమ్మెదా సినిమాలోనూ మంచు మనోజ్ ఆడవేషం వేసుకుని జనాలని నవ్వించే ప్రయత్నం చేసాడు. నిజానికి నవ్వించటం మాట అటుంచితే మనోజ్ అందానికి చాలామందే ఫ్లాతయ్యారు. అసలు ఈయన ఆడపిల్లగా ఉంటే ఈపాటికి మంచి గ్లామర్ హీఎరోయిన్ అయ్యుండే వాడని హాస్యానికి అనుకున్నారు...

 మన హీరోలే ఇలా తయారయ్యారు : కత్తిలా ఉన్నారు కదా..!

మన హీరోలే ఇలా తయారయ్యారు : కత్తిలా ఉన్నారు కదా..!

అల్లు అర్జున్‌: అల్లు అర్జున్‌ మొదటి సినిమా గంగోత్రి. ఈ చిత్రానికి కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. అల్లు అర్జున్‌ మొదటి చిత్రంలోనే లేడి గెటప్‌ వేయడమే కాకుండా డాన్స్‌ కూడా చేసాడు. మామయ్యది మొగల్తూరు అనే పాటలో అల్లు అర్జున్‌ పరికిణి వేసుకుని డాన్స్‌ చేసాడు. ప్రేక్షకులని అలరించాడు. ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది.

 మన హీరోలే ఇలా తయారయ్యారు : కత్తిలా ఉన్నారు కదా..!

మన హీరోలే ఇలా తయారయ్యారు : కత్తిలా ఉన్నారు కదా..!

అల్లరి నరేష్‌: అల్లరి నరేష్‌ సినిమాలు హాస్యాస్పదంగా నవ్వులు జల్లు కురిపిస్తాయి. అలాంటి నరేష్‌ కితకితలు చిత్రంలో దొంగలను పట్టుకోవడానికి ఒక మాష్టర్‌ ప్లాన్‌ వేసి లేడీగెటప్‌ లో కన్పిస్తాడు. పేరుకు తగ్గట్టుగానే ఈ చిత్రం ప్రేక్షకులకు కితకితలు పెట్టింది. యముడికి మొగుడు అనేసినిమాలోనూ ఇలా ఆడ గెటప్ లో కనిపించి నవ్విస్తాడు

 మన హీరోలే ఇలా తయారయ్యారు : కత్తిలా ఉన్నారు కదా..!

మన హీరోలే ఇలా తయారయ్యారు : కత్తిలా ఉన్నారు కదా..!

నాగార్జున: ఇక అగ్ర హీరోల సంగతికి వస్తే నాగార్జున మొత్తంగా లేడీ గెటప్ వెయ్యలేదు గానీ నిన్నే పెళ్ళాడుతా చిత్రంలో ఒక పాటలో నాగార్జున చీరకట్టుకుని డాన్స్‌ చేసి టబుని ఏడిపిస్తాడు. ఈ చిత్ర దర్శకుడు కృష్ణవంశీ.

మన హీరోలే ఇలా తయారయ్యారు : కత్తిలా ఉన్నారు కదా..!

మన హీరోలే ఇలా తయారయ్యారు : కత్తిలా ఉన్నారు కదా..!

మోహన్ బాబు: మోహన్ బాబు దగ్గరికి వస్తే మరీ ఎక్కువ సేపు ఉండదు గానీ "పట్నం వచ్చిన పతివ్రతలు" సినిమాలో చిరంజీవితో కలిసి కొద్ది సేపు ఆడవేశం లో కనిపిస్తాడు.

 మన హీరోలే ఇలా తయారయ్యారు : కత్తిలా ఉన్నారు కదా..!

మన హీరోలే ఇలా తయారయ్యారు : కత్తిలా ఉన్నారు కదా..!

విక్టరీ వెంకటేష్: విక్టరీ వెంకటేష్ ఈ జాబితాలోకి లేట్ గా వచ్చాడు. హిందీ నుండి రీమేక్‌ చేసిన బాడీగాడ్‌ చిత్రంలో త్రిషని వెతకడానికి హాస్టల్‌కి లేడీ గెటప్‌లో వెళతాడు. అలానే వాసు చిత్రంలో ఒక పాటలో ఆడపిల్లలా తయారయి కన్పిస్తాడు.

బాలకృష్ణ : పాండు రంగడు చిత్రంలో బాలకృష్ణ విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ చిత్రంలో బాలకృష్ణ లేడీ గెటప్‌ కూడా వేసాడు.

చిరంజీవి: మెగా స్టార్

చిరంజీవి: మెగా స్టార్ "చంటబ్బాయ్ సినిమాలో" ఓ పాటలో లేడీ గెటప్‌లో కనిపించి ప్రేక్షకులను అలరించాడు. అంతే కాకుండా పట్నంవచ్చిన పతివ్రతలు చిత్రం లో కుడా లేడీ గెటప్ లో కనిపిస్తాడు.

చిరంజీవి: మెగా స్టార్ "చంటబ్బాయ్ సినిమాలో" ఓ పాటలో లేడీ గెటప్‌లో కనిపించి ప్రేక్షకులను అలరించాడు. అంతే కాకుండా పట్నంవచ్చిన పతివ్రతలు చిత్రం లో కుడా లేడీ గెటప్ లో కనిపిస్తాడు.

 మన హీరోలే ఇలా తయారయ్యారు : కత్తిలా ఉన్నారు కదా..!

మన హీరోలే ఇలా తయారయ్యారు : కత్తిలా ఉన్నారు కదా..!

శ్రీ హరి: ఇక హీరో,విలన్, అని తేడాలేకుండా అన్ని పాత్రలూ వేసిన శ్రీ హరి కూడా యమహో యమ అనే సినిమాలో వృద్దురాలి పాత్రలో కనిపిస్తాడు.

మన హీరోలే ఇలా తయారయ్యారు : కత్తిలా ఉన్నారు కదా..!

మన హీరోలే ఇలా తయారయ్యారు : కత్తిలా ఉన్నారు కదా..!

విక్రమ్: తమిళ నటుడే అయినా తెలుగు వాడైన విక్రమ్ కూడా మల్లన్న సినిమాకోసం వేసిన లేడీ గెటప్ సూపర్ హిట్. అసలా గెటప్ లో విక్రమ్ ని చూసిన మగాళ్ళకే ఏదో అయ్యేలా ఉంటాడు.

 మన హీరోలే ఇలా తయారయ్యారు : కత్తిలా ఉన్నారు కదా..!

మన హీరోలే ఇలా తయారయ్యారు : కత్తిలా ఉన్నారు కదా..!

విశాల్ : ఇక బాల దర్శకత్వం లో వచ్చిన వాడూ వీడూ సినిమాలో ఒక పాట కోసం విశాల్ వేసిన ఊర మాస్ కాదు కాదు ఊర నాటు లేడీ గెటప్ ఇది.

 మన హీరోలే ఇలా తయారయ్యారు : కత్తిలా ఉన్నారు కదా..!

మన హీరోలే ఇలా తయారయ్యారు : కత్తిలా ఉన్నారు కదా..!

కమల్ హాసన్: కమల్ హాసన్ 'భామనే సత్యభామనే' చిత్రంలో ముసలి స్త్రీ పాత్ర పోషించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అన్నిటికంటే కష్టమైన పాత్ర కూడా.. ఆమేకప్ ఒకటీ రెండు రోజులు కాదు రెండునెలలు పైగానే సాగింది. ఫుల్ సినిమా మొత్తం ఆ మేకప్ తోనే కనిపిస్తాడు.

English summary
from the legendary NTR to Manchu Manoj, many Telugu actors were seen in lady getups. Some have surprised the audiences with their looks.
Please Wait while comments are loading...
 
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu