'ఆవకాయ బిర్యానీ' హీరోయిన్ ఎవరంటే..

ఇరవై సంవత్సరాల ఈ అమ్మాయి చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన అమ్మాయి. సినిమా నేపద్యానికి సంభంధంలేని కుటుంబం నుంచి వచ్చిన ఈ అమ్మాయి బయోటెక్నాలిజీ కోర్స్ చేస్తున్నప్పుడు మోడలింగ్ ఆఫర్ వచ్చింది. మొదట్లో ఆమె తల్లి తండ్రులు ఒప్పుకోకుపోయినా మెల్లిగా వారిని ఒప్పించింది. తర్వాత శేఖర్ ఆవకాయ బిర్యానీ సినిమా కోసం హీరో,హీరోయిన్స్ కావాలని ఏడ్స్ ఇవ్వటంతో ఆమె అటెండయి ఈ సినిమాద్వారా పరిచయం అవుతోంది. అసలు ఈ అమ్మాయి చిన్నప్పుడు స్కూల్లో చేసే కల్చరల్ పోగ్రామ్స్ క్లిక్ అయినప్పుడే హీరోయిన్ అనే వారుట. అదే మనస్సులో నాటుకుపోయి ఇలా బయిటపడిందంటోంది.
ఇక ఈ సినిమాలో బిందు ప్రపంచంలో గొప్పగా ఆవకాయ తయారుచెయ్యాలనే ఆశయంతో ఉన్న అమ్మాయి పాత్ర చేస్తోంది. ఆమె ఓ తెలంగాణాకి చెందిన ఆటో డ్రైవర్ తో ప్రేమలో పడుతుంది. అలా నవ్వులతో ఉండే ప్రేమకధ అంటోంది. నవంబర్ లో రిలీజవుతున్న ఈ సినిమాపై అంచనాలు మాత్రమే కాక ఆశలు చాలా ఉన్నాయట. మరి బెస్టాఫ్ లక్ చెబుదాం. ఎందుకంటే ఈమె క్లిక్ అయితే మరింతమంది తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా పరిచయమయ్యే అవకాశముంటుంది కదా.


Click it and Unblock the Notifications











