For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాలీవుడ్.... టాప్ 10 సెక్సీయెస్ట్ ఐటం సాంగ్స్

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: కమర్షియల్ సినిమా అంటే తప్పకుండా ఐటం సాంగు ఉండాల్సిందే. ఈ ట్రెండు తెలుగు సినిమాల్లో చాలా ఏళ్ల క్రితమే ప్రారంభం అయింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలో పాపులర్ అయిన ఐటం సాంగుల్లో ప్రత్యేకించి జ్యోతిలక్ష్మి, జయమాలిని లాంటి డాన్సింగ్ స్టార్లు ఉండే వారు. అదరిపోయే స్టెప్పులేస్తూ అందాలు ఆరబోస్తూ వారు ఇచ్చే హాట్ అండ్ సెక్సీ పెర్ఫార్మెన్స్ చూసేందుకు జనాలు ఎగబడే వారు. అయితే ఆ కాలంలో ఐటం సాంగులు అంటే ఫ్యామిలీ ప్రేక్షకులు పెదవి విరిచే వారు. వాటిని అశ్లీల కేటగిరీ కింద లెక్కగట్టేవారు.

  రాను రాను ఐటం సాంగు తీరు మారడంతో పాటు ప్రేక్షకుల్లో ఆ లాంటి సాంగ్స్ పై అభిప్రాయం కూడా మారింది. ఇప్పుడు ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా ఐటం సాంగులను ఆస్వాదించడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో హీరోయిన్లు కూడా కొన్ని సందర్భాల్లో ఐటం సాంగులు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు.

  ప్రస్తుతం టాలీవుడ్లో ఈ మధ్య కాలంలో బాగా బాపులర్ అయిన టాప్ 10 ఐటం సాంగులపై ఓ లుక్కేద్దాం...

  రింగ రింగ(ఆర్య 2)

  రింగ రింగ(ఆర్య 2)

  ఆర్య2 చిత్రంలో ‘రింగ రింగ' సాంగ్ ఎంత పాపులర్ అయిందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఇందులో అల్లు అర్జున్ స్టెప్పులు, ఆండ్రియా అందాలు ఆరబోత, దేవిశ్రీ మాస్ బీట్లు తెలుగు ప్రేక్షకులను ఓ ఊపు ఊపాయి. ఆ మధ్య ఐపిఎల్ సందర్భంగా క్రికెట్ స్టేడియాల్లోనూ రింగ రింగ ట్యూన్ హల్ చల్ చేసింది.

  అ అంటే అమలాపురం(ఆర్య)

  అ అంటే అమలాపురం(ఆర్య)

  ఆ అంటే అమలాపురం అంటూ... అభినయశ్రీ చేసిన ఐటం సాంగ్ పండు ముసలోళ్లతో కూడా స్టెప్పులు వేయించింది. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఆర్య చిత్రంలోని ఈ సాంగును దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసారు. టాప్ టెన్ లిస్టులో పాటకు ఎప్పుడూ అగ్రస్థానమే.

  ఇప్పటికింకా నా వయసు(పోకిరి)

  ఇప్పటికింకా నా వయసు(పోకిరి)

  పోకిరి చిత్రంలో ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే' అంటూ ముమైత్ ఖాన్ వేసిన స్టెప్పులు ఆమెను టాలీవుడ్ టాప్ ఐటం గర్ల్ గా మార్చేసాయి. ఈ పాటతో ముమైత్ ఖాన్ దశ తిరగిందని చెప్పొచ్చు. పోరికి సినిమా బిగ్గెస్ట్ హిట్ కావడంలో ఈ ఐటం నంబర్ ది కీలక పాత్ర.

  చిలకేమో శీకాకులం(వెంకీ)

  చిలకేమో శీకాకులం(వెంకీ)

  మాస్ మహరాజా రవితేజ హీరోగా 2004లో వచ్చిన ‘వెంకీ' చిత్రంలో రాశి చేసిన ‘చిలకేమో శీకాకుళం' అనే సాంగుకు ఇప్పటికే క్రేజ్ తగ్గలేదు. ఈ సాంగుకు కంపోజ్ చేసింది కూడా మాస్ బీట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాదే.

  నా పేరే కాంచన మాల(శంకర్ దాదా ఎంబీబీఎస్)

  నా పేరే కాంచన మాల(శంకర్ దాదా ఎంబీబీఎస్)

  శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో ‘నాపేరే కాంచన మాల' ఐటం సాంగు కూడా అప్పట్లో ఓ ఊపు ఊపింది. మెగాస్టార్ హీరో కావడంతో ఈ సాంగు మరింత పాపులర్ అయింది.

  పువ్వాయ్ పువ్వాయ్(దూకుడు)

  పువ్వాయ్ పువ్వాయ్(దూకుడు)

  దూకుడు చిత్రంలో పార్వతి మెల్టన్ చేసిన ‘పువ్వాయ్ పువ్వాయ్' సాంగ్ సినిమాను మరింత వినోదాత్మకంగా మార్చింది. పార్వతి మెల్టన్ అందచందాలు, మహేష్ బాబు పర్ ఫుల్ అప్పియరెన్స్, తమన్ బీట్స్ ఈ సాంగుకు టాప్ 10లో నిలబెట్టాయి.

  బ్యాడ్ బాయ్స్(బిజినెస్ మేన్)

  బ్యాడ్ బాయ్స్(బిజినెస్ మేన్)

  మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన బిజినెస్ మేన్ చిత్రంలో శ్వేతా భరద్వాజ్ చేసిన ‘బ్యాడ్ బాయ్స్' ఐటం సాంగ్ మంచి హిట్టయింది. తమన్ ట్రెండీ మ్యూజిక్, గీతా మాధురి, ప్రియా హిమేస్ వాయిస్, భాస్కర భట్ల లిరిక్స్ ఒకఎత్తయితే... శ్రేతా భరద్వాజ్ అందాల ఆరబోత ఈ సాంగుకు సెక్సీనెస్ తెచ్చిపెట్టింది.

  కెవ్వు కేక(గబ్బర్ సింగ్)

  కెవ్వు కేక(గబ్బర్ సింగ్)

  గబ్బర్ సింగ్ చిత్రంలో ‘కెవ్వుకేక' సాంగ్ పవన్ కళ్యాణ్ అభిమానులతో కేక పెట్టింది. మలైకా అరోరా కంటే పవన్ కళ్యాణ్ స్టెప్పులే ఈ పాటుకు వన్నె తెచ్చాయి. ఐటం సాంగులు కంపోజ్ చేయడంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించాడు దేవిశ్రీ ప్రసాద్.

  జరమొచ్చింది(కెమెరామెన్ గంగతో రాంబాబు)

  జరమొచ్చింది(కెమెరామెన్ గంగతో రాంబాబు)

  తాజాగా కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో ‘జరమొచ్చింది' సాంగ్ ప్రస్తుతం ఓ ఊపు ఊపుతోంది. సినిమాకు విజయంలో ఈ పాట కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ఈ పాటకు భాస్కర భట్ల లిరిక్స్ రాస్తే... ఖుషి మురళి, శ్రావణ భార్గవి వాయిస్ అందించారు. పవన్ కళ్యాణ్ సరసన విదేశీ భామ స్కార్లెట్ విలన్స్ స్టెప్పులేయడం మరో ఆకర్షణ.

  దియ్యాలో దియ్యాలో(100%లవ్)

  దియ్యాలో దియ్యాలో(100%లవ్)

  100%లవ్ చిత్రంలో ‘దయ్యాలో దియ్యాలో' సాంగ్ కూడా టాప్ 10 లిస్టులో చోటు దక్కించుకుంది. దేవిశ్రీ మాస్ బీట్లు, మరియం జకారియా ఒంపు సొంపులు...... ప్రియా హిమేష్, మురళి వాయిస్ ప్రేక్షకులను ఆకట్టుంది.

  English summary
  Tollywood has produced more than thousand item numbers in span of 50 years, but very few of them have been successful and remained fresh & green in the minds of film goers. 'Ringa Ringa', 'Aa Ante Amalapuram', 'Ippati Kinka', 'Naa Peru Kanchana Mala', 'Diyalo Diyala', 'Poovai Poovai', 'Silakemo Sikakulam' and 'Bad Boys' are some hottest and ever green item numbers from Telugu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X