»   » శాటిలైట్ రైట్స్: టాలీవుడ్ టాప్-10 మూవీస్..(ఫీచర్)

శాటిలైట్ రైట్స్: టాలీవుడ్ టాప్-10 మూవీస్..(ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు సినిమాలకు వచ్చే ఆదాయం కేవలం.... థియేటర్లలో ప్రదర్శన వల్ల మాత్రమే. కానీ టెక్నీలజీ పెరిగిన తర్వాత థియేటర్ల ప్రదర్శనతో పాటు వివిధ కొత్త మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతోంది. అలాంటి వాటిలో ప్రధాన మైంది శాటిలైట్ రైట్స్ రూపంలో వచ్చే ఆదాయం.

తెలుగు స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, బాలకృష్ణ, రవితేజ, వెంకటేష్ తదితరులు నటించిన సినిమాలకు శాటిలైట్ రైట్స్ పరంగా మంచి డిమాండ్ ఉండది. ఈ హీరోలకు ఫ్యామిలీ ప్రేక్షకుల ఫాలోయింగ్ ఎక్కువగా ఉండటంతో పలు టీవీ ఛానల్స్ కోట్లు ఖర్చు పెట్టి శాటిలైట్ రైట్స్ దక్కించుకుంటున్నాయి.


పలు సందర్భాల్లో నిర్మాతలు శాటిలైట్ రైట్స్ రూపంలో అదనపు ఆదాయం సమకూరుతుండటంతో నష్టాల భారిన పడకుండా గట్టెక్కుతుండటం గమనార్హం. ఈ మధ్య కాలంలో శాటిలైట్ రైట్స్ ఎంత ఎక్కువగా వస్తే అంత గొప్పగా ప్రచారం చేస్తున్నారు. శాటిలైట్ వీలైనంత ఎక్కువ రాబట్టం ప్రెస్టీజియ్ ఇష్యూగా మారింది. తెలుగు సినిమా ట్రేడ్ సర్కిల్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం అత్యధికం శాటిలైట్ రైట్స్ రూపంలో ఆదాయం పొందిన సినిమాల టాప్-10 లిస్టు స్లైడ్ షోలో...


రేసు గుర్రం (10)

రేసు గుర్రం (10)


అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రేసుగుర్రం' చిత్రాన్ని జెమిని టీవీ రూ. 7.5 కోట్లు చెల్లించి శాటిలైట్ రైట్స్ దక్కించుకున్నట్లు సమాచారం.


టెంపర్ (9)

టెంపర్ (9)


ఎన్టీఆర్-పూరి చిత్రం ‘టెంపర్' జెమిని టీవీ రూ. 8.7 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం.


బాద్ షా (8)

బాద్ షా (8)


శ్రీను వైట్ల దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన చిత్రాన్ని జెమిని టీవీ రూ. 8 కోట్లు చెల్లించి శాటిలైట్ రైట్స్ దక్కించుకున్నట్లు సమాచారం.


సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (7)

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (7)


మహేష్ బాబు-వెంకటేష్ మల్టీస్టారర్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాన్ని మా టీవీ రూ. 8.5 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం.


లెజెండ్(6)

లెజెండ్(6)


బాలయ్య, బయపాటి కాంబినేషన్లో వచ్చిన లెజెండ్ చిత్రాన్ని జెమిని టీవీ రూ. 8.5 కోట్లుకు దక్కించుకున్నట్లు సమాచారం.


అత్తారింటికి దారేది (5)

అత్తారింటికి దారేది (5)


పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది చిత్రాన్ని మాటీవీ రూ. 9 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం.


గోవిందుడు అందరి వాడేలే (4)

గోవిందుడు అందరి వాడేలే (4)


గోవిందుడు అందరి వాడేలే చిత్రాన్ని జెమిని టీవీ రూ. 9 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం.


ఆగడు (3)

ఆగడు (3)


ఆగడు చిత్రాన్ని జెమిని టీవీ రూ. 9.75 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం.


1-నేనొక్కడినే (2)

1-నేనొక్కడినే (2)


మహేష్ బాబు నటించిన 1-నేనొక్కడినే చిత్రానికి శాటిలైట్ రైట్స్ రూపంలో రూ. 12 కోట్లకు పైగా వచ్చినట్లు ప్రచారం జరిగింది.


బాహుబలి (1)

బాహుబలి (1)


రాజమౌళి చిత్రం రెండు పార్టులు కలిపి జెమినిటీవీ రూ. 25 కోట్లకు దక్కించుకున్నట్లు టాక్.


English summary
Check out the list of Top 10 satellite rights of Tollywood Movies.
Please Wait while comments are loading...